Novak Djokovic reveals match fixing approach

Novak djokovic reveals match fixing approach

Novak Djokovic , Tennis, match fixing, Novak Djokovic on Match fixing, Match fixing alligations

World number one Novak Djokovic said he was approached to fix a match earlier in his career on Monday as allegations of corruption in tennis rocked the start of the Australian Open. The BBC and BuzzFeed claimed 16 players who had reached the top 50 in the past decade, including Grand Slam champions, had been repeatedly suspected of fixing matches for betting syndicates.

టెన్నిస్ లోనూ మ్యాచ్ ఫిక్సింగ్.. జకోవిచ్ స్పష్టం

Posted: 01/18/2016 06:34 PM IST
Novak djokovic reveals match fixing approach

నిన్నటి దాకా కేవలం క్రికెట్ వరకు మాత్రమే ఉంది అనుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ టెన్నిస్ లో కూడా ఉన్నట్లు తేలింది.  టెన్నీస్ క్రీడాభిమానాలు. మొత్తం 16 మంది క్రీడాకారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత దశాబ్దకాలంగా టాప్ 50లో ఉంటున్న ఈ క్రీడాకారులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినపడతున్నాయి. ఫిక్సింగ్ కు సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయని తెలుపుతున్నారు అధికారులు.  ఆస్ట్రేలియా ఓపెన్ లో పాల్గొంటున్న 8 మంది టాప్ సీడ్ క్రీడాకారుల పాత్ర ఉన్నట్లు చెబుతున్నాయి బీబీసీ – బజ్ ఫీడ్ వర్గాలు. 2007 – 2009 మధ్య జరిగిన మ్యాచ్ లలో అవినీతి జరిగినట్టు తెలుపుతున్నాయి. అయితే దీనిపై స్పందించిన టెన్నీస్ సమాఖ్య టెన్నీస్ లో అవినీతి రూపుమాపడానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది.

అయితే టెన్నిస్ క్రీడలో రారాజుగా పేరున్న జకోవిచ్ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ మీద బాంబు పేల్చారు. 2007లో తనను కూడా బెట్టింగ్ దళారులు పరోక్షంగా ఆశ్రయించారని జకోవిక్‌ తెలిపారు. దాంతో టెన్నిస్ ఆటలో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఏమేరకు ఉందో అని అందరు చర్చించుకుంటున్నారు. అప్పట్లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవాలని తనకు  దళారులు చెప్పారని అన్నారు. అయితే తాను వెంటనే దళారుల ఆఫర్‌ను తిరస్కరించానని, తాను గట్టిగా స్పందించడంతో వారు మళ్లీ తన జోలికి రాలేదని జకోవిక్‌ తెలిపారు. టెన్నిస్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌పై బీబీసీ కథనాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. అప్పుడప్పుడు టెన్నిస్‌లో ఇలాంటి ఆరోపణలు రావడం తన దృష్టికి కూడా వచ్చిందని తెలిపారు. మ్యాచ్ ఓడిపోతే రెండు లక్షల డాలర్లు ఇస్తామని జకోవిక్‌కు దళారులు ఆఫర్‌ చేసినట్టు తెలిసింది. దాంతో టెన్నిస్ సమాఖ్య మీద విమర్శలు వస్తున్నాయి. అసలు ఎక్కడా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు సమాచారం లేదని చెప్పడం మీద విమర్శలు రాగా.. దీని మీద చర్యలకు పూనుకుంటామని టెన్నిస్ ఫెడరేషన్ ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Novak Djokovic  Tennis  match fixing  Novak Djokovic on Match fixing  

Other Articles