ఖైదీ నంబర్ 150 మూవీ రివ్యూ | khaidi no 150 movie review

Teluguwishesh ఖైదీ నంబర్ 150 ఖైదీ నంబర్ 150 Chiranjeevi's khaidi no 150 movie review. Product #: 80209 3.5 stars, based on 1 reviews
 • చిత్రం  :

  ఖైదీ నంబర్ 150

 • బ్యానర్  :

  కొణిదెల ప్రోడక్షన్ కంపెనీ

 • దర్శకుడు  :

  వివి వినాయక్

 • నిర్మాత  :

  రాంచరణ్

 • సంగీతం  :

  దేశీశ్రీప్రసాద్

 • సినిమా రేటింగ్  :

  3.53.53.5  3.5

 • ఛాయాగ్రహణం  :

  ఆర్. రత్నవేలు

 • ఎడిటర్  :

  గౌతం రాజు

 • నటినటులు  :

  చిరంజీవి, కాజల్, తరుణ్ అరోరా, అలీ, శ్రీయా, లక్ష్మీ రాయ్ తదితరులు

Khaidi No 150 Movie Review

విడుదల తేది :

2017-01-11

Cinema Story

కథ:

దొంగతనం కేసులో జైలు కెళ్లిన కత్తి శీను(చిరంజీవి) అనే ఖైదీ కలకత్తా జైలు నుంచి చాకచక్యంగా తప్పించుకుని హైదరాబాద్ వస్తాడు. అక్కడ తన స్నేహితుడు(అలీ) సాయంతో విదేశాలకు పారిపోదామని యత్నిస్తాడు. ఈ క్ర‌మంలో సుబ్బలక్ష్మి(కాజల్) లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అతన్ని ఆపేస్తుంది. ఆపై అనుకోని పరిస్థితిలో అచ్చం తనలాగే ఉన్న శంక‌ర్‌ను చూసి షాక్ అవుతాడు. వెంటనే ఫ్లాన్ వేసి శంకర్ ప్లేస్ లోకి వెళ్లిపోయి, పోలీసుల దగ్గర శంక‌ర్‌ ను ఇరికిస్తాడు. 

ఇక అక్కడి నుంచి శంకర్ పెట్టిన ఓ ఓల్డేజ్ హోంకి వెళ్లగా, అక్కడ అంతా శీనునే శంకర్ అనుకోవటంతో హ్యాపీగా సెటిల్ అయిపోతాడు. అంతేకాదు తన దిల్ కా దడ్కన్ సుబ్బ‌ల‌క్ష్మి కూడా అక్కడే ఉండటంతో డబుల్ హ్యాపీగా ఫీలయిపోతాడు. అంతా సాఫీగా సాగిపోతుందన్న సమయంలో శంకర్ సన్మాన కార్యక్రమంలో శీనుకి కొన్ని భయంకర వాస్తవాలు తెలుస్తాయి. రైతుల ఆత్మహత్యలు, కార్పొరేట్ అగర్వాల్ (తరుణ్ అరోర్) అనే దుష్టశక్తితో శంకర్ నీరూరు గ్రామస్థుల తరపున న్యాయం కోసం పోరాటం చేయటం గురించి తెలిసి శీను మారిపోతాడు. అక్కడి నుంచి ఆ బాధ్యతలను తన నెత్తిన మీద వేసుకుని ముందుకెళ్తాడు. ఈ క్రమంలో శీను విజయం సాధించాడా? ‘అసలు శంకర్’ పరిస్థితి ఏంటి? శీను ఏమౌతాడు? చివరకు కథ ఎలా ముగుస్తుంది...

cinima-reviews
ఖైదీ నంబర్ 150

టాలీవుడ్ నుంచి నిష్క్రమించి దాదాపు తొమిదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వచ్చాడు. అయితే లాంగ్ గ్యాప్, పైగా ల్యాండ్ మార్క్ 150వ చిత్రం కావటంతో కమర్షియల్ పంథాలో కాకుండా, సోషల్ మెసేజ్ తో కూడుకున్న అంశంతో రావాలని భావించాడు. ఈ క్రమంలోనే తమిళంలో మురగదాస్ డైరక్షన్ లో ఇదయదళపతి విజయ్ నటించిన కత్తి రీమేక్ తో మన ముందుకు వచ్చాడు. దీంతో మొదట్లో విమర్శలు వినిపించాయి. మరి బాస్ ఈజ్ బ్యాక్ ఏ రేంజ్ లో ఉందో? చిరు ప్రేక్షకులను ఎలా మెప్పించాడో? ఇప్పుడు చూద్దాం...


కథ:
దొంగతనం కేసులో జైలు కెళ్లిన కత్తి శీను(చిరంజీవి) అనే ఖైదీ కలకత్తా జైలు నుంచి చాకచక్యంగా తప్పించుకుని హైదరాబాద్ వస్తాడు. అక్కడ తన స్నేహితుడు(అలీ) సాయంతో విదేశాలకు పారిపోదామని యత్నిస్తాడు. ఈ క్ర‌మంలో సుబ్బలక్ష్మి(కాజల్) లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అతన్ని ఆపేస్తుంది. ఆపై అనుకోని పరిస్థితిలో అచ్చం తనలాగే ఉన్న శంక‌ర్‌ను చూసి షాక్ అవుతాడు. వెంటనే ఫ్లాన్ వేసి శంకర్ ప్లేస్ లోకి వెళ్లిపోయి, పోలీసుల దగ్గర శంక‌ర్‌ ను ఇరికిస్తాడు.

ఇక అక్కడి నుంచి శంకర్ పెట్టిన ఓ ఓల్డేజ్ హోంకి వెళ్లగా, అక్కడ అంతా శీనునే శంకర్ అనుకోవటంతో హ్యాపీగా సెటిల్ అయిపోతాడు. అంతేకాదు తన దిల్ కా దడ్కన్ సుబ్బ‌ల‌క్ష్మి కూడా అక్కడే ఉండటంతో డబుల్ హ్యాపీగా ఫీలయిపోతాడు. అంతా సాఫీగా సాగిపోతుందన్న సమయంలో శంకర్ సన్మాన కార్యక్రమంలో శీనుకి కొన్ని భయంకర వాస్తవాలు తెలుస్తాయి. రైతుల ఆత్మహత్యలు, కార్పొరేట్ అగర్వాల్ (తరుణ్ అరోర్) అనే దుష్టశక్తితో శంకర్ నీరూరు గ్రామస్థుల తరపున న్యాయం కోసం పోరాటం చేయటం గురించి తెలిసి శీను మారిపోతాడు. అక్కడి నుంచి ఆ బాధ్యతలను తన నెత్తిన మీద వేసుకుని ముందుకెళ్తాడు. ఈ క్రమంలో శీను విజయం సాధించాడా? ‘అసలు శంకర్’ పరిస్థితి ఏంటి? శీను ఏమౌతాడు? చివరకు కథ ఎలా ముగుస్తుంది...

విశ్లేషణ...


హీరోగా చిరు రీఎంట్రీ, పైగా రీమేక్, దర్శకుడిగా వివి వినాయక్. మెసేజ్ ఓరియంటల్ చిత్రం అని చెప్పటంతో అంతా ఠాగూర్ లా ఊహించుసేసుకోవచ్చు. కానీ, ఖైదీ అలా కాదు. రైతు సమస్యల మీద సాగే మాతృక క‌త్తిని సీన్ టూ సీన్ మక్కికి మక్కి దించేశాడు వినాయక్. ఒరిజినల్ వర్షన్ ను ఎలా ఉందో అలా దింపేసి ప్రయోగాలు చేయకుండా సేఫ్ గేమ్ ఆడాడు. అయితే మధ్య మధ్యలో కొత్తగా కామెడీ ఎపిసోడ్‌ను మాత్ర‌మే అదనంగా జత చేయగా, అది అంతగా వర్కవుట్ కాలేదు. స్క్రీన్ ప్లేలో కూడా పెద్దగా మార్పులు చేయలేదు.

ఫస్టాఫ్ ఫన్, ఎంటర్టైన్మెంట్ తో సాగిపోయిన ఈ చిత్రం సెకండాఫ్ కు వచ్చేసరికి కాస్తంతం నెమ్మిదించిందనే చెప్పాలి. కానీ, కీలకమైన కథ అంతా ద్వితియార్థంలోనే ఉండే సరికి ప్రేక్షకుడు ఎంగేజ్ అవుతాడు. తొమ్మిదేళ్ల తర్వాత ఎంట్రీ ఇస్తున్నాడంటే... అభిమానులు డాన్సు, ఫైట్స్ లాంటివి ఎక్స్ పెక్ట్ చేస్తారని స్వయంగా చిరుయే చెప్పాడు. అదే ఇందులో చేయించాడు దర్శకుడు. ఫ్లాట్ నేరేషన్ తో యావరేజ్ ఫస్టాఫ్ తో, ఎమోషనల్ సెకండాఫ్ తో సినిమాను తీశాడు. అయితే సీరియస్ గా ముగుస్తుందనుకున్న క్లైమాక్స్ లో సిల్లీనెస్ పెట్టడం కాస్త ఇబ్బంది కలిగించే అంశమే.

ఇక ఫెర్ ఫార్మెన్స్ విషయానికొస్తే.. చిరు రీఎంట్రీలో అదరగొట్టాడు. గడ్డం రఫ్ లుక్కుతో పాత మెగాస్టార్ ను గుర్తుచేశాడు. ముఖ్యంగా 61 ఏళ్లలో యంగ్ లుక్కు కోసం, ఆ బాడీ లాంగ్వేజ్ కోసం పడిన కష్టం కనిపిస్తుంది. వాయిస్ లో బేస్ కాస్త తగ్గినట్లనిపించినప్పటికీ, తనదైన కామెడీ టైమింగ్, స్టైల్, ఎమోషనల్ సీన్లలో నటన, మోస్ట్ ఇంపార్టెంట్ డాన్సుల విషయంలో నిజంగానే కుమ్మి పడేశాడు. కత్తి శీనుగా, శంకర్ గా ద్విపాత్రాభినయంకి పూర్తి న్యాయం చేశాడు. ఇంతకన్నా మంచి కమబ్యాక్ సినిమా ఉండబోదు అన్న రీతిలో తెరపై విజృంభించాడు. పదేళ్ల తర్వాత తమ హీరోను చూస్తున్న అభిమానులకు ఇది ఖచ్ఛితంగా పండగే.

ఇక కాజల్ విషయాకొస్తే... లిమిట్ రోల్ లో బాగా చేసింది. చిరు పక్కన చక్కగా కుదిరింది. విమర్శకుల నోళ్లు మూయించేలా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండింది కూడా. అమ్మడు సాంగ్ లో తమ్ముడు బీట్ కి చెర్రీ సర్ ప్రైజ్ బాగుంది. చిరుకి స్నేహితుడిగా చివరి వరకు ఉండే స్నేహితుడి పాత్రలో అలీ ఆకట్టుకున్నాడు. స్టైలిష్ విలన్ గా తరుణ్ అరోర్ ఫర్వాలేదనిపించాడు. పోసాని, జయప్రకాశ్, బ్రహ్మీ, పృథ్వీ వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు.

 

టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. దేవీ మ్యూజిక్ ఏబోవ్ యావరేజ్ గా ఉంది. పాటలు అల్రెడీ హిట్ కావటంతో పాస్ మార్కులు వేయించుకున్నాడు. అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం అదరగొట్టాడు. కానీ, కాయిన్ ఫైట్ లో ఒరిజినల్ కత్తిలోని బీజీఎంనే కాస్త మార్చి వాడేసుకున్నా బాగా సూట్ అయ్యింది. రత్నవేలు అందించిన కెమెరా వర్క్ సూపర్బ్ గా ఉంది. ఫైట్లు, పాటల్లో లొకేషన్లను అద్భుతంగా చూపించాడు. సీనియర్ ఎడిటర్ గౌతంరాజు ఎడిటింగ్ బాగుంది. ముగ్గురు స్టార్ రైటర్లు పనిచేశారంటే డైలాగులను ఓ రేంజ్ లో ఊహించేసుకుంటాం. కానీ, ప‌రుచూరి-వేమారెడ్డి-బుర్రా సాయిమాధ‌వ్ లు అక్కడక్కడ పేలే మాటలు మాత్రమే అందించారు. రామ్-లక్ష్మణ్ యాక్షన్ సీక్వెన్స్ లు అలరించాయి. కొణిదెల ప్రోడక్షన్ తొలి చిత్రమే అయినా చిరు మూలంగా చాలా రిచ్ గా ఉంది.

 

ఫ్లస్ పాయింట్లు:


కథ
చిరు ఎనర్జిటిక్ ఫెర్ పార్మెన్స్
రత్నవేలు సినిమాటోగ్రఫీ
కొరియోగ్రఫీ
ప్రీ ఇంటర్వెల్ సీన్

 


మైనస్ పాయంట్లు:

సెకండాఫ్ కాస్త సాగదీత
బలవంతంగా ఇరికించిన కామెడీ సీన్లు


తీర్పు:

ఒరిజినల్ కత్తిలోని ఫీలింగ్ మిస్ అయినప్పటికీ, ప్రేక్షకుల్లో ముఖ్యంగా మెగా అభిమానుల్లో మాత్రం మంచి జోష్ ను నింపిందనే అనుకోవాలి. దశాబ్దం తర్వాత చిరు కమ్ బ్యాక్ కావటంతో కేవలం మెగాస్టార్ కోసమే ఈ సినిమా అన్న ప్రచారం జరగటంతో అక్కడే సగం పైగా విజయం దక్కించుకుంది. ఖైదీ ఓ గొప్ప సినిమా కాదు.. అలాగని బాగలేదు అనటానికి కూడా లేదు. మంచి కథ, అంతకు మించి చిరు నట విశ్వరూపం ఖైదీని సేఫ్ సైడ్ లో నిలబెట్టాయి. చిరు ఇమేజ్ కు ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా దర్శకుడు వినాయక్ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు.

చివరగా.. ఖైదీ కేవలం అభిమానులకే కాదు.. ప్రతి సినీ ప్రేక్షకుడికి పెద్ద ట్రీటే...

 

 

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.