సెల్ఫీ రాజా రివ్యూ | selfie raja movie review

Teluguwishesh సెల్పీ రాజా సెల్పీ రాజా Allari Naresh selfie raja movie review Product #: 76409 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సెల్ఫీ రాజా

  • బ్యానర్  :

    ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, గోపీ ఆర్ట్స్

  • దర్శకుడు  :

    జీ ఈశ్వర్ రెడ్డి

  • నిర్మాత  :

    అనిల్ సుంకర

  • సంగీతం  :

    సాయి కార్తీక్

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఎడిటర్  :

    ఎంఆర్ వర్మ

  • నటినటులు  :

    అల్లరి నరేస్, సాక్షి చౌదరి, కామ్న రనావత్, రవిబాబు, అజయ్ ఘోష్, థర్టీ ఇయర్స్ పృథ్వీ తదితరులు

Allari Naresh Selfie Raja Movie Review

విడుదల తేది :

2016-07-15

Cinema Story

సెల్ఫీ రాజా పేరులో అతనికి ఉన్న పిచ్చి ఏంటో తెలిసిపోతుంది. కుక్క దగ్గరి నుంచి చనిపోయిన శవం దాకా ఎవరినీ వదలిపెట్టకుండా... సెల్ఫీలే సెల్ఫీలు దిగుతుంటాడు. ఇంతలో శ్వేతా(కామ్నారనావత్) ని చూసి లవ్ లో పడిపోతాడు. పెద్దల ఆశీర్వాదంతో వాళ్ల పెళ్లి కూడా అయిపోతుంది. అయితే ఫస్ట్ నైట్ లో మొగుడిపై అనుమానంతో శ్వేతా రాజాని వదిలివెళ్లిపోతుంది. అంతగా ప్రేమించిన భార్య దూరం కావటంతో చనిపోయేందుకు సిద్ధమైపోతాడు రాజా. అందుకోసం కాకి అనే కరుడుగట్టిన రౌడీకి సుపారీ ఇస్తాడు.

                ఇంతలో భార్య తిరిగి రావటంతో తనను చంపొద్దని రాజా కాకితో చెబుతాడు.. కానీ, కాకి మాత్రం చంపే తీరుతానని వెంటపడతాడు, అదే టైంలో మరో గ్యాంగ్ కూడా రాజా వెంటపడుతుంది. ఈ గజిబిజి గందరగోళంలో రాజా ఎలా తప్పించుకుంటాడు. చివరికి భార్యతో సుఖంగా ఎలా ఉంటాడు అన్నదే కథ.

cinima-reviews
సెల్పీ రాజా

పరాజయాలు వచ్చినా కామెడీ ట్యాగ్ లైన్ తో ఫ్యామిలీస్ ను థియేటర్లకు రప్పించగలిగాడు అల్లరి నరేష్. అయితే రాను రాను ఆ ఫ్లాపుల లిస్ట్ మరీ పెరిగిపోతుండటంతో వచ్చిన సినిమాలు ఎన్నో, ఏంటో కూడా
ఎవరికీ తెలీకుండా పోతున్నాయి. సుడిగాడు తర్వాత ఏ సినిమా తీసినా సరే స్ఫూఫ్ ల మయంగానే కనిపిస్తోంది. దీంతో ఎలాంటి సినిమా తీసినా జనాలు ఆదరించలేకపోతున్నారు. అయితే ఈసారి మాత్రం కాస్త వెరైటీ ప్రయోగానికే సిద్ధపడిపోయాడు. సెల్ఫీ రాజా గా మన ముందుకు వచ్చాడు. మరి ఏమాత్రం అలరించాడో రివ్యూలోకి వెళ్లి చూద్దాం...

ఫ్లస్ పాయింట్లు

అల్లరి నరేష్ త‌న ప‌రిధిలో బాగానే న‌టించాడు.. ఇక హీరోయిన్స్ సాక్షి చౌదరి, కామ్నా రణావత్ లు గ్లామ‌ర్ తో బండిలాగించేశారు..థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఉన్నంత‌లో న‌వ్వించాడు. సాయి కార్తీక్ ఈ సినిమా
స్టాండర్డ్స్ కంటే మంచి మ్యూజిక్ ఇచ్చాడు.

మైనస్ పాయింట్లు
కన్ఫ్యూజన్ కామెడీ, యాక్షన్ కామెడీ అంటూ.. కోవలో చాలా కామెడీ చిత్రాలు వచ్చాయి. కథ, కథనంతో సినిమాను కొత్తగా ప్రెజంట్ చేస్తే హిట్ కావటం ఖాయం. కానీ, దర్శకుడు ఈశ్వర్ రెడ్డి దాన్ని పూర్తిగా
వదిలేవాడు. కొత్తగా ఉంటుందేమో అని థియేటర్ కు వెళ్లే ప్రేక్షకుడు చెత్తగా ఫీలవుతాడు. అల్లరి నరేష్ లాంటి హీరో, బడా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంత పస లేని సినిమా వచ్చిందా అనిపిస్తోంది. రెండు గంటల
సినిమాకు కుదించి ప్రేక్షకులకు రిలీఫ్ కలిపించాడు ఎడిటర్ వర్మ. నిత్యం వాట్సాప్ లలో, ఫేస్ బుక్ లలో తెలిసిన జోక్స్‌ని కామెడీ సీన్స్‌గా అల్లేశారు. ఓ పది సీన్స్‌లలో మాత్రమే మనం నవ్వుకుంటామంటే పరిస్థితి
అర్థం చేసుకోవచ్చు. చాలా రోటిన్ గా తీసిన సినిమా. మిగిలిన న‌ట‌లు న‌వ్వించేందుకు ప్రయ‌త్నించినా న‌వ్వులు మాత్రం రావు.

విశ్లేషణ.
ముందసలు ఈ చిత్రానికి సెల్ఫీ రాజా అన్న టైటిల్ ఎందుకు పెట్టారో అర్థం కావటం లేదు. పబ్లిసిటీలో చూపిందానికి, సినిమా పేరుకు అస్సలు సంబంధం ఉండదు. ఏదో మొక్కుబడిగా కొన్ని సెల్ఫీ పిచ్చి సీన్లు
పెట్టారు గానీ, వాటి వల్లే అతని జీవితం మలుపు తిరగటం, చివరికి రియలైజ్ లాంటివి చూపించి ఉంటే బావుండేది. నాలుగు ఎక్స్ పోజింగ్ సీన్లు, అర్థం పర్థం లేని కామెడీ సీన్లు, వీటన్నింటిని భరించడం కష్టమే.
చివరగా.. సెల్ఫీ రాజా... పరమ బోరింగ్ రాజా. 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.