సినీ తారల మధ్య అప్పుడప్పుడు వివాదాలు తారా స్థాయికి చేరుతాయి. కొన్ని లోలోపలే సమసిపోతే మరికొన్ని (మీడియా) రచ్చ కెక్కుతాయి. తాజాగా యంగ్ హీరో అయిన వరుణ్ సందేశ్ కి, ఈ మధ్యనే తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన కోమల్ ఝూ కి మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. ఇటీవల వీరిద్దరు కలిసి తెలుగు చిత్రం అయిన ‘ప్రియతమా నీవచట కుషలమా ’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఈ సినిమా విషయంలో వరుణ్ సందేశ్ పై ఝూ బహిరంగ విమర్శలు చేసింది. వరుణ్ సందేశ్ నా జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించింది. సినిమా ప్రమోషన్ పోస్టర్ల పై నా ఫోటోలు లేకుండా చేసి, తనకు పబ్లిసిటీ రాకుండా చేశాడని, అలాగే షూటింగు సమయంలో నాకు దగ్గరవ్వాలని చూసి, కొన్ని మెస్సేజ్ లు పంపించేవాడని, నా పట్ల కాస్త అసభ్యంగా ప్రవర్తించాడని, నేను దానికి ఒప్పుకోకపోయే సరికి నన్ను తొక్కేశాడని ఆరోపించింది.
దీని పై వెంటనే స్పందించిన వరుణ్ సందేశ్ ఆమె ఆరోపణలు అన్నీ అవాస్తవమని, ఆ సినిమా ప్రచార పోస్టర్లలో ప్రొడ్యూసర్ కొడుకు ఫోటోలు వేయించుకున్నాడని, అది చూసి నేనే షాకయ్యానని, ఆమె పట్ల నేను అసభ్యంగా ప్రవర్తించలేదని, మెస్సేజ్ లు పంపించలేదని అన్నాడు. వీరి వాదోపవాదాలు ఎలా ఉన్నా సినీ జనాలు వీరిద్దరు పబ్లిసిటీ స్టంట్ కోసమే ఈ గేమ్ ఆడుతున్నారని, ఎప్పుడో అయిపోయిన దాన్ని ఎప్పుడు ఎందుకు తవ్వుకుంటారని అనుకుంటున్నారు. ఇందులో నిజం ఎంతుందో పై వాడికే తెలియాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more