Mcgrath backs quality player watson for 4th test

Australian fast bowler Glenn McGrath, Australian all rounder shane watson, Sydney Cricket Ground, fourth Test at Sydney, mc grath backs watson, mc grath hails watson as quality player, mc grath latest news, mc grath updated news, shane watson latest news, shane watson updated news

Australian fast bowling legend Glenn McGrath has backed Shane Watson and predicted a return to form for the struggling all-rounder in the fourth Test at the Sydney Cricket Ground (SCG) beginning Tuesday.

వాట్సన్ కు మద్దుగా నిలచిన మెక్ గ్రాత్

Posted: 01/03/2015 09:56 PM IST
Mcgrath backs quality player watson for 4th test

అస్ట్రేలియా పాస్ట్ బౌలింగ్ లెజెండ్ మెక్ గ్రాత్ తన సహచరుడు షేన్ వాట్సన్ మద్దతుగా నిలిచాడు. ఫామ్ లేమితో తీవ్రంగా బాదపడుతున్న అస్ట్రేలియన్ అల్ రౌండర్ షేన్ వాట్సన్ తాను నాల్గవ టెస్టునుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీనికి తోడు సిడ్నీలో ఈ నెల 6 నుంచి జరుగనున్న నాల్గవ టెస్టు కోసం తన జట్టు సహచరులతో కలసి ఎస్ సీ జీ గ్రౌండ్స్ కు హాజరుకాలేదు. దీంతో నాల్గవ టెస్టుకు ఆయన దూరం అవుతున్నారన్న వార్తలు నిజమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సన్ కు మెక్ గ్రాత్ మద్దతుగా నిలిచారు. ఫామ్ లో లేని కారణాంగా తను నాల్గవ టెస్టునుంచి తప్పుకుంటున్నట్లు ఆయన చెప్పడాన్ని మెక్ గ్రాత్ సమర్ధించాడు. వాట్సన్ ఆటపై తనకు పూర్తి నమ్మకం వుందని, ఆయన ఒక నాణ్యత కలిగిన ఆల్ రౌండర్ అంటూ పేర్కోన్నారు. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని మళ్లీ జట్టులోకి రావాలని మెక్ గ్రాత్ ఆకాంక్షించాడు.

ఆల్ రౌండర్ గా జట్టులో చేరిన తాను బ్యాటింగ్ లో రాణించడం లేదని, తరచుగా విఫలం కావడంతో వాట్సన్ నాల్గవ టెస్టు నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటన మంచిదన్నారు. మూడవ వరుస క్రమంలో బ్యాటింగ్ కు దిగుతున్న వాట్సన్ ఎంత ప్రయత్నించినా విఫలం అవుతన్నానని గ్రహించాడని, దీంతో తనపై విపరీతమైన ప్రభావం పడుతుందని, దానిని వదిలించుకోవడానికే తాను నాల్గవ టెస్టు నుంచి తప్పుకుంటున్నాట్లు ప్రకటించాడని మెక్ గ్రాత్ తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : McGrath  shane' Watson  Ind vs Aus series 2014  4th Test  

Other Articles