Vishnu kamalala nomu procedure

vishnu kamalala nomu, vishnu kamalala nomu procedure, vishnu kamalala nomu history, vishnu kamalala nomu in telugu, vishnu kamalala nomu proceddure in telugu, vishnu kamalala nomu history in telugu, lord vishnu with lakshmi, how to do vishnu kamalala nomu

the procedure and history of vishnu kamalala nomu which is for women beautifulness and more

విష్ణు కమలాల నోము

Posted: 04/10/2014 12:34 PM IST
Vishnu kamalala nomu procedure

కథ :

పూర్వం ఒక రాజు కూతురు, ఒక మంత్రి కూతురు చాలా అన్యోన్యంగా వుండేవారు. ఈ ఇద్దరు అమ్మాయిలు చిన్నప్పటినుంచి కలిసి, ఆడుతూపాడుతూ పెద్దవారయిపోతారు. అయితే మంత్రిగారి కూతురు ఎంతో అందంగా, నిగనిగలాడే చర్మంతో ఎంతో ప్రకాశవంతంగా కనిపించేది. 

రాజు కూతురు మాత్రం సాదాసీనంగా వుండేది. మంత్రి కూతురు అందంగా వుండటం చూసి రాజు కూతురు ఎంతో బెంగగాను, బాధపడుతూ వుండేది. తను కూడా అంత అందంగా లేదనే మనోవేదన తీవ్రంగా వెంటాడేది. 

ఒకరోజు రాజు కూతురు తన మనసులోని భావాలను ఒక బ్రాహ్మణ ముత్తయిదువుతో పంచుకుంటుంది. తను అందంగా లేనని బాధపడుతూ చెబుతుంది. దీంతో ఆ బ్రాహ్మణ గృహిణి.. ‘‘రాజకుమారీ గారూ! దీని గురించి ఇంతగా దిగులుపడవలసిన అవసరం లేదు. స్త్రీలు లక్ష్మీ వంటి అందాలను పొందడానికి శ్రీ మహావిష్ణువు ఒక వ్రతాన్ని చెప్పాడు. ‘‘విష్ణు కమలాల నోము’’ను నోచుకుంటే.. నీ ముఖం కూడా లక్ష్మీలా కళాకాంతులుగా మారిపోతుంది’’ అని సలహా ఇస్తుంది. 

దీంతో ఆ రాజు కూతురు, బ్రాహ్మణ గృహిణి చెప్పిన విధంగా విష్ణుకమలాల నోమును నిర్వహించుకుంటుంది. తరువాత ఉద్యాపన చేసుకోగా.. ఆమె ముఖం కూడా లక్ష్మీ కళతో ప్రకాశించింది. 

విధానం : 

విష్ణు కమలాల నోమును నోచుకోవడం చాలా సులభం. ప్రతిరోజూ ఒక కమలవత్తిని తీసుకుని, దానిని ఆవునేతితో వెలిగించాలి. లక్ష్మీనారాయణులను పూజించుకుని పైన చెప్పిన కథను గుర్తించుకోవాలి. తరువాత అక్షితలు వేసుకోవాలి. ఈ విధంగా పూర్తి చేసుకున్న తరువాత ఉద్యాపనం చేసుకోవాలి. 

ఉద్యాపనం :

నోమును నిర్వహించుకున్న సంవత్సరాంతంలో.. ఒక వెండి ప్రమిదునూ, ఒక బంగారు ప్రమిదునూ చేయించుకోవాలి. ఆ రెండింటిని ఆవుల నేతితో వెలిగించిన కమలవత్తినీ చెరొకటిగా తీసుకోవాలి. లక్ష్మీనారాయణులను పూజించుకున్న తరువాత ఒక మానెడు బియ్యం, కొత్త వస్త్రాలు, దక్షిత తాంబూలాలతో సహా.. వెలుగుతున్న వెండీ, బంగారు ప్రమిదుల దీపాలను వాయన, దానమివ్వాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vinayaka vratha kalpam and pooja procedure

    వినాయక వ్రతకల్పం-పూజావిధానం

    Jun 11 | ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమ: - విష్ణతే నమ: మధుసూదనాయ నమ: - త్రివిక్రమాయ నమ: -... Read more

  • Vata savitri vrat procedure in telugu

    వటసావిత్రి వ్రత విధానం

    Jun 03 | ప్రాచీనకాలం నుంచి మన హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మన దోషాలను, నష్టాలను, పాపాలను తొలగించుకోవడానికి... అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను పొందడానికి ఎన్నోరకాల నోములు, వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. ఆనాడు సాక్షాత్తూ దేవుళ్లు కూడా... Read more

  • Moola gowri nomu vidhanam

    మూల గౌరీ నోము కథ - విధానం

    May 07 | కథ : పూర్వం ఒకానొక సమయంలో ఒక మహారాణి తనకోసం, తన తనయుల కోసం, తన రాజ్యంలో వున్న వారందరి శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం మూల గౌరీ నోమును నోచుకుంటుంది. నోము కాలం అయిన... Read more

  • Vishnu vadiyala nomu procedure

    విష్ణు విదియల నోము కథ - విధానం

    Apr 17 | కథ :  పూర్వం ఒక రాజు కూతురు, బ్రాహ్మణ కూతురు వుండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని గడిపేవారు. వీరిద్దరి జీవితంలో ఏ ఒక్క లోటు వుండేది కాదు.  అయితే ఒకరోజు వీరిద్దరూ... Read more

  • Undralla taddi nomu story and procedure

    ఉండ్రాళ్ల తద్ది నోము కథ - విధానం

    Apr 16 | కథ : పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి’’ అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు.  ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు... Read more