నగర శివారులోని మణికొండ పంచవటి కాలనీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కాలనీలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ, వాటిని కూల్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ చర్యను స్థానికులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పంచవటి కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారంటూ ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన లోకాయుక్త.. అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకోవాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు.. పంచవటి కాలనీలో మొత్తం 64 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని గుర్తించారు. వీటిలో ఏడు నిర్మాణాలను ఈ రోజు కూల్చేందుకు పోలీసులతో జీహెఎంసీ అధికారులు పంచవటి కాలనీకి చేరుకున్నారు. ఈ చర్యను స్థానికులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీనిపై అధికారులు స్పందిస్తూ లోకాయుక్త ఆదేశాల మేరకే తాము ఆక్రమణలను కూల్చేస్తున్నట్లు చెప్తున్నారు. ఆక్రమణలన్నీ దశలవారీగా తొలగిస్తామని చెబుతున్నారు. ఈ విషయమై ఆందోళన చేపట్టేందుకు స్థానికులు, రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more