mythological story of chyanava wife sukanya on whom ashwini gods doubted her | telugu historical stories

Mythological story of chyanava wife sukanya who is beautiful princess

chyavana story, story of chyavana, chyavana wife sukanya, beautiful women sukanya, sukanya mythological story, ashwini god play game with sukanya

mythological story of chyanava wife sukanya who is beautiful princess : mythological story of chyanava wife sukanya on whom ashwini gods doubted her.

పతివ్రతతో పరిహాసాలాడిన అశ్వినీదేవతలు

Posted: 11/06/2015 03:09 PM IST
Mythological story of chyanava wife sukanya who is beautiful princess

పూర్వం.. చ్యవనుడు అనే మహర్షికి సుకన్య అనే రాజకుమార్తెతో వివాహం అయ్యింది. చ్యవనుడు అంధుడు మాత్రమే కాకుండా చాలా ముసలివాడు అయినప్పటికీ.. కుందనపుబొమ్మలా వుండే సుకన్య తన యవ్వనాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పతివ్రతా నియమంతో భర్తకు సేవలు చేస్తూ, తన సతీధర్మాన్ని పాటిస్తూ వచ్చింది. ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో చ్యవనుడు తన భార్య సుకన్య మనసును పరీక్షించాలని కోరుకుంటాడు. అందుకు తనదైన ప్రణాళికను సిద్ధం చేసుకుంటాడు. అప్పటికే ముసలివాడు, అంధుడు అయిన చ్యవనుడు.. నెమ్మనెమ్మదిగా కుష్టురోగిలా మారాడు. అయినా సుకన్యకు తన భర్తపై ప్రేమ తగ్గలేదు కాదు.. అతనికి మరింత సేవ చేసింది.

ఒకరోజు సుకన్య తన భర్తకు అన్నం వడ్డించింది. చ్యవనుడు భోజనం చేస్తుండగా.. సగం భోజనం తిన్న తర్వాత.. అతని చేతి బొటనవేలు ఊడి అన్నంలో పడింది. దాంతో తానింకా భోజనం చెయ్యనంటూ దానిని పక్కనపెట్టేశాడు. అప్పుడు సుకన్య ఆ ఆహారాన్ని తినేందుకు సిద్ధపడుతుంది. అందులో ఉన్న ఆ బొటన వేలును తీసి ప్రక్కన పెట్టి, ఆ ఆహారాన్ని భుజించింది. తన యోగా దృష్టితో అది గ్రహించిన చ్యవనుడు పరమానందభరితుడై సుకన్యను మెచ్చుకున్నాడు. ఆమెను ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు సుకన్య.. ‘మీరు నవయవ్వన వుంతులై అపురూపమైన రూపం ధరిస్తే, మీతో కలిసి సంసార సుఖాలు అనుభవించాలని వుంది’ అని కోరింది. ‘నీ కోరిక తీరుతుంది. నదీస్నానం చేసిరా’ అన్నాడు చ్యవనుడు. భర్త చెప్పినట్లుగానే ఆమె నదీస్నానానికి వెళ్లింది. అక్కడ ఆమెకు అశ్వినీదేవతలు ఎదురై ‘సుందరీ... వృద్ధుడూ, అంధుడూ, కుష్ఠురోగి అయిన ఆ భర్తకుసేవలు చేస్తూ, నీ యవ్వనమంతా ఎందుకు వృథా చేసుకుంటావు. మమ్మల్ని వరించు. నీకు స్వర్గసుఖాలు అందిస్తాము’ అన్నారు. వారి మాటలు విన్న సుకన్య.. భయంతో భర్త దగ్గరకు వెళ్లి జరిగిన తతంతాన్ని వివరించింది. దాంతో కోపాద్రిక్తుడైన చ్యవనుడు.. తన భార్యను తీసుకుని వారి దగ్గరకు వెళ్లాడు. ‘పతివ్రత అయిన నా భార్యతో ఇలా పరిహాసాలు ఆడవచ్చునా’ అనివారిని ప్రశ్నించాడు.

అప్పుడు అశ్వనీదేవతలు ఓ నవ్వు నవ్వుకుని.. ‘ఈమె అంతటి పతివ్రతయా! అదెంత వరకూ నిజమో పరీక్షించాల్సినదే’ అని అంటారు. ఆ పరీక్షలో భాగంగా ఆ ఇద్దరూ అశ్వినీదేవతలు తమతోపాటు చ్యవనుని వెంట తీసుకుని నదిలో మునిగి పైకి లేచారు. వెంటనే ముగ్గురూ అద్భుత సౌందర్యవంతులుగా మారి నదిలోంచి బయటకు వచ్చారు. ఆ ముగ్గురిని చూసి సుకన్య ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. అప్పుడు ఆ ముగ్గురిలో ఒకరు.. ‘సుందరీ, మాలో నీ భర్తను గుర్తిస్తే, నీవు పతివ్రతవని ఒప్పుకుని వెళ్లి పోతాం’ అని అంటారు. కాసేపు ఆలోచించిన అనంతరం సుకన్య తన పాతివ్రత్య మహిమతో చ్యవన మహర్షిని గుర్తించింది. దీంతో సంతోషించిన అశ్వినీ దేవతలు సుకన్యను ప్రశంసించారు. అలాగే.. చ్యవనునికీ దక్కిన ఆ సౌందర్యము, యవ్వనము అలాగే వుంటాయని.. అతడు కోరుకున్నప్పుడు అతని రూపం తిరిగి వస్తుందని వరమిచ్చారు. వారి వరానికి సంతోషించిన చ్యవనుడు.. ఇక నుంచి యజ్ఞులలో సోమపానం చేసే అర్ఙత మీకు కలిగిస్తున్నానని అశ్వినీ దేవతలకు వరమిచ్చాడు.

ఆ తర్వాత నవయవ్వనవంతుడైన చ్యవనుడు, తన భార్య అయిన సుకన్యతో కలిసి, తన మామగారు శర్యాతి మహారాజు చేస్తున్న యాగానికి వెళ్లాడు. యవ్వనవంతుడైన యువకునితో కలిసి సుకన్య రావడం చూసి, శర్యాతి తన కుమార్తె శీలాన్ని శంకించాడు. అక్కడ అశ్వినీ దేవతలు ప్రత్యక్షమై జరిగినదంతా శర్యాతికి వివరించి చెప్పారు. శర్యాతి తన కుమార్తె అదృష్టానికి చాలా సంతోషించాడు. ఆ యజ్ఞంలోనే చ్యవనుడు తొలిసారిగా అశ్వినీ దేవతలకు యజ్ఞ హావిర్భాగమైన సోమపానాన్ని అందించాడు. అశ్వినీదేవతలు, సుకన్య, చ్యవనులను దీవించి వెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chyavana story  chyavana wife sukanya  

Other Articles

 • Hathiram math historical story who played dice game with lord venkateswara

  దేవుడైన వెంకటేశ్వరునితోనే పాచికలు ఆడిన భక్తుడు

  Nov 18 | పూర్వం భక్తులు తమతమ ఇష్టదైవాలను ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే.. సాక్షాత్తూ దేవుళ్ళే స్వయంగా భువికి దిగివచ్చి వారి కోర్కెల్ని నెరవేర్చేవారు. అలా తన భక్తితో వెంకటేశ్వరుడు మెప్పించిన అపరభక్తుడు బావాజీ.. ఆయనతో కలిసి... Read more

 • Khandava vanam mythological story krishnarjuna history indrudu special story

  ఇంద్రుని అహంకారాన్ని అణిచిన కృష్ణార్జునులు

  Nov 02 | స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రునికి అహంకారం ఎక్కువ. భువిపై వున్న మానవులందరూ తన ద‌యాదాక్షిణ్యాల మీదే ఆధార‌ప‌డి ఉన్నార‌నీ, త‌న‌ని భ‌య‌భ‌క్తుల‌తో కొలిస్తే కానీ వారికి మ‌నుగ‌డ వుండదని  విర్రవీగుతుంటాడు. అయితే.. కృష్ణుడు అతని... Read more

 • Mythological story of pulomudu loved beautiful girl puloma

  గర్భిణిని కామించిన పులోముడి గాధ

  Oct 07 | పూర్వం ‘పులోమ’ అనే అతిలోక సౌందర్యవతి వుండేది. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడైన ‘పులోముడు’ అనే దైత్యుడు.. ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా అనుకున్న వెంటనే తన మనోరథాన్ని పులోమ తండ్రికి తెలిపాడు.... Read more

 • Lord krishna gold hill donation game between arjuna and karna ramayan stories

  కృష్ణుడు ఆడిన ‘దాన’ నాటకం..!

  Sep 22 | మహాభారతంలో కీలకపాత్రుడైన కర్ణుడు.. ఆనాడు దాకకర్ణుడనని ప్రసిద్ధి. తనకు తోచించి ఇతరులకు దానం చేయడంలో ఇతను దిట్ట. బంగారమైనా, మరేమైనా సరే.. దానం చేయడంలో కర్ణుడిని మించినవాడు ఎవడూ లేడు. పైగా.. కృష్ణుడు సైతం... Read more

 • The story of vali

  తమ్ముడి భార్యనే అపహరించిన వాలి కథ

  Jul 03 | రామాయణంలో వున్న ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క కథామిషూ వుంటుంది. వారు మంచివారయినా కావొచ్చు... లేదా ధర్మానికి విరుద్ధంగా నడుచుకునే హీనులైనా అయి వుండొచ్చు. అటువంటి పాత్రలలోనే ‘‘వాలి’’ కథ కూడా ఒకటి. పూర్వం వాలి,... Read more

Today on Telugu Wishesh