జీవన చక్రంలో వేటికి దూరమయ్యాం? ఫలితంగా ఎలాంటి కష్టనష్టాలను ఎదుర్కొంటున్నాం. భవిష్యత్తులో జరిగే అనర్థాలేంటి?... ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ‘సైన్స్ ఎక్స్ ప్రెస్ రైలు’ సమాధానం చెబుతోంది. పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్య ఆవశ్యకత, ప్రకృతి వైపరీత్యాలకు కారణాలు వంటి ఎన్నో పర్యావరణ అంశాలపై అవగాహన కల్పించేందుకు జీవ వైవిధ్య ప్రత్యేక రైలు మంగళవారం నగరానికి రానుంది. రైలు ప్రత్యేకతలివే... మొత్తం బోగీలు 16. ఈ రైలును 2007 అక్టోబర్‌లో భారత ప్రభుత్వ సాంకేతిక విజ్ఞాన విభాగం, పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ప్రారంభించాయి. 2012 జూన్ 5న ఢిల్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, కేంద్రమంత్రి జయంతి నటరాజన్‌లు రైలును లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం 16 బోగీల్లో ఎనిమిదింటిని పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖ రూపొందించింది. మిగిలిన వాటిని ప్రభుత్వ సాంకేతిక విభాగం తయారు చేసింది. ఈ రైలులో జీవ, భౌగోళిక క్షేత్రాలైన హిమాలయ, గంగా మైదానం, ఉత్తర, తూర్పు, పశ్చిమ కనుమలు, దక్కన్ పీఠభూమి, సముద్రతీర, ఎడారి ప్రాంతాలు వంటి ఎన్నో రకాల ఎగ్జిబిషన్లు ఉంటాయి. వాతావరణ మార్పు, జీవ వైవిధ్యం, శక్తి సంరక్షణకు సం బంధించిన అంశాలు, సైన్స్ ప్రయోగశాలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిం చేందుకు ప్రత్యేక బోగీలుంటాయి. జీవ వైవిధ్య అంశాలపై పూర్తి పట్టున్న 54 మంది వలంటీర్లు రైలులో అవగాహన కల్పిస్తారు.ఈ నెల 19 వరకు నగరంలో జీవవైవిధ్య సదస్సు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఈనెల 19 వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని 10వ నెంబర్ ప్లాట్ ఫాంపై జీవ వైవిధ్య ప్రత్యేక రైలు(సైన్స్ ఎక్స్ ప్రెస్) అందుబాటులో ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ రైలును సందర్శించవచ్చు. ప్రవేశం ఉచితం.’ అని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలు, ఎలక్ట్రానిక్స్,గణితం వంటి 50కి పైగా అంశాలకు సంబంధించిన ప్రయోగాల గురించి వివరించేందుకు 13వ బోగీని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ బోగీలోకి ప్రవేశించాలంటే మాత్రం తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలి. వివరాలకు 09428405408 నెంబర్‌లో సంప్రదించవచ్చు. లేదా This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.కు మెయిల్‌లో సంప్రదించవచ్చు. ఇంకెందుకాలస్యం దూకండిమరి ధూమశకటంలోకి..
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more