టాలీవుడ్ లో అందాల బొమ్మలి అనుష్క.. తన కోరిక త్వరలో తీర్చుకోబోతుంది. వెండితెరకు పరిచయం అయిన నాటి నుండి ఇప్పటి వరకు అనుష్క కోరిక తీరలేదట. ఆ కోరిక త్వరలో తీరబోతుందని అనుష్క ఆనందంగా చెబుతుంది. వెండితెరపై అనుష్క విభిన్న కోణాల్లో.. తన టాలెంట్ చూపించి అభిమానులను సంపాదించుకుంది. అయితే లేడీ ఒరియెంటెడ్ పాత్రలతో.. బాగా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క. ఇప్పుడు అనుష్క చేతిలో ‘రుద్రమదేవి’, బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే అనుష్కకు అనుకోకుండా మరో ఆఫర్ రావటం జరిగింది. ఈ ఆఫర్ అనుష్క డ్రీమ్ రోల్ కు దగ్గర ఉందట. అందుకే తన కోరిక తీర్చుకోవటానికి ఇదే మంచి అవకాశంగా భావించి.. వెంటనే ఒప్పుకున్నట్లు సమాచారం.
అయితే ఇంతకీ అనుష్క కోరిక ఏమిటో తెలుసా? అనుష్క కు చాలా కాలం నుంచి ఆ కోరిక ఉందట. అంటే ఏదైన సినిమాలో ఓ పోలీస్ పాత్ర చేయాలనే కోరిక బలంగా ఉండేదట. అది ఇన్నాళ్లకు తీరబోతుందని అనుష్క ఆనందంగా చెబుతుంది. అయితే లేటెస్ట్ గా కోలీవుడ్ లో అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసే సినిమాలో అనుష్క పోలీస్ పాత్రలో నటించబోతుందట. ఈ విషయాన్ని దర్శకుడు రీసెంట్ గా చెప్పడంతో ఈ స్వీటి హ్యాపీగా ఫీలవుతోంది. దర్శకుడు గౌతమ్ కూడా హీరోయిన్లను ఇంకా అందంగా చూపుతాడు కాబట్టి, త్వరలోనే అందమైన పోలీస్ గా అనుష్కను చూస్తామన్నమాట. ఏదేమైనా పర్ఫెక్ట్ ఫిజిక్ ఉన్న అనుష్కను పోలీస్ పాత్రలో నటిస్తుందంటే అభిమానులకు పండగనే చెప్పవచ్చు.
అలాగే పోలీస్ పాత్రలో నటించిన ఏ హీరోయిన్ తరువాత వెండితెరపై కనిపించిన ఛాయలు లేవని అనుష్క అభిమానులు గుర్తు చేస్తున్నారు. గతంలో విజయశాంతి నుండి.. నేటి నమిత, స్నేహ, ప్రియమణి వరకు పోలీస్ పాత్రలు వేసి.. సినిమా అవకాశాలు తగ్గి ఖాళీగా కూర్చున్న విషయం తెలుసుకోవాలని అభిమానులు అంటున్నారు. అయిన అనుష్క లక్ ఎలా ఉందో. చూద్దాం.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more