Dictator | Balakrishna | Dictator Review | Anjali

Teluguwishesh డిక్టేటర్ డిక్టేటర్ Get The Complete Details of Dictator Telugu Movie Review. The Latest Telugu Movie Dictator featuring Balakrishna, Anjali and Sonal Chauhan. music is composed by S Thaman. Directed by Sriwass. Produced by Eros International & co-produced by Vedaashwa Creations. For More Details Visit Teluguwishesh.com Product #: 71797 3 stars, based on 1 reviews
 • చిత్రం  :

  డిక్టేటర్

 • బ్యానర్  :

  ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్

 • దర్శకుడు  :

  శ్రీవాస్

 • నిర్మాత  :

  ఈరోస్ ఇంటర్నేషనల్

 • సంగీతం  :

  ఎస్‌.ఎస్‌.థమన్

 • సినిమా రేటింగ్  :

  333  3

 • ఛాయాగ్రహణం  :

  శ్యామ్‌ కె.నాయుడు

 • ఎడిటర్  :

  గౌతంరాజు

 • నటినటులు  :

  బాలకృష్ణ, అంజలి, సొనాల్ చౌహన్ తదితరులు

Dictator Movie Telugu Review

విడుదల తేది :

2016-01-14

Cinema Story

తన మామగారి ఇంట్లో వుంటూ ఒక సూపర్ మార్కెట్లో పనిచేసుకుంటూ వుంటాడు చందు(బాలకృష్ణ). అనుకోకుండా ఒకరోజు ఇందు(సోనాల్ చౌహన్)తో పరిచయం ఏర్పడుతుంది. సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాల కోసం ఇందు ట్రై చేస్తూ వుంటుంది. ఇందు అన్నయ్య(రాజీవ్ కనకాల) ఓ డ్రగ్ మాఫియా ఒక పోలీస్ ఆఫీసర్ ను చంపడం చూస్తాడు. రాజీవ్ సాక్ష్యం చెప్తాడని, అతడిని కూడా చంపాలని మాఫియా ట్రై చేస్తుంది. కానీ రాజీవ్ పారిపోతాడు. రాజీవ్ ఆచూకి కోసం ఇందుని కిడ్నాప్ చేస్తారు మాఫియా గ్యాంగ్. ఇందుని కాపాడే ప్రయత్నంలో 22మందిని చంపేస్తాడు చందు. ఆ చనిపోయిన వారిలో కేంద్రమంత్రి కొడుకు కూడా వుంటాడు. దీంతో చందుని చంపాలని కేంద్రమంత్రి ప్రయత్నిస్తాడు.

సీన్ కట్ చేస్తే.. చందు పనిచేస్తున్న సూపర్ మార్కెట్లో ఓ వ్యక్తి తన కూతురు పెళ్లికోసం 5లక్షలు దొంగలిస్తాడు. కానీ ఆ నేరాన్ని చందు తనపై వేసుకొని పోలీసులకు లొంగిపోతాడు. ఇదంతా కూడా టీవిల్లో ప్రసారం అవుతుంది. కరెప్టెడ్ పోలీస్ ఆఫీసర్ అజయ్.. చందుపై కేసు ఫైల్ చేయకుండా, చందుని విలన్ గ్యాంగ్ కు అప్పగిస్తాడు. సీన్ కట్ చేస్తే.. టీవిల్లో చందు గురించి వస్తున్న వార్తలను చూసి ధర్మా గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ రాజశేఖర్.. చందుని రక్షించేందుకు ఢిల్లీ కేంద్ర హోంమంత్రితో సహ అందరితో మాట్లాడి నేరుగా రంగంలోకి దిగుతాడు. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.

అసలు చందు ఎవరు? అతనికి ఆ మాఫియా గ్యాంగ్ కు వున్న సంబంధం ఏంటి? చందుకు ధర్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు వున్న సంబంధం ఏంటి? అసలు చందు ఓ సూపర్ మార్కెట్లో ఎందుకు పనిచేస్తున్నాడు? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే వెండితెర మీద ‘డిక్టేటర్’ సినిమా చూడాల్సిందే.

cinima-reviews
డిక్టేటర్

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన 99వ చిత్రం ‘డిక్టేటర్’. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటించారు. బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 14న గ్రాండ్ లెవల్లో విడుద‌ల చేస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. థ‌మ‌న్ సంగీతం అందించిన పాటలకు, ట్రైల‌ర్లకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా మొదటి టికెట్ దాదాపు 3.5 లక్షల రూపాయలకు అమ్ముడుపోయి, కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలయ్యింది. కమర్షియల్ యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఎలా వుందో, ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్:

‘డిక్టేటర్’ చిత్రానికి మేజర్ ప్లస్ పాయింట్ నందమూరి బాలకృష్ణ మాత్రమే. ముందుగా అలాంటి టైటిల్స్ ను పెట్టుకుని, సినిమాలను చేయగల సత్తా ఒక్క నందమూరి బాలకృష్ణకే వుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు బాలయ్యను చాలా పవర్ ఫుల్, మాస్ యాక్షన్ హీరోగానే చూసాం కానీ ‘డిక్టేటర్’ సినిమాలో బాలయ్య చాలా స్టైలిష్ గా కనిపించాడు. ఈ సినిమా బాలయ్య తప్ప మరెవరూ చేయలేరనే విధంగా అనిపించింది.

ఇక బాలయ్య నటన సూపర్బ్. అభిమానులు డబుల్ ధమాకా సంక్రాంతి ఆఫర్ అని చెప్పుకోవచ్చు. రెండు విభిన్నమైన పాత్రలలో అదరగొట్టాడు. ఇక బాలయ్య డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇందులో బాలయ్య చెప్పిన డైలాగులకు థియేటర్లో ప్రేక్షకుల విజిల్స్, చప్పట్లతో మారుమ్రోగుతున్నాయి. సినిమాను మొత్తం కూడా తన భుజాలపై నడిపించేసాడు బాలయ్య. ఇంతకుముందెన్నడూ లేనంత చాలా స్టైలిష్ గా బాలయ్య కనిపించి అలరించాడు. ఇక యాక్షన్ సీన్లలో బాలయ్య తనలోని నటసింహాన్ని మరోసారి నిద్రలేపాడు. ఆకలితో వున్న సింహాం పంజా విసిరినట్లుగా బాలయ్య థియేటర్లో గర్జించేసాడు. డిక్టేటర్ పాత్రకు బాలయ్య వందకు వందశాతం పూర్తి న్యాయం చేసాడు.

ఇక హీరోయిన్లుగా నటించిన అంజలి, సోనాల్ చౌహన్ లు వారివారి పాత్రలలో మెప్పించారు. అంజలి తన పాత్రలో లీనమయ్యింది. కథకు మంచి బలాన్నిచ్చే పాత్రలో అంజలి మంచి నటనతో ఆకట్టుకుంది. బాలయ్య-అంజలిల మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. ఇక సోనాల్ చౌహన్ తన పాత్రకు మంచి గ్లామర్ ను తీసుకొచ్చింది. అందాల ఆరబోతతో పిచ్చెక్కించేసింది. ఇక విలన్ పాత్రలో నటించిన రతి అగ్నిహోత్రి తన పాత్రమేరకు పర్వాలేదనిపించింది.

ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించిన అక్ష, సుమన్, పృధ్వీ, పోసానీ తదితరులు వారి వారి పాత్రలలో పర్వాలేదనిపించారు. ఇక ముమైత్ ఖాన్, శ్రద్ధాదాస్ లతో చేసిన ‘టింగో టింగో... ’ ఐటెం సాంగ్ మాస్ ఆడియెన్స్ స్పెషల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి బాలయ్య ‘డిక్టేటర్’ అదరగొట్టేసాడు.

మైనస్ పాయింట్స్:
‘డిక్టేటర్’ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ కథ, స్ర్కీన్ ప్లే, విలన్ పాత్రలు. ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం, కథ పరంగా మాత్రం అస్సలు ముందుకు వెళ్లకపోవడం వలన కాస్త బోర్ కొడుతుంది. కొన్ని చోట్ల కావాలనే కామెడీని పెట్టినట్లుగా అనిపిస్తుంది. డిక్టేటర్ పాత్రను హైలైట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే కథను రాసుకున్నట్లుగా అనిపిస్తుంది తప్ప కథ పరంగా చాలా స్ట్రాంగ్ పాయింట్ ఏం కనిపించలేదు. ఇక బాలయ్య లాంటి డిక్టేటర్ పవర్ ఫుల్ పాత్రకు పోటీగా వుండే విలన్ పాత్ర చాలా సింపుల్ గా వుంటుంది. డిక్టేటర్ పాత్రను చాలా పవర్ఫుల్ గా రాసుకున్నప్పుడు విలన్ పాత్రను కూడా చాలా స్ట్రాంగ్ రాసుకోవాల్సింది. కానీ విలన్ పాత్రను సింపుల్ తీర్చిదిద్దేసారు. అంతేకాకుండా డిక్టేటర్ వంటి స్ట్రాంగ్ పవర్ ఫుల్ వ్యక్తికి విలన్ గా ఓ లేడీని పెట్టడం మేజర్ మైనస్ పాయింట్. సినిమాలో ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా చాలా ఫ్లాట్ గా సాగుతుంది. ఇక ‘డిక్టేటర్’కు రన్ టైం కూడా కాస్త ఎక్కువయ్యింది. దాదాపు 20 నిమిషాలు ఎడిట్ చేసినా కూడా సినిమాలో వేగం పెరిగి, మరింత జోష్ పెరిగేది.

సాంకేతికవర్గం పనితీరు:
‘డిక్టేటర్’ సినిమాకు శ్యాం.కె.నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ సూపర్బ్. బాలయ్యను చాలా స్టైలిష్ గా చూపించాడు. యాక్షన్, డాన్స్, సీన్లలను చాలా అందంగా చూపించాడు. విజువల్స్ పరంగా కన్నుల పండగా అనిపించే విధంగా గ్రాండ్ గా చూపించాడు. ఇందులో బాలయ్య చాలా యంగ్ గా కనిపించాడు. ఇక థమన్ సంగీతం అందించిన పాటలు విజువల్స్ పరంగా ఇంకా బాగున్నాయి. చిన్నా అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. డిక్టేటర్ పాత్రకు రీరికార్డింగ్ ప్రాణం పోసిందని చెప్పుకోవచ్చు. గౌతంరాజు ఎడిటింగ్ విషయంలో మరింత కాస్త జాగ్రత్త తీసుకొని వుంటే బాగుండేది. ఇక కోనవెంకట్, గోపిమోహన్ లు కథ విషయంలో మరింత కేర్ తీసుకొని వుంటే బాగుండేది. కనీసం విలన్ క్యారెక్టర్ ను మరింత స్ట్రాంగ్ గా రాసుకొని వున్నా కూడా సినిమా థియేటర్లో బాలయ్య విశ్వరూపం కనబడేది. కాబట్టి విలన్ పాత్ర స్ట్రాంగ్ గా లేకపోవడం వల్లనే కాస్త బాలయ్య విశ్వరూపం తగ్గిందని చెప్పుకోవచ్చు. రత్నం రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక దర్శకుడిగా శ్రీవాస్ సక్సెస్ అయ్యాడు. బాలయ్యను ‘డిక్టేటర్’గా ఎలా చూపించాలి అనే విషయంలో శ్రీవాస్ సక్సెస్ అయ్యాడు. ఇక ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి తొలిసారి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీవాస్. ‘డిక్టేటర్’ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

చివరగా:
‘డిక్టేటర్’: బాలయ్య మాస్ మసాలా ఎంటర్ టైనర్.

 

- Sandy