హింది సీరియళ్ల పేర్లు చెప్పగానే గుర్తుకొచ్చే పేరు ఏక్తా కపూర్. బుల్లితెరపై నిర్మాతగా ఎన్నో విజయాలను సాధించిన ఏక్తాను సినిమాల విషయానికొచ్చేసరికి చాలామంది నిరుత్సాహపరిచారట. హమ్ పాంచ్, ఇతిహాస్, కోషిష్ ఏక్ ఆశా, క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ, కహానీ ఘర్ ఘర్ కీ, కుసుమ్.. ఏక్ ఆమ్ లడ్కీ కీ కహానీ, కసౌటి జిందగీ కే... బుల్లితెర మీద తన హవా చూపించింది. కానీ ‘బుల్లితెర వేరు.. వెండితెర వేరు.. సినిమాలు తీయడం నీవల్ల కాదంటూ ఆమెను వెనక్కి లాగే ప్రయత్నం చేశారట. ఒకవేళ ఏక్తా కపూర్ సినిమాలు తీసినా నగలు, ఆభరణాలు, అత్తా, కోడలు ఇవే ఉంటాయి తప్ప చూడ్డానికి మరేం ఉండదంటూ ఎద్దేవా కూడా చేశారట. అయితే వారి విమర్శలను సవాలుగా తీసుకొని సినిమా రంగంలోకి ప్రవేశించానని, వెండితెరపై కూడా తానేంటో నిరూపించుకున్నానని చెబుతోంది ఏక్తా. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై’, ‘రాగిణి ఎంఎంఎస్’ వంటి అండర్ వరల్డ్ థ్రిల్లర్స్‌ను తెరకెక్కించి బాలీవుడ్‌లోనూ సత్తా చాటింది. ఇక ఓ నటి జీవిత కథను ‘ద డర్టీ పిక్చర్’ పేరుతో తెరకెక్కించి పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే తన సినీరంగ ప్రవేశం నల్లేరు మీద నడకేం కాదని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది ఏక్తా. అయితే ఆ ఇబ్బందులను తాను ఎంజాయ్ చేశానంది. అయితే ఈ స్ఫూర్తిని తాను ప్రజల నుంచే పొందానని, ప్రజలతో మాట్లాడడమన్నా, వారి జీవిత విశేషాలు తెలుసుకోవడమన్నా తనకెంతో ఇష్టమని చెప్పింది. భవిష్యత్తులో కూడా బాలాజీ టెలీఫిలిమ్స్ మరెన్నో ప్రేక్షకాదరణ పొందే సీరియళ్లను, చిత్రాలను తెరకెక్కిస్తుందని చెబుతోంది.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more