జూ ఎన్టీఆర్ గత సినిమాలకు భిన్నంగా కొత్తలుక్‌తో కనిపించనున్నారు. ఇటీవల ఓ ప్రెస్ మీట్లో జూ ఎన్టీఆర్ సరికొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించిన విషయం తెలిసిందే. జూనియర్ కర్లింగ్ హెయిర్ కాస్త సాఫ్ట్ హెయిర్‌లా తయారైంది. అదంతా కూడా అతను నటిస్తున్న ‘బాద్ షా’ చిత్రం షూటింగులో భాగంగా చేసిన మేకప్ స్టైల్. జూ ఎన్టీఆర్ ఈ చిత్రంలో 7 సరికొత్త హెయిర్ స్టైల్స్‌లో కనిపించనున్నాడు.తాజాగా బాద్ షా చిత్రానికి సంబంధించిన జూ ఎన్టీఆర్ న్యూలుక్ స్టిల్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి విడుదలయ్యాయి. ఫోటోలో కనిపిస్తున్నది ‘బాద్ షా’ చిత్రంలోని స్టిల్లే. కొన్ని పాటల్లో…కొన్నీ సీన్లలో జూనియర్ ఈ ప్రత్యేకమైన హెయిర్ స్టైల్స్‌లో దర్శనం ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం ముంబై నుంచి ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్టులను తెప్పించారు. ఈ సినిమాలో జూనియర్ లుక్ అభిమానులకు, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని తేవడం ఖాయం అంటున్నారు.
మరో వైపు ఈచిత్రానికి సంబంధించి జూ ఎన్టీఆర్ పై విదేశాల్లో చిత్రీకరించిన డాన్స్ వీడియో షాట్ ఒకటి లీక్ అయింది. యూ ట్యూబ్‌లో ఇది హల్చల్ చేస్తోంది. అందులో ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్స్ వేస్తుండటంతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగి పోయాయి.శ్రీను వైట్ల దర్వకత్వంలో రూపొందుతున్న ‘బాద్ షా’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. జూనియర్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. యంగ్ హీరో నవదీప్ ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి గోపీమోహన్, కోన వెంకట్ అద్భుతమైన స్క్రిప్టు అందించారు. బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి సందర్బంగా జనవరి 11, 2013న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more