Kavuri sambasiva rao talk about on ap bifurcation

kavuri sambasiva rao talk about on ap bifurcation, Minister Kavuri Sambasiva Rao, kavuri sambasiva rao, Congress senior leader Kavuri Sambasiva Rao, AP bifurcation process, Textiles Minister Kavuri Sambasiva Rao , congress party,

kavuri sambasiva rao talk about on ap bifurcation, Minister Kavuri Sambasiva Rao

మిత్రులుగా విడిపోయే అవకాశం ఉండేది : కావూరి

Posted: 12/07/2013 08:30 PM IST
Kavuri sambasiva rao talk about on ap bifurcation

రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేదే తన కోరిక అని, అనివార్య కారణాల వల్ల సీమాంద్రుల హక్కుల గురించి అడుగుతున్నామని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. విభజన అంశాన్ని కేబినేట్‌లో టేబుల్ ఐటమ్‌గా తీసుకురావడం న్యాయం కాదని కేంద్ర మంత్రి కావూరి అన్నారు. విభజన నిర్ణయాన్ని కేబినెట్‌లో తీవ్రంగా వ్యతిరేకించామని, విభజన వల్ల వచ్చే నష్టాలను వివరించామని అయితే తమ వాదనలు కేంద్రం పట్టించుకోలేదని వాపోయారు.బిల్లులోని అంశాలను చదువుకునే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు.

 

ఒక ప్రాంతానికి న్యాయం...మరో ప్రాంతానికి అన్యాయం చేయొద్దని కేబినెట్ చెప్పామని అయినా సీమాంధ్రకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. ఇరుప్రాంతాలకు న్యాయం చేస్తే మిత్రులుగా విడిపోయే అవకాశముందని అభిప్రాయపడ్డారు. విభజన తథ్యం అని జోవోఎం తమకు చెప్పిందని, రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి కాబట్టే విభజన నిర్ణయానికి వచ్చారని తెలిపారు. తెలంగాణ వనరులను ఎవరూ దోచుకోలేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో అన్ని ప్రాంతాల వారి కృషి ఉందన్నారు. తమిళనాడులో చాలా ప్రాంతాలను అభివృద్ధి చేశారని, మన రాష్ట్రంలో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని కావూరి తెలిపారు.

 

కోస్తాకు అవసరమైన నేషనల్ ఫిషరీస్ కార్పొరేషన్, సునామీ కేంద్రాన్ని హైదరాబాద్‌లోనే పెట్టారు. చదువు పూర్తికాగానే ప్రతి ఒక్కరు హైదరాబాద్ వైపు చూస్తున్నారని వెల్లడించారు. సీమాంధ్ర అభివృద్ధి చెందే వరకు పదేళ్లపాటు హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరినట్లు కావూరి తెలిపారు. పోలవరానికి తెలంగాణవారు అడ్డుపడుతున్నందున భద్రచలాన్ని సీమాంధ్రలో కలపాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలంటే భద్రాచలం సీమాంధ్రలోనే ఉండాలని కేంద్రాన్ని కోరామన్నారు. భద్రాచలాన్ని తెలంగాణకు ఇస్తే శబరి నుంచి వచ్చే నీటిని అడ్డుకునే ప్రమాదముందన్నారు. శబరి నీటిని అడ్డుకుంటే ధవళేశ్వరం ఆయకట్టుకు తీవ్ర నష్టం కలుగుతుందని కావూరి పేర్కొన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more