Bakrid

bakrid, bakrid festival, id ul zuha muslims festival bakrid, bakrid hyderabad, bakrid in twin cities, bakrid lunch, bakrid goats, bakrid importance,

Bakrid, popularly known as Id-ul-Zuha, is an important religious festival of Muslims observed once in a year to commemorate Prophet Abraham (Ibrahim) who willingly agreed to immolate his son Ishmael near Mecca, symbolically as an act of respect and obedience to gratify God ahead of G

5.gif

Posted: 10/27/2012 02:46 PM IST
Bakrid

bakrid

ఇవాళ  బక్రీద్ పండుగను జంటనగరాల్లో ముస్లీంలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. పండుగ  సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు విస్తత్ర బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ పండుగ సందర్భంగా గోవధను అరికట్టాలని ఒక వర్గం ప్రభుత్వం, పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్న నేపధ్యంలో ఇవాళ (శనివారం) బక్రీద్ సందర్భంగా అవసరమైన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముషీరాబాద్ ప్రాంతంలో ఉద్రిక్తత తలెత్తడంతో ఇప్పటికే ఆ పోలీసు స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. పలు ప్రాంతాల్లో ఇవాళ కూడా ట్రాఫిక్ ఆంక్షలను కూడా నగర పోలీసులు అమలు చేస్తున్నారు. మీరాలం ట్యాంక్ ఈద్గా వద్ద భారీ ఎత్తున ప్రార్ధనలు జరుగుతున్నందున పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. మీరాలం ట్యాంక్ వైపునకు వచ్చే ట్రాఫిక్‌ను పురానాపూల్, బహదూర్‌పురా వైపునకు ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు మళ్లించారు. శివరాంపల్లి వైపునుంచి బహదూర్‌పురా వైపునకు వచ్చే ట్రాఫిక్‌ను దానమ్మ హట్స్ టి జంక్షన్ నుం ఇంజిన్ బౌలి వైపునకు తరలించారు. మీరాలం ప్రాంతానికి కార్లు, ఆర్‌టిసి బస్సులు, టూరిస్టు బస్సులు, లారీలను అనుమతించడం లేదని పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ తెలిపారు. ఆ రూట్లో కేటాయించబడిన పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలను ఉంచి ప్రార్ధనలు ముగిసిన తర్వాత తిరగి వెళ్లాలని పేర్కొన్నారు.
   ఇదిలా ఉండగా,  ముఖ్యంగా పాతబస్తీలో ఎక్కడ చూసినా బక్రీద్ సందడి కనిపిస్తుంది. నగరానికి పెద్దఎత్తున గ్రొరెలను తరలించగా, గత నాలుగురోజులుగా  కొనుగోలు దారులతో పలు ముస్లీంలు అధికంగా ఉన్న ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.

అసలు బక్రీద్ అంటే ఏంటి.. పండుగ పుట్టుపూర్వత్రాలు :     
  ఇది నాలుగు వేల సంవత్సరాల కిందటి సంఘటన.  కలలో వినిపించిన దైవాజ్ణ ప్రకారం లేకలేక కలిగిన సంతానాన్ని కూడా బలివ్వటానికి సిద్దపడటం, అనంతరం దైవం అనుగ్రహించి బిడ్డ దక్కడమే క్లుప్తంగా బక్రీద్ పండుగ. 
        ఆ యుగపురుషుడు మరెవరో కాదు, యూదులకు, క్రైస్తవులకు, ముస్లిములకు పితామహుడైన ఇబ్రాహీం అలైహిస్సలాం. ఆయన  ‘‘కాబా మస్జిద్’’ ను నిర్మించి దైవానుగ్రహం పొందారు. ఖలీలుల్లాహ్ (అల్లాహ్ యొక్క స్నేహితుడు) గా ప్రఖ్యాతి గాంచారు. ఆయన వృద్ధాప్యానికి చేరుకున్నారు. అప్పటికి ఆయనకు సంతానం కలుగలేదు. అయినప్పటికీ ఆయన సహనం వహించారు. దైవకారుణ్యం పట్ల నిరాశ చెందలేదు. ఆయన సహనానికి, ఓర్పుకు దైవకారుణ్యం కదలి వచ్చింది. ఆయనకు సంతానం కలిగే సౌభాగ్యం ఆసన్నమైంది. అల్లాహ్ అనుగ్రహంతో ఒక కుమారుడు కలిగాడు. లేకలేక కలిగిన ఆ కుమారునిపై ఆ తండ్రికి ఎంతటి వాత్సల్యం ఉంటుందో మనం ఊహించగలం. కుమారుడు కూడా సహన శీలుడు.
      అల్లాహ్ యొక్క సందేశం (వహీ) ప్రవక్తలకు చాలా రకాలుగా అందుతుంది. అందులో ఒకటి కల (స్వప్నం) రూపంలో తెలియచేయబడే వహీ - లేకలేక కలిగిన తన కుమారుడిని స్వయంగా తానే జబహ్ (బలి) చేస్తున్నట్లు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి ఒక కల వచ్చింది. అది అల్లాహ్ యొక్క ఆదేశం. ఉన్న ఒక్కగానొక్క కుమారుడినీ ఖుర్బానీ ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇస్మాయీల్, ఇబ్రాహీమ్ గారికి తొలి సంతానం మాత్రమే కాదు, ఆ సమయానికి ఆయనే ఏకైక కుమారుడు. ఎంతటి కఠోర పరీక్ష ఇది. అల్లాహ్ ఆదేశం గురించి ఇబ్రాహీం తన కుమారునికి చెప్పినప్పుడు, ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఆయన వెంటనే ఆ ఆదేశాన్ని అమలుచేయడానికి సిద్ధపడ్డారు. ఇంకా ఇస్మాయీల్ ఏమన్నారంటే, ‘‘ఇన్షా అల్లాహ్! (అల్లాహ్ కోరితే) నీవు నన్ను ఓ సహనశీలునిగా పొందగలవు’’ అని ఆయన తండ్రియైన ఇబ్రాహీమ్ అలైహిస్సలాం గారితో అన్నారు.
        హజ్రత్ ఇబ్రాహీమ్ దైవాదేశాన్ని శిరసావహించడానికి తన కుమారుని మర్వా కొండ ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఇస్మాయీల్‌ని బోర్లా పరుండబెట్టి జిబహ్ చేసేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు అల్లాహ్ తన దాసుని త్యాగానికి ప్రసన్నుడై హజ్రత్ ఇస్మాయీల్‌కు పరిహారంగా ఒక పొట్టేలును జిబహ్ చేసేందుకు పంపించాడు.
       దివ్య ఖుర్ ఆన్‌లో అల్లాహ్ ‘‘ఇబ్రాహీం! నీవు కలను నిజం చేసి చూపించావు. సత్కార్యం చేసేవారికి మేము ఇలాంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. నిశ్చయంగా ఇది ఒక స్పష్టమైన పరీక్ష. మేము ఒక పెద్ద ఖుర్బానీని పరిహారంగా ఇచ్చి ఆ బాలుడిని విడిపించుకున్నాము’’ (అస సప్ఫాత్: 105 - 107).
ఆనాడు తండ్రీకొడుకులు చేసిన త్యాగాన్ని స్మరిస్తూ నేడు ముస్లిములు ఖుర్బానీ ఇస్తూంటారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Siger malavika meet cm kiran
Silver night music album  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more