Loafer | Movie Review | Varun Tej | Puri Jagannadh

Teluguwishesh లోఫర్ లోఫర్ Get information about Loafer Movie Telugu Review, Puri Jagannadh Loafer Movie Review, Varun Tej Loafer Movie Review, Loafer Movie Review And Rating, Loafer Telugu Movie Talk, Loafer Movie Trailer, Varun Tej Loafer Review, Loafer Movie Gallery and more only on Teluguwishesh.com Product #: 71162 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    లోఫర్

  • బ్యానర్  :

    శ్రీ శుభశ్వేత ఫిలింస్

  • దర్శకుడు  :

    పూరీ జగన్నాథ్

  • నిర్మాత  :

    సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్, తేజ

  • సంగీతం  :

    సునీల్‌ కశ్యప్

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఛాయాగ్రహణం  :

    పి.జి.వింద

  • ఎడిటర్  :

    ఎస్‌.ఆర్‌.శేఖర్

  • నటినటులు  :

    వరుణ్‌తేజ్‌, దిశా పటాని, రేవతి, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రమ్య తదితరులు

Loafer Movie Review

విడుదల తేది :

2015-12-17

Cinema Story

చిన్నప్పుడే రాజ(వరుణ్ తేజ)ను తల్లి(రేవతి) నుంచి దూరం చేస్తాడు తండ్రి (పోసాని కృష్ణమురళి). తన తల్లి జాండీస్ వచ్చి చనిపోయిందని అబద్ధం చెప్పి, రాజను పెద్ద లోఫర్ గా పెంచుతాడు పోసాని. తన తల్లి చనిపోయిందని అనుకున్న రాజ పెద్ద లోఫర్ లా తయారవుతాడు. అనుకోకుండా పారిజాతం(దిషా పటానీ)తో పరిచయం ఏర్పడుతుంది. పారిజాతంను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు రాజ. అయితే అనుకోకుండా చనిపోయిందనుకున్న తన తల్లి రాజకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రాజను తన కొడుకుగా అంగీకరించిందా లేదా? అసలు పారిజాతం ఎవరు? మరి తన ప్రేమను దక్కించుకోవడానికి రాజ ఏం చేసాడు? రాజ జీవితంలోకి రేవతి ఎందుకు వచ్చింది? చివరకు ఏం జరిగింది అనే అంశాలు తెలియాలంటే వెండితెరపై ‘లోఫర్’ సినిమా చూడాల్సిందే!

 

cinima-reviews
లోఫర్

టాలీవుడ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లోఫర్’. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇందులో ‘సువ్వి సువ్వి సువ్వాలమ్మా...’ అనే మదర్ సెంటిమెంట్ తో సాగే పాట సూపర్బ్. యాక్టింగ్ పరంగా చూస్తే వరుణ్ కాస్త మెరుగైనట్లుగా కనిపిస్తున్నాడు.

ఇందులో వరుణ్ సరసన దిశాపటానీ హీరోయిన్ గా నటించింది. మదర్ సెంటిమెంట్, లవ్ రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ సంస్థ నిర్మాత సి.కళ్యాణ్ సమర్పణలో శ్రీ శుభశ్వేత ఫిలింస్ బ్యానర్ పై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్, తేజ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాను నేడు(డిసెంబర్ 17) ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసారు. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో నలుగురు ప్రధాన పాత్రలు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు. వారు వరుణ్, దిశా పటానీ, రేవతి, పోసాని. వరుణ్ ‘లోఫర్’ పాత్రకు న్యాయం చేసాడని చెప్పుకోవచ్చు. డైలాగ్ డెలివరీ బాగుంది. ఇక తల్లి పాత్రలో రేవతి యాక్టింగ్ సూపర్. తన కొడుకును లోఫర్ లా చేయాలని భావించే తండ్రిగా పోసాని యాక్టింగ్ సూపర్. ఆ తర్వాత వరుణ్-పోసానిల మధ్య సీన్స్ చాలా బాగున్నాయి. గ్లామర్ పరంగా దిశా పటానీ పర్వాలేదనిపించింది. మిగతా నటీనటులు వారి పాత్రల మేరకు బాగా నటించారు.

మైనస్ పాయింట్స్:
‘లోఫర్’ సినిమాలో ప్లస్ పాయింట్స్ తక్కువ.. మైనస్ పాయింట్లే ఎక్కువ. పైన చెప్పిన ఆ నలుగురి యాక్టింగ్ తీసేస్తే.. ఇక ఈ సినిమాలో అంతా మైనస్ అని చెప్పుకోవచ్చు.

సాంకేతికవర్గం పనితీరు:
సినిమాటోగ్రఫి సూపర్బ్. విజువల్స్ పరంగా చాలా బాగుంది. రెండు, మూడు పాటలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. డైలాగ్స్ బాలేవు. ఎడిటింగ్ అస్సలు బాగోలేదు. పూరీ ఏదో సరదా కోసం తీసినట్లుగా అనిపిస్తుంది. కథ, కథనంలో అస్సలు కొత్తదనం లేదు. పూరీ స్టైల్ సినిమా అయినప్పటికీ పాత చింతకాయ పచ్చడే అన్నట్లుగా వుంది. ఇక నిర్మాణ విలువలు కూడా పర్వాలేదనిపించాయి.

చివరగా:
‘లోఫర్’: బోర్ కొట్టించే సినిమా