Akhil Movie Review | Akhil Akkineni | Sayesh Saigal | VV Vinayak | Nitin | Telugu Movie Reviews

Teluguwishesh అఖిల్ అఖిల్ Get information about Akhil Movie Review, Akhil Movie Telugu Review, VV Vinayak Akhil Movie Review, Akhil Movie Review And Rating, Akhil Movie Talk, Akhil Movie Trailer, VV Vinayak Akhil Review, Akhil Movie Gallery and more Product #: 70032 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    అఖిల్

  • బ్యానర్  :

    శ్రేష్ట్ మూవీస్

  • దర్శకుడు  :

    వి.వి.వినాయక్

  • నిర్మాత  :

    నితిన్

  • సంగీతం  :

    థమన్, అనూప్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    అమోల్ రాథోడ్

  • ఎడిటర్  :

    గౌతంరాజు

  • నటినటులు  :

    అఖిల్, సయేశా సైగల్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, సప్తగిరి తదితరులు

Akhil Movie Review Akhil Akkineni Sayesh Saigal Vv Vinayak

విడుదల తేది :

2015-11-11

Cinema Story

అఖిల్ హ్యాపీగా జీవితాన్ని గడిపే ఓ సాదాసీదాకుర్రాడు. అలా జీవితం సాగిపోతున్న సమయంలో పిజి చదువుతున్న హీరోయిన్ సయేషాతో ప్రేమలో పడతాడు. ఆమెను ఒప్పించి ప్రేమను గెలుచుకుంటాడు. ఇంతలో కొంత మంది రౌడీలు సయోషాను కిడ్నాప్ చేస్తారు. ఆమె కోసం వెతికే ప్రయత్నంలో ఆమె ఆఫ్రికాలో ఉందని తెలుసుకున్న అఖిల్ అక్కడికి వెళతాడు. తన ప్రియురాళిని కాపాడుకోవటానికి అక్కడి గిరిజనుల సాయం తీసుకుంటాడు. అసలు ఆ గిరిజనులు ఎవరు. సయేషాను విలన్లు ఎందుకు కిడ్నాప్ చేశారు. అక్కడికి వెళ్లిన అఖిల్ జీవితం ఎలా మారిపోయింది అన్నదే మిగతా కథ.

cinima-reviews
అఖిల్

అఖిల్ సినిమా మొత్తం కూడా జువా అనే ఓ బాల్ గురించి ఉంటుంది. ఈ సినిమాలో కథాంశం జువానే. సినిమా ప్రారంభం కాగానే ముందుగా జువా గురించి ఇంట్రడక్షన్ ఉంటుంది. సూర్యుడి నుంచి విడిపోయిన భూమి మళ్ళీ సూర్యునికి దగ్గరవుతూ ఉండడం వలన భవిష్యత్తులో భూమి మీద ప్రళయం వస్తుందని అప్పటి ఋషులు సూర్య కవచం ఆలియాస్ జువా అనే ఒక బాల్ ని తయారు చేసి భూమధ్య రేఖపై ఆఫ్రికాలోని ఓజా ప్రజలు నివసించే ప్రాంతంలో ప్రతిష్టిస్తారు. ప్రతి సూర్యగ్రహణం రోజు మొదటి సూర్య కిరణాలు దానిమీద పడాలి అలా పడలేదు అంటే ప్రళయం సంభవిస్తుంది

కథ: అఖిల్ హ్యాపీగా జీవితాన్ని గడిపే ఓ సాదాసీదాకుర్రాడు. అలా జీవితం సాగిపోతున్న సమయంలో పిజి చదువుతున్న హీరోయిన్ సయేషాతో ప్రేమలో పడతాడు. ఆమెను ఒప్పించి ప్రేమను గెలుచుకుంటాడు. ఇంతలో కొంత మంది రౌడీలు సయోషాను కిడ్నాప్ చేస్తారు. ఆమె కోసం వెతికే ప్రయత్నంలో ఆమె ఆఫ్రికాలో ఉందని తెలుసుకున్న అఖిల్ అక్కడికి వెళతాడు. తన ప్రియురాళిని కాపాడుకోవటానికి అక్కడి గిరిజనుల సాయం తీసుకుంటాడు. అసలు ఆ గిరిజనులు ఎవరు. సయేషాను విలన్లు ఎందుకు కిడ్నాప్ చేశారు. అక్కడికి వెళ్లిన అఖిల్ జీవితం ఎలా మారిపోయింది అన్నదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :
అక్కినేని వారసుడిగా వచ్చిన అఖిల్ సినిమా మీద ముందు నుండి అంచనాలు బారీగా ఉన్నాయి. అయితే మొదటి సినిమానే అయినా కూడా అఖిల్ చాలా బాగా చేశాడు. ఎక్కడా కూడా కొత్తగా వచ్చాడు అన్న ఫీలింగ్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మొదటి సినిమాలోనే అదిరిపోయే స్టంట్స్ మరియు డాన్సులతో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించుకున్నాడు. చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఇంట్రడక్షన్ ఫైట్ తో ఆడియన్స్ చేత విజిల్స్ వేయించిన అఖిల్ వేసిన స్టెప్స్ అందరి చేత అరుపులు పెట్టిస్తాయి. అలాగే కొన్ని పంచ్ డైలాగ్స్ లో అఖిల్ డైలాగ్ మాడ్యులేషన్ బాగుంది. ఓవరాల్ గా అఖిల్ మాత్రం పవర్ అఫ్ అఖిల్ ని చూపాడు. అఖిల్ కామెడీ సీన్లు చెయ్యడంలో కాస్త విఫలమయ్యాడని అనిపిస్తోంది. ఓవరాల్ గా అఖిల్ పర్ఫామెన్స్ కు మాత్రం ఎవరూ పేరు పెట్టలేరు. ఇక ఎవరూ ఊహించని విధంగా 'అక్కినేని' పాటలో నాగార్జున ఎంట్రీ అండ్ నాగార్జున వేసిన ఎనర్జిటిక్ స్టెప్స్ వేసి అందరికి షాక్ ఇచ్చారు.

ఇక సినిమాలోని మిగిలిన నటీనటుల విషయానికి వస్తే.. సయేషా సైగల్ కి ఇది మొదటి మూవీ అయినప్పటికీ పెర్ఫార్మన్స్ పరంగా మంచి మార్కులే కొట్టేసింది. లిప్ సింక్, సీన్ కి తగ్గా హావభావాలని ఇస్తూ మెప్పించింది. కొన్ని సాంగ్స్ లో సయేషా డాన్సుల్లో చూపించిన ఈజ్ కొన్ని చోట్ల అఖిల్ ని డామినేట్ చేస్తుంది. అఖిల్ ఫాదర్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ మంచి నటనని కనబరిచి ఆడియన్స్ కి లైట్ గా సెంటిమెంట్ టచ్ ని ఇచ్చాడు. ఇక కమెడియన్స్ గా కనిపించిన బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరిలు ఓకే ఓకే అనిపించేలా నవ్వించారు.

మైనస్ పాయింట్స్ :
పైన చెప్పినట్టు అబ్బా అదిరింది అనే రేంజ్ లో సినిమాని మొదలు పెట్టిన వినాయక్ ఆ తర్వాత సినిమా వేగాన్ని సడన్ గా తగ్గించేసి రొటీన్ కామెడీ ఫ్లేవర్ లోకి తీసుకెళ్ళిపోయాడు. అలాగే కాలేజ్ ఎపిసోడ్స్ లో వచ్చిన సీన్స్ లో అక్కడక్కడా కామెడీ బాగానే అనిపించినప్పటికీ సీన్స్ మాత్రం యాజిటీజ్ గా మనం ఇదివరకూ ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా స్టార్టింగ్ లోనే అసలు కథ ఏంటో చెప్పేసి, దేనికోసం ఇక కథ జరుగుతుంది అనే విషయాన్ని చెప్పేయడం వలన మొదటి నుంచి చివరి దాకా అంతా ఊహాజనితంగా మారిపోతుంది. ఇక ఇంటర్వల్ బ్లాక్ లో వచ్చే ట్విస్ట్ ని కూడా ముందే మనం ఊహించేయవచ్చు. కథా పరంగా జువా అనే కాన్సెప్ట్ తప్ప మిగతా అంతా మన రొటీన్ గా రాసుకోవడం ఈ సినిమాకి మరో మైనస్ పాయింట్.

అఖిల్ సినిమాకి మరో మేజర్ మైనస్.. సెకండాఫ్.. కథనంలో అస్సలు కిక్ లేకపోవడం వలన ఊహించిందే జరుగుతోంది అని ఆడియన్స్ ఫీలవుతున్న టైంలో నవ్వించాలనే తాపత్రయంతో కామెడీని ఇరికించాలని ట్రై చేసారు. ఆ కామెడీ పెద్దగా నవ్వించలేకపోవడం సినిమాకి మైనస్. సెకండాఫ్ లో హీరోయిన్ రోల్ తక్కువ అలాగే, సెకండాఫ్ లో వచ్చే పాటలు చూడటానికి బాగున్నా అసందర్భంగా వచ్చి సినిమా వేగాన్ని దెబ్బ తీస్తాయి. సినిమా ఆలస్యానికి కారణమైన గ్రాఫిక్స్ కూడా చెప్పుకునే స్థాయిలో లేకపోవడం మరో మైనస్. సినిమాకి కీలకం అయిన మెయిన్ పాయింట్ ని క్లైమాక్స్ లో చాలా ఫాస్ట్ గా హడావిడిగా ముగించడం అంతగా ఆకట్టుకోలేదు. వినాయక్ సినిమాల్లో నెగటివ్ రోల్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది కానీ ఇందులో మాత్రం విలన్ రోల్ అనేదాన్ని పవర్ఫుల్ గా చూపే ప్రయత్నమే చేయలేదు.

సాంకేతిక విభాగం :
తెర మీద అఖిల్ వన్ మేన్ షోలా సాగిన అఖిల్ సినిమా. తెర వెనుక వినాయక్ వన్ మేన్ షోలా సాగింది. ఎన్నో అంచనాలు ఉన్న అక్కినేని వారసున్ని వెండితెరకు పరిచయం చేసే భారీ బాధ్యతను తలకెత్తుకున్న వినాయక్ అందుకు తగ్గ స్ధాయిలో కష్టపడ్డాడు. ముఖ్యంగా తనకు బాగా పట్టున్న మాస్ యాక్షన్ను క్లాస్గా ప్రజెంట్ చేసి, స్టార్ వారసులకు గ్రాండ్ లాంచింగ్ ఇవ్వటంలో తాను స్పెషలిస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. కథా కథనాల్లో ఎక్కడా పట్టు కోల్పోకుండా సినిమా అంతా చాలా ఇంట్రస్టింగ్గా తెరకెక్కించాడు. అనూప్, థమన్లు కమర్షియల్ నెంబర్స్తో అలరించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కెమెరా వర్క్ సూపర్ అనిపించింది. గతంలో ఎన్నడూ చూడని లొకేషన్స్లో షూట్ చేసిన చిత్రయూనిట్, ఆ ప్రాంతాలను గ్రాండ్గా ప్రజెంట్ చేశారు. అఖిల్, సయేషాలు తెర మీద చాలా అందంగా కనిపించారు. ఎడిటింగ్, కొరియోగ్రఫీ, యాక్షన్స్ సీన్స్ ఇలా అన్నీ అప్ టు ద మార్క్ గా ఉన్నాయి.

చివరగా: అఖిల్ సూపర్.. సినిమా మాత్రం ఓకే