World's first underwater tennis court | underwater tennis court | Dubai

World s first underwater tennis court to be built in dubai

World's first underwater tennis court, Dubai Underwater tennis court, Krzysztof Kotala, Dubai Duty Free, Dubai Duty Free Tennis Championships, Tennis Championships, Tennis, tennis news

Dubai, which boasts of the world's highest tennis court, may also become home to the first underwater tennis centre where spectators can watch games from below or above the sea life through a massive glass dome.

దుబాయ్ లో తొలిసారిగా నీటి అడుగున టెన్నీస్ స్టేడియం..

Posted: 05/20/2015 05:23 PM IST
World s first underwater tennis court to be built in dubai

నిత్యవినూత్నకు దుబాయ్ పెట్టింది పేరు. ప్రపంచంలో ఎక్కడా జరగని అబ్బురపర్చే నిర్మాణాలు, స్టేడియంలు దుబాయ్ సోంతం. వినూత్న విజ్జానానికి బాటలు వేసేలా నిత్యం ఏదో ఒక కొత్త ఒరవడికి దుబాయ్ వాసులు శ్రీకారం చుడుతూనే వుంటారు. టెన్నిస్‌ దిగ్గజాలు రోజర్‌ ఫెడరర్‌, ఆండ్రూ అగస్సీ 2005లో ఎతైన ప్రదేశంలో టెన్నిస్‌ ఆడి రికార్డు సృష్టించారు. ఇక్కడి బుర్జ్‌ అల్‌ అరబ్‌లోని ఎతైన ప్రదేశంలోని హెలిపాడ్‌లో వీరు టెన్నిస్‌ ఆడారు. ఇప్పుడు తాజాగా పోలండ్‌కు చెందిన ఆర్కిటెక్ట్‌ టెన్నిస్‌ను భూమి కింది భాగానికి తీసుకెళ్లాని భావిస్తున్నారు. క్రిజ్‌టాఫ్‌ కొటాలా అనే ఈ ఆర్కిటెక్ట్‌ నీళ్ల అడుగు భాగాన టెన్నిస్‌ కోర్టును నిర్మించే డిజైన్‌ను రూపొందించారు. దీన్ని ఫేస్‌ బుక్‌లోని 8 ప్లస్‌ 8 పేజిలో కాన్సెప్ట్‌ స్టూడియో పేరుతో పెట్టారు.

ఈ చిత్రంలో ఓ పెద్ద గాజుతో పైకప్పు గల ఈ స్టేడియంలో పైభాగాన రక రకాల చేపలు కనిపిస్తుంటాయి. అయితే ఈ స్టేడియం నిర్మాణం అసాధ్యమని కొందరు ఇంజినీర్లు అంటున్నారు. ఒకవేళ ఈ స్టేడియం నిర్మాణం సాధ్యమైనప్పటికీ పైభాగాన తిరుగులాడే చేపలు ఆటగాళ్ల ఏకాగ్రతకు భంగం కలిగిస్తాయని చెబుతున్నారు. కానీ తన ఈ ఆలోచన అసాధ్యమేమీ కాదని పెట్టుబడిదారులు ఎవరైన ముందుకు వస్తే చేసి చూపిస్తానని కొటాలా ధీమాగా అంటున్నారు. వరల్డ్‌ ఐలాండ్స్‌ అభివృద్ధిలో భాగంగా యూరప్‌లో క్లీన్‌డీసింట్స్‌ గ్రూప్‌ అనే సంస్థ మూడు స్థాయిల్లో ఓ అపార్ట్‌మెంట్‌ను నిర్మించింది. నీళ్ల అడుగుభాగాన ఒకటి, సముద్ర మట్టానికి సమాన స్థాయిలో మరొకటి, భూమి ఉపరితలంలో మరొకటి నిర్మించింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles