ఈమధ్య కాలంలో సమంతాకు సుడి బాగానే తిరిగినట్లు తెలుస్తోంది. ఓవైపు టాలీవుడ్’లో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్’గా ఎదిగిపోయిన ఈ అమ్మడు.. మరోవైపు ఎడతెరిపి లేకుండా చేతికి వచ్చిన బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు ఓకే చేసేస్తోంది. అలాగే.. మొన్నటివరకు తనకు సొంతగడ్డపైనే ఇంకా గుర్తింపు దక్కలేదని ఆందోళనలో మునిగిన ఈ అమ్మడికి, ఆ టెన్షన్ ‘కత్తి’ సినిమాతో దూరమైపోయింది. అది కూడా ఆ మూవీ వందకోట్ల క్లబ్’లోకి చేరడంతో సమంతా సంతోషానికి హద్దులే లేకుండా పోయింది. ఆ మూవీ సక్సెస్ అవడంతో ఈమెకు కోలీవుడ్’లోనూ వరుసగా ఆఫర్లు రావడంతో.. ఈ అమ్మడికి అక్కడా డిమాండ్ పెరిగిపోయింది. అందుకే.. తమతమ సినిమాల్లో నటించాలంటూ ఇప్పుడు హీరోలు కూడా ఈమెను రికమెండ్ చేస్తున్నారని సమాచారం!
తమిళ హీరో విజయ్, ‘రాజారాణి’ ఫేం దర్శకుడు అట్లీకుమార్ కాంబినేషన్’లో ఓ మూవీ తెరకెక్కనున్నట్లు గతకొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే! ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీలో హీరోయిన్ విషయంపై కాస్త తడబాటు ఎదురైంది. ముందుగా ఇందులో నయనతారను తీసుకోవాలని అనుకున్నారు. అయితే.. తనకు డేట్స్ కుదరకపోవడంతో ‘సారీ’ అని చెప్పి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అనంతరం బాలీవుడ్ భామలైన దీపికా, సోనాక్షీని తీసుకోవాలని యూనిట్ భావించింది. అయితే.. వాళ్లు అధికంగా పారితోషికం డిమాండ్ చేస్తారన్న ఉద్దేశంతో దర్శకనిర్మాతలు వెనక్కు తగ్గారు. దీంతో హీరోయిన్’గా ఏ తారను తీసుకుంటే బాగుంటుందా..? అన్న సందిగ్ధతలో యూనిట్ సభ్యులు మునిగిపోయారు.
ఈ నేపథ్యంలోనే హీరో విజయ్ తన తదుపరి చిత్రంలోనూ హీరోయిన్’గా సమంతాను తీసుకోవాల్సిందిగా రికమెండ్ చేశాడని కోలీవుడ్ సమాచారం! ఇదివరకే తాను ఆ ముద్దుగుమ్మతో కలిసిన నటించిన ‘కత్తి’ మూవీ భారీ విజయం సాధించడంతో.. ఆమెనే సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు. అతని సిఫార్లు మేరకే యూనిట్ బృందం సమంతాను రిక్వెస్ట్ చేయగా.. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసిందని అంటున్నారు. అయితే.. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. ఇక ఇందులో మరో తారగా అమీ జాక్సన్ ఎంపికైన విషయం తెలిసిందే! ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడి కానున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more