టాలీవుడ్ అగ్రహీరోల్లో నలుగురుది ఒక్కో స్టైల్. పదేళ్ల తర్వాత గ్యాప్ వచ్చినప్పటికీ మాస్ ఫాలోయింగ్ తో ఖైదీగా కలెక్షన్లతో కుమ్మిపడేశాడు చిరు. ఇక క్రమం తప్పకుండా హిట్లు కొడుతూ తన పంథాలో సాగిపోతున్నాడు ఎనర్జిటిక్ బాలయ్య. నాగ్ దేమో చాలా ప్రత్యేకమైన శైలి. సినిమా సినిమాకు సంబంధం లేకుండా డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రయోగాత్మక సినిమాలు తీస్తూ హిట్లు కొట్టేస్తున్నాడు. ఇక ఈ జాబితాలో మిగిలింది ఒక్క వెంకీనే.
నిజానికి వెంకీ సోలో హిట్ కొట్టి చాలా కాలమైందనే చెప్పుకోవాలి. షాడో నుంచి ఏ సినిమా సరిగ్గా ఆడలేకపోయింది. దీంతో మిగతావాళ్లంతా ప్రయోగాలు చేస్తుంటే.. దగ్గుబాటి హీరో మాత్రం జంకుతున్నాడని చెప్పుకున్నారు. అయితే ఈ క్రమంలోనే గురు సినిమాను ఎంచుకుని తన వైవిధ్యతను బయటపెట్టాడు వెంకీ. నటనకు ఆస్కారం ఉన్న రోల్ తోపాటు, తన ఏజ్ కు తగ్గ పాత్రకు ఎంచుకున్నాడని అంతా ప్రశంసించారు. ఇదే సమయంలో మరో రెండు సినిమాలు అనౌన్స్ చేసి వాటిని నెమ్మదిగా సైడ్ చేయటం కూడా డిస్కషన్ కి కారణం అయ్యింది.
అందులో ఒకటి నేను శైలజ ఫేం తిరుమల కిషోర్ ఆడాళ్లు మీకు జోహార్లు, మరోకటి పూరీ జనగణమన. ఆడాళ్లు... సినిమా రెగ్యులర్ ఎంటర్ టైనర్ కావటం, పైగా కుర్రహీరోయిన్ నిత్యామీనన్ తో రొమాన్స్ చేయాల్సి రావటంతోనే వెంకీ ఈ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయ్యాడని, మరో చిత్రం జనగణమన కూడా కంటెంట్ పరంగా వెంకీ కి నచ్చలేదన. పైగా తర్వాత తీయబోయేది తన 75వ చిత్రం కావటంతో ఆ రెండింటిని హోల్డ్ లో పెట్టి కథా, కథనంలో వైవిధ్యం చూపే క్రిష్ వెంట పడ్డాడని టాక్.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more