హిందూ ధర్మాలలో నిర్వహించుకునే ప్రాచీన పూజా విధానాలలో ఛట్ పూజ ఒకటి. ఈ ఛట్ పూజను దళ ఛట్, ఛతి, సూర్య షష్ఠి అని రకరకాలుగా పిలుచుకుంటారు. ఛట్ పూజను కార్తీకమాసంలో జరుపుకుంటారు.
భూమ్మీద వున్న జీవరాశులన్నింటికీ మనుగడ కల్పిస్తున్న సూర్యభగవానుడికీ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అంతేకాదు... తమజోలికి ఎటువంటి అనారోగ్యాలు రాకుండా, నిత్యం ఆరోగ్యంగాన్ని, ఆనందాలను ప్రసాదించమని ప్రార్థించుకుంటారు.
శాస్త్రీయపరంగా చెప్పుకోవాలంటే... సూర్యుని నుండి వెలువడే కాంతి కిరణాలలో కొన్ని ఆరోగ్యవంతంగా వుండడానికి, ఆహ్లాదకరంగా మెలగడానికి సహాయపడతాయని రుజువయ్యాయి. అంతేకాకుండా సూర్యోదయం సమయంలో సూర్యుని నుండి వెలువడే కిరణాలు మన శరీరంలో విటమిన్ డి ని పెంపొందిచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయని శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు.
సూర్యుడిని ఇలా ప్రతిరోజు ఆరాధించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులైన కుష్టు, ఇతరత్ర రోగాలు త్వరగా మాయమవుతాయని ప్రజలు ఎంతో విశ్వసిస్తుంటారు.
ఈ ఛట్ పూజను చాలావరకు భారతదేశంలో ఉత్తరాదిన వున్న ప్రదేశాలలో ఎక్కువగా జరుపుకుంటారు.
కార్తీకమాసంలోని శుక్ల షష్టినాడు ఈ ఛట్ పూజను జరుపుకుంటారు. ఈ పూజను ముఖ్యంగా సూర్యుని ఆరాధించడానికి ప్రత్యేకంగా జరుపుకుంటారు కాబట్టి దీనిని సూర్యషష్ఠి అని కూడా అంటారు.
ఈ ఛట్ పూజరోజు భక్తులందరూ పవిత్రమైన నదులలో పుణ్యస్నానాలు చేయడానికి అనేక ప్రాంతాలను వలసలకు వెళుతుంటారు. వీలైనంతవరకు సూర్యునిని ఆరాధించేందుకు చాలా సమయం కేటాయిస్తారు.
ఈ ఛట్ పూజను కార్తీక షష్టికి రెండు రోజులు ముందు, రెండు రోజులు తరువాత... అంటే మొత్తం నాలుగు రోజులవరకు జరుపుకుంటారు.
ఈ ఛట్ పూజ రోజు చాలామంది ఉపవాసం వుండడానికి ఇష్టపడతారు. కొందరైతే ఏకంగా 36 గంటల వరకు ఎటువంటి ఆహార పదార్థాలుగానీ, నీళ్లుగానీ తీసుకుకోండా ఉపవాసం వుంటారు.
ఉపవాసం వున్నవారు ఎటువంటి ఆడంబరాలకు పోకుండా, నిజాయితీగా తమ కార్యక్రమాలను చేసుకుంటూ వుంటారు. సాధ్యమైనంతవరకు మంచంలో కాకుండా నేలమీద పడుకోవడానికే ఇష్టపడతారు.
మహాభారతం కథనాల ప్రకారం పూర్వం ద్రౌపతి, పాండవులు కూడా ఈ ఛట్ పూజను జరపుకున్నట్లు వివరాలు కూడా వున్నాయి.
బీహార్, జార్ఖండ్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, చండీగఢ్, గుజరాత్, గయ, రాంచీ, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ఈ ఛట్ పూజను ఎంతో ఘనంగా, ప్రముఖంగా జరుపుకుంటారు.
(And get your daily news straight to your inbox)
Jun 12 | హిందూ శాస్త్రాలలో పాదరసం ప్రాముఖ్యత - మహిమలు : పూర్వం దేవతల కాలంనుంచి పాదరసానికి ఎంతో ప్రత్యేకత వుంది. పాదరసం అసలు పేరు ‘‘ఏఅసరాజు’’. ఇది చూడడానికి దేవతామూర్తుల రూపంలో కనువిందు చేస్తుంటుంది. ప్రాచీనకాలంలో... Read more
May 10 | హిందూ దేవతలలో వినాయకుడిదే అగ్రస్థానం. దేవతలు కూడా తమ పనులను నిర్వర్తించుకునేముందు వినాయకుడిని దర్శించుకుని, విజయాలను సాధించేవారు. అలాగే సామాన్య ప్రజలు కూడా తమరోజువారి పనులలో, కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు, సమస్యలు రాకుండా నిర్విఘ్నంగా... Read more
Apr 18 | అమృత ప్రాప్తి మంత్రం : శంఖినీ యక్షిణీ సాధన మంత్రం శంఖ ధారడీ శంఖ ధరనే హ్యీం హ్యీం క్లీం శ్రీ స్వాహా ఈ మంత్రాన్ని వటవృక్షం కింద కూర్చుని పదివేలసార్లవరకు జపించాలి. దీనిని... Read more
Apr 03 | కార్తీకమాసంలో ఎంతో పవిత్రమైన, విశిష్టమైన క్షీరాబ్ది ద్వాదశిరోజు తులసీ పూజను నిర్వహించుకుంటారు. కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్షద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈరోజు ముత్తైదువులు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలను భక్తిశ్రద్ధలతో పూజించి, వారి వివాహాన్ని జరుపుకుంటారు. ఆ... Read more
Mar 19 | భీష్మపితామహుడికి సంతానం లేకపోయినా... ఆయన మరణించిన తరువాత ఇప్పటికీ పితృతర్పణాలు అందుతూనే వున్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భీష్ముడు భారతకథలో నిలిచిపోయిన మహోన్నతుడు. ఈయనకు ఇంత మహత్యం లభించడానికి కారణం ఆయన గుణశీలాలే. 45రోజులపాటు... Read more