శ్రీ సీతారాముల ఆలయం
హైదరాబాద్ పరిసరాల్లో వున్న శంషాబాద్ కేవలం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ వినానాశ్రయనికి అతి చేరువలోనే ఈ ఆలయం వుంది. చాలా పురాతనమైన ఈ టెంపుల్ సినిమా షూటింగ్ లకి పెట్టింది పేరు. ఈ ఆలయం వద్ద సినిమా షూటింగ్ లు జరిగితే బాక్సా ఫీస్ వద్ద విజయం ఖాయమని దర్శకనిర్మాతల నమ్మకం. 1984లో స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన పోతులూరి వీర బ్రహ్మేద్ర స్వామి చరిత్ర నుంచి మొదలుకొని ఇప్పటివరకు సుమారు 350 పైగానే ఇక్కడ సినిమా షూటింగ్ లు జరిగాయి.