This article is about diabetes and romance problems| love problem

Love problems and diabetes

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips

This article is about diabetes and romance problems. love problems, diabetes, erectile dysfunction, decreased romance response

డయాబెటిస్‌... మధుమేహవ్యాధి...

Posted: 07/05/2013 11:26 AM IST
Love problems and diabetes

Sexual_Problems_and_Diabetes2

మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో లైంగిక సమస్యలు

డయాబెటిస్‌... మధుమేహవ్యాధి... ఈ పేరు తలుచుకుంటేనే తెలియని భయం, ఆందోళన. వయస్సుతో నిమిత్తం లేకుండా విలయతాండవం చేస్తున్న వ్యాధి ఇది. డయాబెటిస్‌ వచ్చింది అంటే చాలు... ప్రతి రోగి కూడా తమ జీవితం ఇక అరుుపోరుుందనే ఆలోచనలో పడిపోతారు. దేనికీ పనికిరామేమోననే ఆత్మన్యూనత భావం కలుగుతుంది. ఒక్కసారి బ్లడ్గషూగర్‌ కనిపించిందని తెలియగానే, మానసికంగా, శారీరకంగా క్రుంగిపోతున్న వారు కోకొల్లలు. దీనికి నమ్మకమైన పరిష్కారం ఉందని, దీనిపైన అవగాహన పెంచాలని అంటున్నారు మాస్టర్స్‌ ెమియోపతి డైరెక్టర్‌ డాక్టర్‌ మధు. మధుమేహవ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నది. భారతదేశంలో వేగం గా విస్తరిస్తూ, శరీరంలో అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తూ అతలా కుతలం చేస్తున్నది. మనదేశంలో దాదాపు 5 కోట్ల మంది ఈ వ్యాధిన బారిన పడి బాధపడుతున్నారు. 30 సంవత్సరాల లోపు వారు కూడా దీని బారిన పడు తున్నారు. 30 సంవత్సరాల లోపు వస్తే జీవితంలో ఏమీ అనుభవించని పరిస్థితి వస్తున్నది. ఎంత సంపద ఉన్నా, మానసిక, శారీరక ఆనందం లేకపోతే ఇక ఆ జీవనం వృథా అనిపిస్తోంది. 2006 డిసెంబర్‌ 20న ఐక్యరాజ్యసమితి ఈ వ్యాధిని వేగంగా విస్తరించే దీర్ఘ కాలిక వ్యాధిగా నిర్ణయించి, అవగాహన పెంచాలని ప్రకటించింది. వాస్తవాలను గమనిస్తే, ప్రతీ 10 సెకన్లకు ఇద్దరు మధుమేహవ్యాధిగ్రస్తుల జాబితాలో చేరుతున్నారు. రోజుకు కనీసం 200 మందికి ఈ వ్యాధి కారణంగా కాళ్ళను తొలగిస్తున్నారు.

వ్యాధి రావడానికి కారణాలు:

వారసత్వం, అతిగా జంక్‌ఫుడ్స్‌ తినడం, మితిమీరిన ఆహారపు అలవాట్లు, మాన సిక ఒత్తిడి, అదుపులో లేని రక్తపోటు, అధిక బరువు, కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉం డడం, పొగ తాగడం, మద్యపానం, స్టెరాయిడ్స్‌ వాడం, సరైన వ్యాయామం లేకపోవడం మధుమేహవ్యాధిగ్రస్తులకు హైదరాబాద్‌ అగ్రగామిగా నిలుస్తోంది. విచిత్రం ఏమిటంటే మధుమేహం ఉన్నవారిలో 60 శాతం మందికి అది తమకు ఉన్న ట్లుగా తెలియదు. అందుకే దీన్ని సైలెంట్‌ కిల్లర్‌ అని అంటారు. విచిత్రమైన విష యం ఏమిటంటే చాల మంది డయాబెటిస్‌ రోగులకు లైంగిక సమస్యలు ఎదు రవుతున్నాయి. చాలాకాలం నుంచి మధుమేహంతో బాధపడుతున్న వారు అంతకుముందులా దాంపత్యజీవితంలో పాల్గొనలేకపోతున్నామని బాధపడుతు ననారు. దీని వలన చాలామందిలో కోరిక తగ్గిపోతున్నది. భయం వలన సెక్స్‌ సామర్థ్యం తగ్గిపోతున్నదని భావిస్తున్నారు.

చాలా కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్ల వలన మర్మావయవాల దగ్గర దురద, అంగం చివర చర్మం చిట్లిపోవడం వంటి సమస్యలుంటాయి. దీని వలన భయం తో కోరికలు తగ్గుతాయి. దీని వలన అంగస్తంభన, శీఘ్రస్కలనం లాంటివి ఎదురవుతాయి. ఇవన్నీ మధుమేహానికి తోడయి జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే డయాబిటిస్‌ రోగులలో 60 శాతం మంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు. భయం, ఆత్మన్యూనత, మానసిక దుర్భలత్వం లాంటివి మధుమేహంతో వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నరాల సంబంధ వ్యాధులతో సెక్స్‌ కోరికలు తగ్గడం, అంగస్తంభన, శీఘ్రస్కలనం లాం టి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ముఖ్య కారణం హార్మోన్ల లోపాలు, మానసిక ఒత్తిడి, న్యూరోపతి లాంటివి అని చెప్పవచ్చు. డయాబిటిస్‌ ఉన్న వాళ్ళలో ముందుగా కన్పించే సమస్య సెక్స్‌లో అసమర్థత. ఈ సమస్య చాలా మందిలో కనిపించే లోపు డయాబిటిస్‌ తీవ్రతరం అయిన దాఖలాలు ఉన్నాయి. రక్తంలో షుగర్‌ శాతం పెరగడంతో రక్తనాళాల్లో మార్పు లు కనిపిస్తాయి. రక్తనాళాలలోని నరాలు దెబ్బ తిన్నప్పుడు ఇతర అవయవా లలో దుష్ఫలితాలు కనిపిస్తాయి. దీనివలన అంగస్తంభన ముఖ్యమైన సమ స్యగా చెప్పవచ్చు.

అంగస్తంభన ఉన్నవారికి, గుండెకు సంబంధించిన సమ స్యలు ఏవైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఇలాంటివారిలో డయాబెటిస్‌ గుర్తిం చడం జరుగుతోంది. అంగస్తంభన వైఫల్యం ఉన్న వారిలో పొగ తాగే అలవాటు ఉంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. డిప్రెషన్‌ తగ్గించే మందులు వాడే వారిలో కూడా లైంగిక సమస్యలు కలుగుతాయి. షుగర్‌ వ్యాధి ఉన్నవారిలో సమస్యలు ఉన్నప్పుడు రక్తంలో టెస్టోస్టెరోన్‌ లెవల్స్‌ కూడా చూసుకోవాలి. టెస్టోస్టెరోన్‌ హార్మోన్‌ లెవల్‌లో మార్పులు జరిగినప్పుడు షుగర్‌ రావడం, అంగస్తంభన సమస్యలు ఎదురు కావడం చోటు చేసుకుం టాయి. సాధారణంగా అంగస్తంభన వైఫల్యానికి చికిత్స చేసేటప్పుడు డయాబెటిస్‌ వలన వచ్చే దుష్ఫలితాలను కూడా సరిదిద్దుకోవాలి. లైంగిక సమస్యలకు మూల కార ణాన్ని, దాని తీవ్రతను గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి. మూత్రనాళానికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్ల వలన కూడా అంగస్తంభన సమస్య ఏర్పడవచ్చునని కొన్ని పరిశోధనల్లో తేలింది. డయాబెటిస్‌ రోగుల్లో తరచుగా మూత్రనాళానికి ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. డయాబెటిస్‌ ఉన్న వారిలో లైంగిక స్పందనలు తక్కువగా ఉండడం గమనించదగ్గ విషయం.

పరిష్కార మార్గాలు:

•    డయాబెటిస్‌పై అవగాహన పెంచుకోవాలి.
•    ఒత్తిడి లేని జీవన విధానాన్ని అలవరుచుకోవాలి.
•    మానసిక ప్రశాంతత అలవర్చుకోవాలి.
•    ప్రతి రోజూ 40 నిమిషాల పాటు వాకింగ్‌ చేయాలి.
•    మద్యపానం, స్మోకింగ్‌, గుట్కాలు మానివేయాలి.
•    బాదం, పిస్తా, దానిమ్మ, నేరెడుపళ్ళు లాంటివి తినాలి.

హోమియో చికిత్స:

హోమియోపతి వైద్యం శాస్ర్తీయతతో కూడుకున్న వైద్య విధానం. డయాబెటిస్‌ రోగుల్లో వచ్చే లైంగిక సమస్యలకు హోమియోపతి ఒక వరప్రసాదంగా చెప్ప వచ్చు. మానసిక, శారీరక లక్షణాలను ఆధారంగా చేసుకుంటే లైంగిక సమస్య లు తగ్గించడం పెద్ద సమస్య కాదు.

మందులు:

AGNUS CASTUS: కోరికలు అధికంగా ఉంటాయి. కానీ అంగస్తంభన జరుగదు. దీనితో పాటు వీర్యస్కలనం తరచుగా తెలియకుండానే జరుగు తుంది.
Acid PHOS: నిరాశ, అలసటతో బాధపడేవారికి ఈ మందు ఉపయోగకారి. బాధితుల్లో అంగం గట్టిపడదు. గట్టిపడినా వెంటనే మెత్తబడిపోతుంది.
PHOSPHOROUS: లైంగిక వాంఛ ఎక్కువ. కోరికలు ఎక్కువ. శారీరకంగా నీరస పడిపోతారు. భయం, ఆందోళన ఎక్కువ.
Lycopodicm: యువకుల్లో వచ్చే డయా బెటిస్‌కు ఆలోచించదగిన మందు. హస్త ప్రయోగం అలవాటు వలన వచ్చే వ్యాధులకు ఈ మందు బాగా పని చేస్తుంది.
సరైన వైద్యుని పర్యవేక్షణలో మందులు వాడితే డయాబెటిస్‌తో వచ్చే లైంగిక సమస్య లను దూరం చేసుకోవచ్చు.
మేము సాధించిన ఫలితాలే ఇందుకు నిద ర్శనం. సొంతవైద్యంతో రకరకాల ప్రయో గా లు చేసుకుంటే సమస్య ముదిరిపోయే అవ కాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Do not speed toliratri

  తొలి రాత్రి తొందర వద్దు

  Jul 17 | నూతన వధువుతో తొలిరాత్రికి ముస్తాబయ్యే వరుడు కార్యం గదిలో దూకుడుకు ఆస్కారం లేకుండా నెమ్మదిగా, సున్నితంగా వ్యవహరించాలి. సంభోగానికి ఆమెను ఏ మాత్రం బలవంత పెట్టకూడదు. మొరటి భావనలతో ఆమెను శృంగారానికి ప్రేరేపిస్తే అసలుకే... Read more

 • Romance instructions

  విసుగెత్తించే మ్యూజిక్: లైట్లు ఆర్పి చిన్నగా మ్యూజిక్ పెడుతున్నారా?

  Jul 05 | చాలామంది మహిళలు రతిక్రీడకు ముందు పురుషులు చేసే కొన్ని పనులకు అయిష్టం చూపుతారు అవేమిటంటే.....శ్రద్ధగా చదవండి ....మరోమారు భాగస్వామితో కలిసినపుడు ఆచరించండి.విసుగెత్తించే మ్యూజిక్: లైట్లు ఆర్పి చిన్నగా మ్యూజిక్ పెడుతున్నారా? మీ భాగస్వామికి ఏ... Read more

 • One night romance with young girl

  పబ్ లో కొద్దిపాటి పరిచయంతో మొదలైన సంభాషణ

  Jul 05 | పబ్ లో కొద్దిపాటి పరిచయంతో మొదలైన సంభాషణ మరింత సన్నిహితం చేసే ఒక రాత్రి గడిపేటంతవరకు కూడా రావచ్చు. సాధారణంగా నేటి రోజుల్లో అంతవరకు వస్తే, ఎవరికి వారు ఎంత అదృష్టం అనుకోవడం కూడా... Read more

 • No love is secret to long life

  ఇదేంటి కొత్తరకం ట్విస్ట్ అని అనుకుంటున్నారా ?

  Jul 05 | శృంగారం లేకుంటే.. చావేరాదు! ఇదేంటి కొత్తరకం ట్విస్ట్ అని అనుకుంటున్నారా ? నిజమే మీరు సెక్స్ చేయకుండా ఉంటే మీకు చావేరాదట ? దీంతో మీరు జీవితకాలం జీవించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వయసు పెరుగుదలను... Read more

 • Moles on womens breast

  స్ర్తీల వక్షోజాలపై ఉండే పుట్టుమచ్చల ఆకృతులు

  Jul 05 | స్ర్తీల వక్షోజాలపై ఉండే పుట్టుమచ్చల ఆకృతులు, పుట్టుమచ్చ రంగులను బట్టి వారి జీవితంలో పరిణామాలు చోటుచేసుకుంటాయంటాయట. ఆ వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. స్ర్తీ కుడి వక్షోజంపై తిలకం రంగులో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆమె... Read more