Prabhas Baahubali Audio launch at Tirupati

Prabhas baahubali audio launch at tirupati

Baahubali Audio launch at Tirupati, Baahubali Audio launch details, Baahubali Audio launch news, Baahubali Audio launch updates, Baahubali Audio launch date, Baahubali Audio launch event, Baahubali Audio launch place, Baahubali news, Baahubali posters, Baahubali movie stills, Baahubali movie updates, Baahubali trailer, Baahubali

Prabhas Baahubali Audio launch at Tirupati: Director SS Rajamouli Baahubali film Audio launch at Tirupati on 13 june. MM Keeravani music. prabhas, rana, anushka, tamanna acts in lead roles.

‘బాహుబలి’ ఆడియో తిరుపతిలో విడుదల ?

Posted: 06/09/2015 12:18 PM IST
Prabhas baahubali audio launch at tirupati

ప్రపంచ వ్యాప్తంగా ‘బాహుబలి’ చిత్ర విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అరే అభిమానుల ఆతృతను దర్శకుడు అస్సలు పట్టించుకోవడమే లేదు. అదిగో ఇదిగో అంటూ ఇప్పటికే ‘బాహుబలి’ ట్రైలర్ విడుదల చాలా ఆలస్యం అయ్యింది. ఇక అభిమానులు చాలా నిరాశగా వున్నారని మొన్న మే 31కు విడుదల చేసారు. ఇక ట్రైలర్ విడుదలయ్యిందో లేదో కేవలం 24గంటల్లోనే రికార్డులన్నీ కూడా తుప్పురేగొట్టేసింది.

Baahubal-Audio-launch-at-Tirupati-02

కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఇంకా యూట్యూబ్ లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. అయితే ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. ‘బాహుబలి’ మొదటి పార్ట్ లో మొత్తం నాలుగు పాటలున్నాయని ఇటీవలే ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ‘బాహుబలి’ ఆడియో విడుదల కార్యక్రమాన్ని మే 31న గ్రాండ్ గా నిర్వహించాలని అనుకున్నారు. కానీ సెక్యురిటీ కారణాల వల్ల, అభిమానులకు ఎలాంటి నష్టం జరగకూడదని ఈ ఆడియో వేడుకను వాయిదా వేసారు.

Baahubal-Audio-launch-at-Tirupati-03

కానీ ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ తాజాగా మరో కొత్త వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ‘బాహుబలి’ ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరగడం లేదని తెలిసింది. తిరుపతిలో జరుగనుందట. తిరుపతిలోని ఎన్టీఆర్ గార్డెన్స్ లో ఈనెల 13న గ్రాండ్ గా చేయనున్నారట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయని తెలిసింది.

ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరుకానున్నారని తెలిసింది. హైదరాబాద్ లో ‘బాహుబలి’ ఆడియో విడుదలకు సెక్యురిటీ కారణం కావడంతో తిరుపతికి మార్చేసినట్లుగా తెలిసింది. మరి తిరుపతిలో ఎలాంటి ఏర్పాట్లు చేయనున్నారో త్వరలోనే ‘బాహుబలి’ చిత్ర యూనిట్ ఓ అధికారిక ప్రకటన ద్వారా తెలియజేయనున్నారు.

Baahubal-Audio-launch-at-Tirupati-04

ఇక ‘బాహుబలి’ ట్రైలర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి ఇప్పటికే భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ప్రముఖ ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తుంది. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జులై 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

 Baahubal-Audio-launch-at-Tirupati-05

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  audio launch  tirupati  event  trailer  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more