Unstoppable: Sania-Martina set record with 29th consecutive win, enter Sydney final

Sania mirza martina hingis notch up record win

sania mirza, sania mirza india, sania mirza tennis, martina hingis, hingis, sania mirza martina hingis, sania hingis, india tennis, tennis india, sydney international, sydney tennis, tennis news, tennis

Sania Mirza and Martina Hingis won 28th consecutive match to equal record set by Gigi Fernandez and Natasha Zvereva in 1994.

ప్రపంచ రికార్డును బ్రేక్ చేసిన సానియా-హింగీస్

Posted: 01/14/2016 03:19 PM IST
Sania mirza martina hingis notch up record win

భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ప్రపంచ రికార్డును నెలకోల్పింది. గత ఏడాది నుంచి ప్రారంభమైన సానియా వరుస విజయాల జోరు అప్రతిహాసంగా కోనసాగుతూ.. ఈ ఏడాదిలో కూడా అజేయంగా దూసుకుపోతుంది. ఈ క్రమంలో సానియా మరో అరుదైన రికార్డును తన పేరున నమోదు చేసుకుంది. తన టెన్నీస్ భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో జోడీగా ఏర్పడిన తరువాత రికార్డులను తిరగరాసుకుంటూ మున్ముందుకు కొనసాగుతోంది. తాజాగా ఈ జోడీ మరో రికార్డు నమోదు చేసింది. గతేడాది ఓవరాల్గా 10 డబ్ల్యూటీఏ టైటిల్స్ నెగ్గిన సానియా-హింగిస్ లు మహిళల డబుల్స్లో వరుసగా 29 మ్యాచ్లు గెలిచి అత్యధిక విజయాలు సాధించిన జోడిగా నిలిచారు.

సిడ్నీ ఇంటర్నేషనల్ పోటీలలో భాగంగా గురువారం జరిగిన మహిళల డబుల్స్ మ్యాచ్లో విజాయాన్ని అస్వాధించిన ఈ జోడీ.. 1994లో నమోదైన రికార్డును అధిగమించింది. నిన్నటి మ్యాచ్ లో గత రికార్డును సమం చేసిన సానియా జోడి.. ఇవాళ రికార్డును తమ పేరున లిఖించుకున్నారు. ఇవాళ జరిగిన మ్యాచ్ లో రోమేనియాకు చెందిన రాలుకా ఒలారు, కజకిస్థాన్ కు చెందిన యారోస్లావా ష్విడోవా  జోడిపై 6-4, 6-3 10-8 తేడాతో డబుల్స్ నంబర్ వన్ ద్వయం గెలిచింది. ఈ విజయంతో ఈ ఇండో-స్విస్ ద్వయం సిడ్నీ ఓపెన్‌లో ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో 1994లో డబుల్స్ ద్వయం గిగి ఫెర్నాండేజ్, నటాషా జ్వెరేవా నెలకొల్పిన వరుస విజయాల రికార్డును సానియా-హింగిస్ జోడీ బ్రేక్ చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles