Bahubali | Audio Release date

Bahubali movie audio release date

Bahubali Movie Audio Release Date: Tollywood Director SS Rajamouli Latest Movie Bahubali. Prabhas, Rana, Anushka, Tamanna in lead roles. MM Keeravani music.

Bahubali Audio Release Date, Bahubali Movie Audio Release Date, Bahubali movie news, Bahubali movie updates, Bahubali trailer date, Bahubali release date, Bahubali movie latest posters, Bahubali movie posters, Bahubali stills, Bahubali

బాహుబలి ఆడియో విడుదలకు ఏర్పాట్లు

Posted: 05/12/2015 01:36 PM IST
Bahubali movie audio release date

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అన్ని చిత్రాలకు కీరవాణి సంగీతం అందించారు. అయితే భవిష్యత్తులో రాజమౌళి సినిమాలకు ఎవరు సంగీతం అందించనున్నారో ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది.

ఎందుకంటే కీరవాణి 2016లో సంగీత దర్శకుడిగా రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లుగా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాబట్టి.. కీరవాణి సంగీత దర్శకత్వంలో రాబోతున్న చివరి చిత్రం ‘బాహుబలి’ చిత్రమే అవుతుందేమోనని అందరూ ఎంతో ఫీల్ అవుతున్నారు. అయితే ఈ సంధర్భంగా కీరవాణికి భారీగా వీడ్కోలు పలకాలని ‘బాహుబలి’ చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా తెలిసింది.

అందుకే ‘బాహుబలి’ ఆడియో విడుదల కార్యక్రమంలో కీరవాణిని ఘనంగా సన్మానించడానికి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం. ‘బాహుబలి’ ఆడియో వేడుకను ఈనెల 31న హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించడానికి చిత్ర యూనిట్ నిర్ణయించినట్లుగా తెలిసింది. అదే రోజున థియేటర్ ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు.

భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జులై 10న తెలుగు, తమిళ, హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలు, పోస్టర్లు భారీ సంచలనం సృష్టిస్తున్నాయి. రోజురోజుకి ఈ సినిమా అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ ఆడియో విడుదల కార్యక్రమం గురించి త్వరలోనే అన్ని వివరాలు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bahubali  Audio Release date  Trailer  Posters  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more