Sania mirza hsu v st double lost semi final match brisbane open tennis tournament

sania mirza latest news, sania mirza brisbane open tournament, brisbane open tennis tournament, sania mirza tennis matches

sania mirza Hsu v St double lost semi final match brisbane open tennis tournament

మైదానంలో సానియాకు కోలుకోలేని షాక్!

Posted: 01/10/2015 02:41 PM IST
Sania mirza hsu v st double lost semi final match brisbane open tennis tournament

గతకొన్నాళ్ల నుంచి వరుసగా విజయ కెరటాలను ఎగురవేస్తూ దూసుకుపోతున్న భారతీయ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఓ మైదానంలో కోలుకోలేని గట్టి షాక్ తగిలింది. సునాయాసంగా ఆటను ముగించేస్తుందని అంతా అనుకుంటుండగానే అందరికీ షాక్ తగిలేలా అమ్మడు చేజేతులు మ్యాచ్’ను ఓడిపోయింది. చివరి నిముషం దాకా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్’లో జట్టును గెలిపించడంలో సానియా గెలిచేందుకు చాలానే ప్రయత్నాలు చేసింది కానీ.. తానే కోలుకోలేని విధంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

బ్రిస్బేన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్’లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్) - సు వి సెయి (చైనీస్ తైపీ) జోడీ మొదటి నుంచి తమ ప్రతిభను కనబరుస్తూ ప్రత్యర్థులను ఓడిస్తూ సెమీ ఫైనల్ దాకా చేరుకున్నారు. ఇక ఆ మ్యాచ్ కూడా ఈ జోడి గెలుస్తుందని అంతా అనుకున్నారు కానీ.. చివరినిముషంలో ఆ ఆశలన్నీ పటాపంచులయ్యాయి. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా - సువి సెయి జోడి 6-4, 6-7(1/7), 8-10 స్కోరుతో నాలుగో సీడ్ కరోలైన్ గార్సియా (ఫ్రాన్స్) - కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంట చేతిలో ఓడిపోయింది.

దాదాపు 1 గంటా 37 నిముషాలపాటు సాగిన ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. మొదట్లో సానియా జంట తమ ప్రతిభను బాగానే కనబర్చిచారు. సానియా జంట నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. యితే సూపర్ టైబ్రేక్‌లో మాత్రం సానియా జంట తడబడి ఓటమి పాలైంది. సెమీస్‌లో ఓడిన సానియా జోడీకి 13,194 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 లక్షల 22 వేలు)తోపాటు 185 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza latest  brisbane open tennis tournament  

Other Articles