నగరంలో పెరుగుతున్న వాహనప్రమాదాలను నివారించేందుకు మళ్లీ హెల్మెట్, సీట్‌బెల్ట్ వాడకాన్ని తప్పనిసరి చేస్తామని నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. అయితే మీడియా సహకరిస్తేనే ఇది విజయవంతమవుతుందని చెప్పారు. వారి సహకారం వల్లే డ్రంకెన్‌డ్రైవ్, కార్లకు బ్లాక్‌ఫిల్మ్ తొలగింపు కార్యక్రమాలు జయప్రదమయ్యాయని పేర్కొన్నారు. ప్రపంచఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తరఫున సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంస్థ సోమాజిగూడలోని ఓ హోటల్లో రోడ్డుభద్రతపై మీడియా ప్రతినిధులకు ఏర్పాటు చేసిన సదస్సులో ఆనంద్ పాల్గొని ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
‘కొన్ని నిబంధనల అమలుకు ప్రయత్నిస్తే మీడియా నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈకారణంగానే గతంలో ప్రారంభించిన ద్విచక్ర వాహనచోదకులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి, కార్లు తదితర వాహనాలు నడిపే వారు సీటుబెల్టు పెట్టుకోవాలి అనే ప్రత్యేక డ్రైవ్‌లు ఆగిపోయాయి. చలాన్లు విధించేది ప్రభుత్వ ఆదాయం కోసం కాదు..వాహనచోదకుల భద్రత కోసమే. దీనికి ఎలాంటి టార్గెట్లు ఉండవు. ఇతర దేశాల్లో కఠినచట్టాలు, భారీ జరిమానాలు ఉన్న కారణంగానే అక్కడివారు ఉల్లంఘనలకు పాల్పడానికి భయపడతారు. మరోపక్క అక్కడి మౌలిక సదుపాయాలు ఇక్కడి వాటితో పోల్చలేం. నిబంధనల్ని బేఖాతరు చేస్తున్న కారణంగానే ప్రపంచంలో ఏటా 1.4 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. దీన్ని రోడ్డు టైజంగా అభివర్ణించొచ్చు. రోడ్లపై సక్రమంగా ట్రాఫిక్ నిర్వహణ అనేది కేవలం ట్రాఫిక్ పోలీసుల ఒక్కరి బాధ్యత, వారొక్కరి వల్లా కాదు. జీహెచ్ఎంసీ సహా దాదాపు 11 శాఖలు కలిసి పని చేయాల్సి ఉంటుందన్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more