దుబాయ్ ఓపెన్: సెమీస్ లోకి దూసుకెళ్లిన బొప్పన్న జోడి Rohan Bopanna and Marcin Matkowski march into semi-finals

Rohan bopanna and marcin matkowski march into semi finals

Marcin Matkowski, Dubai Duty Free Tennis Championships, India, doubles semi-finals, Rohan Bopanna, Leander Paes, Dubai Open, Romania, Florin Mergea, Serbia’s Viktor Troicki, sports news, sports, tennis news

India’s Rohan Bopanna and his partner Marcin Matkowski from Poland reached the doubles semi-finals of the Dubai Open.

దుబాయ్ ఓపెన్: సెమీస్ లోకి దూసుకెళ్లిన బొప్పన్న జోడి

Posted: 03/02/2017 09:25 PM IST
Rohan bopanna and marcin matkowski march into semi finals

దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్‌ నంబర్‌వన్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న సత్తాచాటాడు. దుబాయ్ లో జరుగుతున్న ఈ ఛాంపియన్ షిప్ లో క్వార్టర్ ఫైనల్ లోకి దూసుకెళ్లిన బోప్పన్న టైటిల్ సాధనకు మరో రెండు అడుగుల దూరంలో నిలిచాడు. ఈ సీజన్ లో నలుగురు వివిధ ఆటగాళ్లతో జతకట్టిన రోహన్‌ బోపన్న దుబాయ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో పోలండ్‌ ప్లేయర్ మత్కోవోస్కీతో కలిసి దుమ్మురేపుతున్నాడు. టోర్నీలోని పురుషుల డబుల్స్‌ విభాగంలో ఈ జోడి సెమీఫైనల్‌కు చేరుకుంది.

క్వార్టర్స్‌లో ఫ్లోరిన్‌ మెర్జియా(రొమేనియా), విక్టోర్‌ ట్రైకీ(సెర్బియా) జోడీపై 6-3, 6-4 వరుస సెట్లతో బోపన్న జోడీ గెలుపొందిన బోప్పాన్న జోడి.. సెమీస్ లో మరో భారత ఆటగాడు లియాండర్‌ పేస్‌ జోడిని ఎదుర్కోనున్నాడు. స్పానిష్ అటగాడు గొల్లెర్ మో గార్సియా లోపెజ్ తో జతకట్టిన లియాండర్ పేస్ జోడీ.. ఈ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. అయితే క్వార్టర్స్ లో ఈ జోడీ కెనడా డేనియల్ నెస్టర్, ప్రెంచ్ కు చెందిన రోగర్ వాస్సెలిన్ జోడిని ఓడించిన పక్షంలో సెమీస్‌లో బోపన్న జోడీతో తలపడాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Marcin Matkowski  India  doubles semi-finals  Rohan Bopanna  Leander Paes  Dubai Open  tennis  

Other Articles

Today on Telugu Wishesh