High court notice to brother anil

High Court notice to Brother Anil, High Court issues Notice to Brother Anil, ysr congress party, ys jagan,

High Court notice to Brother Anil, High Court issues Notice to Brother Anil

బ్రదర్ అనిల్ కు హైకోర్టు నోటీసులు-రహదారుల దిగ్బందం

Posted: 11/05/2013 07:25 PM IST
High court notice to brother anil

బ్రదర్ అనిల్ కుమార్‌కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈరోజు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో అనిల్ పేరును చార్జిషీట్ నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కరీంనగర్ జిల్లాలో బ్రదర్ అనిల్ క్రిస్టియన్ సభలు నిర్వహించారని ఆయనపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు అయింది.

 

'రహదారుల దిగ్బందం

సమైక్యాంధ్రకు మద్దతుగా రేపు, ఎల్లుండి రహదారుల దిగ్బంధనం చేయాలని నిర్ణయించామని, ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమైక్యవాదులుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ లోని ఆ పార్టీ కేంద్రం కార్యాలయం ఈరోజు ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. రహదారుల దిగ్బంధనంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.

 

బుధ, గురువారాల్లో చేయాల్సిన ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రయాణికులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచించింది. సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగసిపడుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలుపు మేరకు ఇప్పటివరకు 9368 గ్రామ పంచాయతీల నుంచి గ్రామ సభ తీర్మానాలను ప్రధాని, జీవోఎంకు మెయిల్ ద్వారాపంపించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్బంగా గుర్తు చేసింది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more