Differences between sania mirza and shoaib malik

sania mirza, shoib malik, sania mirza and shoaib malik,

Sania Mirza Divorce From Shoib Malik.

సానియా-షోయబ్ పెళ్లి పెటాకులు

Posted: 01/13/2014 10:04 AM IST
Differences between sania mirza and shoaib malik

హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పెళ్లి పెటాకులు కావడానికి సిద్దంగా ఉందా ? గత కొంత కాలంగా ఆమె తన భర్త షోయబ్ మాలిక్ కి దూరంగా హైదరాబాద్ లోనే ఉండటంతో పలువురు ఈ వార్తలకు తెరలేపారు. తన చిన్ననాటి స్నేహితుడు సోహ్రాబ్ ని కాదని, పాకిస్థానీ క్రికెట్ ఆటగాడు అయిన షోయబ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సానియా మీర్జా సంపారం కొంతకాలం బాగానే సాగినా గత కొన్ని రోజులు కిత్రం వీరిద్దరి మధ్య పొరపొచ్చాలు రావడంతో సానియా హైదరాబాద్ వచ్చేసి ఈమె ఇక్కడ, షోయబ్ అక్కడ ఒంటరిగా ఉంటున్నారని అంటున్నారు.

భారత్ తరుపున టెన్నిస్ ఆడిన సానియా మీర్జా ఎన్నో సంచలనాలు స్రుష్టించి, తొలి గ్రాండ్ స్లామ్ సంపాదించిన మహిళగా చరిత్రలోకి ఎక్కింది. ఆటతోనే కాకుండా అందంతో కూడా ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకునే సానియా అంటే ప్రేక్షకులకు పిచ్చి కూడా. షోయబ్ తో విడిపోవడానికి కొన్ని బలమైన కారణాలే ఉండి ఉంటాయని అంటున్నారు. మీడియాలో వస్తున్న ఈ ఊహాగానాల్లో నిజమెంతో అబద్దం ఎంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అన్యోన్యంగా ఉండాల్సిన ఈ దంపతులు ఇలా విడిపోవడం కాస్త విచార కరమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles