Murray withdraw from Aussie Open అండీ ముర్రేకు గాయాలు.. అభిమానల అందోళన

Doubts turn to desperation after andy murray s lost six months

Australian Open 2018, Australian Open, Andy Murray, Novak Djokovic, Kei Nishikori, Rafael Nadal, rublev, QAT, ATP, Tata Open, Tata Open Maharashtra, Tata Open tennis, Marin Cilic, Gilles Simon, Australian Open, sports news, sports, cricket news, cricket, today match, today match score, today match updates

When Andy Murray hobbled away from Centre Court at Wimbledon six months ago, the suspicion that he might never hit a ball over the lush grass there again,

అండీ ముర్రేకు గాయాలు.. అభిమానల అందోళన

Posted: 01/05/2018 07:24 PM IST
Doubts turn to desperation after andy murray s lost six months

బ్రిటన్‌ స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌, ప్రపంచ మాజీ నంబర్‌ వన్‌, 3సార్లు గ్రాండ్‌ స్లామ్‌ ఛాంపియన్‌ ఆండీ ముర్రే కెరీర్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన ముర్రే గాయం కారణంగా అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. రెండు రోజుల క్రితం సీజన్‌ తొలి టోర్నీ బ్రిస్బేన్‌ ఓపెన్‌ నుంచి తప్పుకొని ఆశ్చర్యపరచిన ముర్రే తాజాగా ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్‌ ఆస్ర్టేలియా ఓపెన్‌ నుంచి తప్పుకుంటున్నట్లు భావోద్వేగంగా ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపాడు..

‘దురదృష్టవశాత్తూ..గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ ఏడాది మెల్‌బోర్న్‌లో జరిగే టోర్నీలో నేను ఆడలేకపోతున్నా. ఆస్ట్రేలియా నుంచి లండన్‌ వెళ్లి తదుపరి కార్యాచరణపై ఆలోచించాలి. నాపై మీకున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఫిట్‌నెస్‌ సాధించి కోర్టులో పునరాగమనం చేయాలని కోరుకుంటున్నా అని అభిమానులనుద్దేశించి’ ఈ వ్యాఖ్యలు చేశాడు.

గతేడాది జరిగిన వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఆమెరికా ప్లేయర్‌ సామ్‌ క్వెర్రీ చేతిలో ముర్రే పరాజయం కావడంతో ర్యాంకింగ్స్‌లో 16వ స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌ ఈనెల 15న ఆరంభంకానుంది. ముర్రే నిష్ర్కమణతో స్పెయిన్‌ క్రీడాకారుడు రఫెల్‌ నాదెల్‌, స్విస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ల మధ్యే రసవత్తర పోరు జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles