Korea Open results: Ajay Jayaram reaches semis after defeating Sho Sasaki

Jayaram stuns sho sasaki to seal semifinal spot at korea open

Korea Open results,Ajay Jayaram,Ajay Jayaram Reaches Semis,Ajay Jayaram Reaches Semis after defeating Sho Sasaki,Ajay Jayaram Semi finals,Ajay Jayaram Korea Open, sho sasaki, semi final, korea open badminton series, japanese player, Viktor Axelsen

Ajay Jayaram's fairytale run in the ongoing Korea Open continues as he came up with yet another sensational performance to reach the semi finals of the competition. 21-19, 16-21 and 21-16.

కొరియా ఓపెన్ సెమీస్ లోకి దూసుకెళ్లిన అజయ్ జయరామ్

Posted: 09/18/2015 06:58 PM IST
Jayaram stuns sho sasaki to seal semifinal spot at korea open

కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ లో భారత్ ధేశం తరపున పోరాడుతన్న ఒకే ఒక్కడిగా అజయ్ జయరామ్ ఇప్పుడు వార్తల్లోని వ్యక్తిగా మారాడు. కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ లో భారీ అంచనాలతో రంగంలోకి దిగిన భారత భారత స్టార్ ఆటగాళ్లు కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ లు టోర్నీ నుంచి నిష్ర్రమించారు. అటు మహిళల విభాగంలో ప్రపంచ టాప్ ర్యాంకర్ గా బరిలో దిగిన సైనా నెహ్వాల్ కూడా పరాజయం పాలై స్వదేశానికి తిరుగు ముఖం పట్టింది. అయితే ఎలాంటి  అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అజయ్ జయరామ్ మాత్రం సెమీస్ కు దూసుకెళ్లాడు.

కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ లో భారత్ తరపున పోరాడుతున్న అజయ్ జయరామ్ తొలి రౌండ్ లో విక్టర్ అక్సెల్ సన్ ను ఓడించినప్పటి నుంచి ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ.. ఇక వెనుదిరిగి చూడకుండా సెమీస్ కు చేరాడు. ఇవాళ జరిగిన క్వార్టర్ లో జపాన్ ఆటగాడు షో ససాకీని ఖంగుతినిపించాడు. క్వార్టర్ ఫైనల్ పోరులో జయరామ్ 21-19, 16-21, 21-16 తేడాతో జపాన్ ఆటగాడు షో ససాకీని బోల్తా కొట్టించి సెమీస్ లోక ప్రవేశించాడు. జపాన్ క్రీడాకారుడితో జరిగిన పోటీలో తన సత్తాను చాటాడు జయరామ్. అయితే క్వార్టర్ మ్యాచ్ అంత తేలికైంది కాకపోయినా.. ప్రత్యర్థి బలమైనవాడని తెలిసినా జయరామ్ ఎలాంటి జంకుబోంకు లేకుండా తన సత్తాను చాటాడు.

తొలి గేమ్ నుంచి ప్రత్యర్థిపై పై చేయి సాధించేందుకు యత్నించిన జయరామ్.. తొలి గేమ్ ను కొంత కష్టపడి గెలిచాడు. రెండో గేమ్ లో జపానీస్ అటగాడు తన సత్తాను ప్రదర్శించడంతో జయరామ్ గేమ్ ను కోల్పోయాడు.  రెండో సెట్ తొలి అర్థభాగంలో జయరామ్  6-1 తేడాతో ముందంజలో పయనించినా.. షో ససాకీ వరుసగా ఐదు పాయింట్లు సాధించి ఆ సెట్ ను చేజిక్కించుకున్నాడు. దీంతో మూడో సెట్ కీలకంగా మారింది. ఆ సెట్ లో తిరిగి పుంజుకున్న జయరామ్ ఆద్యంతం ఎదురుదాడికి దిగి షోససాకీని కోలుకోనీయకుండా చేశాడు. ఈ సిరీస్ లో కొంత ఘాటుగా, హాటుగా కనిపించిన అజయ్ జయరామ్.. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లోని మూడో గేమ్ లోనూ అలానే అగుపించాడు. ఏకంగా షో ససాకీ ఎలాంటి అవకాశం దక్కకుండానే మూడో సెట్ ను గెలుచుకున్నాడు. ఈ తాజా గెలుపుతో ఇరువురి ముఖాముఖి రికార్డును జయరామ్ 1-2 కు తగ్గించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ajay jayaram  sho sasaki  semi final  korea open badminton series  

Other Articles