MCA Movie Review and Rating | ఎంసీఏ మూవీ రివ్యూ.. నాని విత్ పరమ రోటీన్ డ్రామా

Teluguwishesh ఎంసీఏ ఎంసీఏ Nani MCA Movie Review and Rating. Caste and Crew Performances. Product #: 86175 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)

  • బ్యానర్  :

    శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్

  • దర్శకుడు  :

    వేణు శ్రీరామ్

  • నిర్మాత  :

    దిల్ రాజు

  • సంగీతం  :

    దేవిశ్రీ ప్రసాద్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    సమీర్ రెడ్డి

  • ఎడిటర్  :

    ప్రవీణ్ పూడి

  • నటినటులు  :

    నాని - సాయి పల్లవి - భూమిక - విజయ్ వర్మ - రాజీవ్ కనకాల - నరేష్ - ఆమని - ప్రియదర్శి - రచ్చ రవి - పవిత్ర లోకేష్ - శుభలేఖ సుధాకర్ తదితరులు

Mca Movie Review And Rating

విడుదల తేది :

2017-12-21

Cinema Story

తన అన్న (రాజీవ్ కనకాల)తో సంతోషంగా జీవించే నాని(నాని) పని లేకుండా ఆకతాయిగా తిరుగుతుంటాడు. ఆ సమయంలో జ్యోతి (భూమిక) తన అన్నని పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగుపెట్టగానే వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. దాంతో వదినా మీద కోపం పెంచుకుంటాడు నాని. అదే సమయంలో జ్యోతికి వరంగల్ ట్రాన్స్ ఫర్ కావటంతో తోడుగా నానిని ఇచ్చి పంపిస్తాడు వాళ్ల అన్నయ్య. అక్కడ వదిన టార్చర్ కి పారిపోదామనుకున్న సమయంలో పల్లవి (సాయి పల్లవి) నానికి తారసపడుతుంది. వాళ్ల లవ్ స్టోరీ సజావుగా సాగిపోతున్న సమయంలో జ్యోతి సిన్సియారిటీ మూలంగా శివ(విజయ్ వర్మ) అనే రౌడీ నుంచి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి నాని ఆ విలన్ నుంచి తన వదినను కాపాడుకున్నాడా..? అన్నదే కథ.

cinima-reviews
ఎంసీఏ

వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న నాని ఈ ఏడాది అప్పుడే నేను లోకల్, నిన్ను కోరి లతో రెండు హిట్లు కొట్టి ఉన్నాడు. ఇప్పుడు ముచ్చటగా హ్యాట్రిక్ కోసం ఎంసీఏ(మిడిల్ క్లాస్ అబ్బాయి) గా మన ముందుకు వచ్చాడు. ఇక సాయి పల్లవి, భూమిక లాంటి క్రేజీ స్టార్లు ఇందులో నటించారు. ట్రైలర్ తో మంచి అంచనాలు రాబట్టిన ఈ చిత్రం విడుదలైంది. మరి ఈ చిత్ర రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

విశ్లేషణ.. 

నాని ఉంటే చాలు ఏ సినిమా అయినా హిట్ అనే భావన దాదాపు ప్రతి ఒక్కరిలో క్రియేట్ అయింది. స్టోరీ బలంగా లేకపోయినా.. నాని ఫ్లస్ కామెడీ ఉంటే సినిమా నడిచేస్తుంది అనే ఫీలింగ్‌తో నిర్మాతలు కూడా అతడిపై భారీ పెట్టుబడులు పెడుతున్నారు. సినిమాకి ముఖ్యమయిన ప్లస్ పాయింట్ నాని. ప్రథమార్థంలో వచ్చే నానీ, అతని మిడిల్ క్లాస్ జీవితం తాలూకు సీన్లు, వదిన మరిది మధ్య నడిచే చిన్నపాటి మనస్పర్ధను బయటపెట్టే సన్నివేశాలు బాగున్నాయి. ఇందులోన నాని, సాయి పల్లవిల ప్రేమ ట్రాక్ కూడా కొంత ఆనందకరం గా సాగుతూ ఆకట్టుకుంది.నాని, సాయి పల్లవి కలిసి కనిపించే సన్నివేశాలను అందంగా కనిపించటం కొంత ఆహ్లాదాన్నిచ్చాయి.

ఫస్ట్ హాఫ్ వరకు సినిమా సాఫీగా సాగిపోతుంది. నాని తనదైన స్టయిల్‌లో బాగా ఎంటర్‌టైన్ చేశాడు. ఇక ఇంటర్వల్ సీన్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోతారు. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ మొదలవుతుందో.. ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వడం ఖాయం. సినిమాను బాగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడా ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు. ప్రీ క్లైమాక్స్ వరకు ఇదే పరిస్థితి. పోనీ పతాక సన్నివేశాలు ఏమైనా బాగున్నాయా అంటే అదీ లేదు. అసలు క్లైమాక్స్ ఎపిసోడ్ ఎవరూ ఊహించని విధంగా ఉంది. అయితే నాని క్రేజ్ తో దానిని నిలబెట్టేందుకు యత్నించినా అది అంతగా కుదర్లేదనిపిస్తోంది. ప్రథమార్ధం మాదిరి సెకండ్ హాఫ్‌లో కూడా వినోదం ఉండి ఉంటే కొంతవరకు బాగుండేది. దర్శకుడు వేణు శ్రీరామ్ పాత కథనే తీసుకున్న దానికి కొత్తగా అనిపించే కథనం, సన్నివేశాలని రాసుకోవడంలో విఫలమయ్యారు. సినిమాని తొందరగా రొటీన్ కథలోకి తీసుకెళ్లకుండా నానితో ఎక్కువసేపు మేనేజ్ చేసినా ఇక కథ లోకి ప్రవేశించక తప్పదు అన్నప్పుడు ఒక్కో లోపం బయటపడుతూ సెకండాఫ్ నిరుత్సాహానికి గురిచేసింది.

నటీనటుల ఫెర్ ఫార్మెన్స్...

మిడిల్ క్లాస్ కుర్రాడిలా నాని నటన చాలా బాగుంది.సినిమాకి బలహీనపడుతున్న సమయానికి నాని తన నాచురల్ పెర్ఫార్మెన్స్ తో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. చాలా చోట్ల సక్సెస్ అయ్యాడు కూడ. సాయి పల్లవి ఉన్నంతలో తన పాత్రలో బాగానే నటించింది. కానీ, ఆమె పాత్రను మరీ వీక్ చేశారేమో అనిపించకమానదు. సెకండాఫ్ లో అయితే ఆమె క్యారెక్టర్ సరిగ్గా కనిపించదు కూడా. ఇక చాలా గ్యాప్ తర్వాత భూమిక ఓ కీలక పాత్రలో బాగా చేశారు. లేడీ RTO ఆఫీసర్ గా తన పాత్రకి తగిన న్యాయం చేసింది. అలాగే రాజీవ్ కనకాల,ఆమని,నరేష్,వెన్నెల కిషోర్,ప్రియదర్శిన్..తమ తమ పాత్రలకు సరిపోయారు.

సాంకేతిక విభాగం:

దేవీశ్రీప్రసాద్ దగ్గర వుండిపోయిన ట్యూన్లు, లేదా హర్రీ హర్రీగా చేసిన ట్యూన్ లు ఇచ్చినట్లున్నాయి. రొటీన్ గా వున్నాయి తప్ప సూపర్ అన్నవి లేవు. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కూడా పెద్దగా మనసు పెట్టి చేసినట్లు లేదు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఏమీ లేదు. లొకేషన్లు అన్నీ వరంగల్ చుట్టూనే తిరిగాయి. అందువల్ల పెద్దగా కొత్తగా కానీ, వింతగా కానీ ఏమీ లేవు. నాచురల్ లోకేషన్లు చూడడం మన జనాలకు అలవాటు తగ్గింది. ముఖ్యంగా చిన్న పట్టణాల విషయంలో. అందువల్ల సినిమాను చీప్ గా చుట్టేసిన లుక్ వచ్చింది. అయితే కొత్తగా సాంగ్ లో మాత్రం బాగా చూపించారు. డైలాగులు కూడా పెద్దగా పేలలేదు. ఎడిటింగ్ సెకండాఫ్ లో కాస్త పడాలి అనిపిస్తుంది. దిల్ రాజు ప్రోడక్షన్ వాల్యూస్ మాములుగా ఉన్నాయి.

ఫ్లస్ పాయింట్లు...

నాని నటన
ఫస్టాఫ్
భూమిక పాత్ర

మైనస్ పాయింట్స్:
సెకండాఫ్
మ్యూజిక్

తీర్పు...

దర్శకుడు వేణు శ్రీరామ్ పాత కథనే తీసుకున్న దానికి కొత్తగా అనిపించే కథనం, సన్నివేశాలని రాసుకోవడంలో విఫలమయ్యారు. సినిమాని తొందరగా రొటీన్ కథలోకి తీసుకెళ్లకుండా నానితో ఎక్కువసేపు మేనేజ్ చేసినా ఇక కథ లోకి ప్రవేశించక తప్పదు అన్నప్పుడు ఒక్కో లోపం బయటపడుతూ సెకండాఫ్ నిరుత్సాహానికి గురిచేసింది. నాని నటనను అమితంగా ఇష్టపడేవాళ్ళు, సినిమా రెగ్యులర్ ఫార్మాట్ ను ఎంజాయ్ చేయగల ప్రేక్షకులు ఈ సినిమా చూడొచ్చు.


చివరగా... ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి పరమ రొటీన్‌