భారత టెన్నిస్ అభిమానులకు డబుల్ బోనాంజా అందించిన మన స్టార్ క్రీడాకారులు ఇవాళ స్వదేశానికి తిరిగివచ్చారు. ప్రపంచ మహిళల డబుల్స్ నెంబర్ వన్ రాంకర్, భారత స్టార్ షెట్లర్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా సహా లీయాండర్ పేస్లు యూఎస్ టోర్నమెంటులో డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ రెండు టైటిళ్లను సాధించి.. సగర్వంగా స్వదేశానికి తిరిగివచ్చారు. న్యూయార్క్ లో జరుగిన యూఎస్ ఓపెన్ లో ఈ ఫీటును సాధించిన సానియా, పేస్ లకు టెన్నీస్ అభిమానులు ఘనంగా స్వాగతాలు పలికారు. కాగా ఈ విజయాలను సాధించడంలో వీరిద్దరికీ జోడీగా వ్యవహరించింది మాత్రంం స్విస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్. దీంతో ఇండో స్వీస్ జోడీ తిరుగులేదనన్న అభిప్రాయానికి భారత టెన్నిస్ అభిమానులు వచ్చారు.
తాను సాధించిన యూఎస్ ఓపెన్ విజయాన్ని దేశ ప్రజలకు అంకితం ఇస్తున్నానని టెన్నిస్‌స్టార్ సానియామీర్జా చెప్పారు. హైదరాబాద్‌కు చేరుకున్న సానియామీర్జాకు శంషాబాద్ విమానాశ్రయంలో ఆమె కుటుంబసభ్యులు, మిత్రులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె తన యూఎస్ ఓపెన్ టైటిల్ ను దేశప్రజలకు అంకితమిస్తున్నట్లు వెల్లడించారు. యూఎస్ ఓపెన్ గెలవడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఈ సంవత్సరం తనకు అద్భుతంగా ఉందని సానియామీర్జా పేర్కొన్నారు. ఇటీవలే క్రీడాకారులకు లభించే అత్యుత్తమ క్రీడాపురస్కారాన్ని పోందిన సానియా.. తన ఖాతాలో యూఎస్ ఓపెన్ ను కూడా వేసుకోవడం పట్ల టెన్నీస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more