Cheekati Rajyam Movie Review | Kamal Haasan | Trisha Krishnan

Teluguwishesh చీకటి రాజ్యం చీకటి రాజ్యం Get information about Cheekati Rajyam Movie Review, Cheekati Rajyam Movie Telugu Review, Kamal Haasan Cheekati Rajyam Movie Review, Cheekati Rajyam Movie Review And Rating, Cheekati Rajyam Movie Talk, Cheekati Rajyam Movie Trailer, Kamal Haasan Cheekati Rajyam Review, Cheekati Rajyam Movie Gallery and more Product #: 70404 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    చీకటి రాజ్యం

  • బ్యానర్  :

    రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్

  • దర్శకుడు  :

    రాజేష్ ఎం.సెల్వని

  • నిర్మాత  :

    ఎన్.చంద్రహాసన్

  • సంగీతం  :

    జిబ్రాన్

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    సనుజాన్ వర్గసే

  • ఎడిటర్  :

    షాన్ మహమ్మద్

  • నటినటులు  :

    కమల్ హాసన్, త్రిష, ప్రకాశ్ రాజ్, మధుశాలిని తదితరులు

Cheekati Rajyam Movie Review

విడుదల తేది :

2015-11-20

Cinema Story

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) ఆఫీసర్ సి.కె.దివాకర్(కమల్ హాసన్). ఒక అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా హైదరాబాద్ కు వస్తున్న 10 కిలోల కొకైన్ ను ఓ స్మగ్లింగ్ గ్యాంగ్ నుంచి దొంగిలిస్తాడు దివాకర్. అయితే హైదరాబాద్ లోని ‘ఇన్సోమియా’ అనే పబ్ ఓనర్ విట్టల్(ప్రకాష్ రాజ్) దొంగిలించబడిన తన కొకైన్ బ్యాగ్ ను తిరిగి దక్కించుకోవాలనుకుంటాడు. ఇందుకోసం దివాకర్ కొడుకు వాసు(ఆమన్ అబ్దుల్లా)ను కిడ్నాప్ చేస్తాడు.

తన కొకైన్ బ్యాగ్ తిరిగిచ్చేసి, వాసును తీసుకెళ్లమని దివాకర్ ను హెచ్చరిస్తాడు విట్టల్. ఆ తర్వాత ఏం జరిగింది? కొకైన్ బ్యాగ్ తిరిగి ఇచ్చేడా లేదా? వాసును కాపాడుకున్నాడా లేదా? దివాకర్ అండర్ కవర్ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా లేదా? అనే ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలంటే వెండితెరపై ‘చీకటి రాజ్యం’ చిత్రం చూడాల్సిందే.

cinima-reviews
చీకటి రాజ్యం

తమిళ ఉలగనయగన్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘తూంగవనం’. ఈ సినిమా ఇటీవలే తమిళంలో దీపావళి కానుకగా నవంబర్ 10న విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘చీకటి రాజ్యం’ పేరుతో అనువదించారు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రాజేష్ ఎం.సెల్వని దర్శకత్వంలో ఎన్.చంద్రహాసన్ నిర్మించారు. కమల్ సరసన త్రిష హీరోయిన్ గా నటించగా మధుశాలిని, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ‘చీకటి రాజ్యం’ చిత్రాన్ని నవంబర్ 20న గ్రాండ్ గా విడుదల చేసారు. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

Cinema Review

ప్లస్ పాయింట్స్:
‘చీకటి రాజ్యం’ సినిమాలోని నటీనటులంతా వారి వారి పాత్రలలో జీవించేసారు. కమల్ హాసన్ తన పాత్రలో అదరగొట్టేసాడు. దివాకర్ పాత్రలో కమల్ నటన అద్భుతం. తనదైన శైలిలో నటిన, డైలాగులతో ఆకట్టుకున్నాడు. తన కొడుకును కాపాడుకునే ఒక తండ్రి పడే ఆరాటంలో కమల్ యాక్టింగ్ సూపర్. ఇందులో కమల్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. ఇక త్రిష మొట్టమొదటిసారిగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో నటించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకు పరిమితమైన త్రిష.. ‘చీకటి రాజ్యం’ సినిమాలో మొట్టమొదటిసారిగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో నటించింది. మల్లికా అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో త్రిష నటించి, తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

ఇక ప్రకాష్ రాజ్ మరోసారి తన విలనిజంతో అదరగొట్టారు. తన విలనిజానికి కాస్త కామెడీని టచ్ చేసి ప్రేక్షకులను అలరించాడు. ఇక కమల్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్న మధుశాలిని.. తన పాత్రకు తగిన న్యాయం చేసింది. కమల్ హాసన్ తో ముచ్చటగా మూడు ముద్దులిచ్చేసి పిచ్చెక్కించేసింది. కరెప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా కిషోర్, మరో విలన్ గా సంపత్, కమల్ హాసన్ స్నేహితుడిగా యుగి సేతు, కమల్ భార్యగా ఆషా శరత్ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

కమల్ హాసన్ కొడుకు వాసు పాత్రలో నటించిన ఆమన్ చాలా చక్కగా నటించాడు. కమల్ తో కలిసి నటించే సన్నివేశాలు బాగున్నాయి. మొదట్లో తండ్రి పట్ల గౌరవంలేని కొడుకుగా... చివర్లో తండ్రి తనపై చూపించే ప్రేమను అర్థం చేసుకునే కొడుకుగా నటించి మెప్పించాడు.

మైనస్ పాయింట్స్:
కమర్షియల్ భారీ యాక్షన్లు, డాన్సులు, కామెడీలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కొద్దిగా నచ్చకపోవచ్చు. ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా తగినంతగా సెంటిమెంటు సన్నివేశాలు లేవు. ఇవేమి ఊహించుకోకుండా వెళ్లి సినిమా చూస్తే కాస్త పర్వాలేదనిపిస్తోంది.

సాంకేతికవర్గ పనితీరు:
‘చీకటి రాజ్యం’ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫి. సనుజాన్ వర్గసే అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ప్రతి సన్నివేశాన్ని కూడా ప్రేక్షకులను లీనం అయ్యే విధంగా చిత్రీకరించారు. ముఖ్యంగా కొన్ని కొన్ని సన్నివేశాలలో విజువల్స్ పరంగా చాలా స్టైలిష్ గా చూపించారు. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. కథకు చాలా చక్కగా సరిపోయింది. ప్రోమో సాంగ్ కూడా బాగుంది. ఇక అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. పంచ్ డైలాగ్స్, ప్రాసలు లేకుండా.. సగటు మనుషులు ఎలా మాట్లాడుకుంటారో ఆ విధంగా చాలా బాగున్నాయి.

ఇక కమల్ హాసన్ దగ్గర దర్శకత్వశాఖలో పనిచేసిన రాజేష్.. ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తన తొలి చిత్రాన్నే గురువుతో తెరకెక్కించి, సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలోని నటీనటులందరి నుంచి సరైన నటనను రాబట్టుకున్నాడు. ఇక కమల్ స్వయంగా స్ర్కీన్ ప్లే ను అందించడం ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా గ్రాండ్ గా నిర్మించారు.

చివరగా:
‘చీకటి రాజ్యం’: విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్