The full telugu review of Basthi movie | telugu movie reviews | shreyan | pragathi | jayasudha

Teluguwishesh బస్తీ బస్తీ Basthi movie telugu review shreyan pragathi jayasudha : The full telugu review of actress jayasudha son's shreyan debut film basthi. In this movie pragathi acted as heroine. This movie directed and produced by vasu vanthena. Product #: 65844 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    బస్తీ

  • బ్యానర్  :

    వజ్మన్ ప్రొడక్షన్స్

  • దర్శకుడు  :

    వాసు మంతెన

  • నిర్మాత  :

    వాసు మంతెన

  • సంగీతం  :

    ప్రవీణ్ ఇమ్మడి

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఛాయాగ్రహణం  :

    గుణశేఖర్

  • ఎడిటర్  :

    గౌతంరాజు

  • నటినటులు  :

    శ్రేయన్, ప్రగతి తదితరులు

Basthi Movie Telugu Review Shreyan Pragathi Jayasudha

విడుదల తేది :

2015-07-03

Cinema Story

కొన్నేళ్ళుగా భిక్షపతి (కోట శ్రీనివాసరావు) వర్గం, అమ్మిరాజు (ముఖేష్ రుషి) వర్గం అనే రెండు వైరివర్గాల మధ్యం నిత్యం తగాదాలు చోటు చేసుకునేవి. అయితే.. ఇరు వర్గాల పెద్దలూ ఈ గొడవలన్నింటికీ స్వస్తి పలికి ఎవరికి వారుగా జీవిస్తుంటారు. కానీ.. భిక్షపతి కొడుకు భవాని (అభిమన్యు సింగ్) మాత్రం ఆ రెండు వర్గాల మధ్య గొడవలు అయ్యేందుకు రెచ్చగొట్టే పనులు చేస్తూనే ఉంటాడు. భవానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అమ్మిరాజు, అతని చెల్లైన స్రవంతి (ప్రగతి చౌరస్య)ని కిడ్నాప్ చేస్తాడు. ఆ సమయంలోనే అమెరికా నుండి విజయ్ (శ్రేయాన్) తన ఇంటికి వస్తాడు.

విజయ్ తండ్రి వెంకటపతి నాయుడు చనిపోయిన తర్వాత ఆయన సామ్రాజ్యాన్ని, విజయ్ బాధ్యతలనూ అమ్మిరాజు చూసుకుంటుంటాడు. ఒకనాడు అనుకోకుండా తమ ఇంట్లో కిడ్నాప్‌కు గురైన స్రవంతిని విజయ్ చూస్తాడు. స్రవంతి ఆ ఇంట్లో ఉండే కొద్ది రోజులకే ఆమెతో పరిచయం కలగడం, అది ప్రేమగా మారడం జరిగిపోతాయి. వెంకటిపతి నాయుడు తనకు తండ్రిలాంటి వారని, ఆయన కొడుకు విజయ్ సంతోషమే తనకు ముఖ్యమని చెప్పే అమ్మిరాజు, విజయ్-స్రవంతిల ప్రేమ కోసం భిక్షపతిని కలుస్తాడు. అయితే విజయ్-స్రవంతిల పెళ్ళి ప్రపోజల్ ఏ మాత్రం ఇష్టం లేని భవాని.. అమ్మిరాజు, భిక్షపతిలను చంపేస్తాడు.

ఇక ఆ తర్వాత విజయ్-స్రవంతి జంటకు కష్టాలు మొదలువుతాయి. వారిద్దరిని చంపేయాలన్న కసితో భవానీ వెదుకులాట మొదలుపెడతాడు. ఓ సందర్భంలో ఎలాగోలా భవానీ నుంచి తప్పించుకున్న ఆ ప్రేమజంట.. తమను తాము ఎలా కాపాడుకుంది? భవాని ఏమయ్యాడు? అన్నది తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.

cinima-reviews
బస్తీ

సహజనటి జయసుధ తనయుడు శ్రేయన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘బస్తీ’. శ్రేయన్, ప్రగతి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి వాసు మంతెన దర్శక, నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవలే కేసీఆర్ చేతులమీదుగా విడుదలైన ఈ సినిమా పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతమేర మెప్పించిందో తెలుసుకుందామా..

Cinema Review

ప్లస్‍పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్‌పాయింట్ ఏమిటంటే.. గొడవలు, కక్షసాధింపులతో సంబంధం లేకుండా ప్రేమకథను చెప్పే ప్రయత్నం చేయడం! ఈ సినిమాలో ఈ రెండు వర్గాల ఆలోచనా విధానాన్ని చెప్పి.. అనవసరమైన యాక్షన్ అంశాలను జోడించలేదు. రన్‌టైమ్ కూడా చాలా తక్కువ ఉండడం ఈ సినిమాకు మరో ప్లస్‌పాయింట్.

ఇక నటీనటుల విషయానికొస్తే.. శ్రేయాన్‌కిది మొదటి సినిమా అయినా ఫర్వాలేదనిపించాడు. లుక్స్, యాక్టింగ్ పరంగా బాగానే ఆకట్టుకుంటాడు. అయితే.. నటనలో ఇంకా నేర్చుకోవాల్సింది వుంది. హీరోయిన్ ప్రగతి తన క్యూట్ లుక్స్ తోనే కాకుండా నటనతో కూడా ఆకట్టుకుంది. ఇక హీరో ఫ్రెండ్‌గా నటించిన ‘అలా మొదలైంది’ ఫేం స్నిగ్ధ తన స్టైల్ యాక్టింగ్‌తో నవ్వించే ప్రయత్నం చేసింది.

ఓవరాల్ గా చూసుకుంటే.. ఈ సినిమాకు ఫస్టాఫ్ ప్లస్ పాయింట్. పాత్రల పరిచయం, ఒక్కో పాత్ర ఆలోచనా విధానాన్ని ఒక్కో రకమైన సన్నివేశంతో చెప్పడం ఇలా ఫస్టాఫ్ అంతా అసలైన కథను చెప్తూ బాగానే ఉందనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మైనస్ పాయింట్లు చాలానే వున్నాయి. ఇప్పటివరకూ వచ్చిన రొటీన్ ప్రేమకథను అంతే రొటీన్ స్క్రీన్‌ప్లేతో నడిపించడంతో చప్పగా సాగిపోతుంది. ప్రేమకథలోని ఇన్నోసెన్స్, రొమాన్స్ ఈ సినిమాలో ఏమీలేవు. ఇటు యాక్షన్ లేక, అటు ప్రేమకథ అంతగా లేక ఈ సినిమా మధ్యలో ఆగిపోతుంది. ఫస్టాఫ్ కొంతమేర బాగానే అనిపించినా.. సెకండాఫ్ మొదలైన కొద్ది సేపటికే సినిమా దారి తప్పిపోయింది.

అసలైన విషయాన్ని పక్కనపెట్టి ఏమేం చేయాలో అర్థం కాక.. సెకండాఫ్‌లో ఆలీ, సప్తగిరి ట్రాకులను జోడించేశారు. అవి సినిమాతో సంబంధం లేనివే కాక బోరీంగ్‌గానూ అనిపిస్తాయి. పాటలు వినడానికి బాగున్నా సినిమాలో అసందర్భంగా వచ్చి వృథాగా మిగిలిపోయాయ్! ఇక హీరోయిన్ అందం, అభినయం పరంగా ఫర్వాలేదనిపించేలా ఉన్నా, ఈ సినిమాకు ఆమె అస్సలు సెట్ అవ్వలేదు. శ్రేయాన్-ప్రగతిల జంట చూడడానికి బాలేదు.

సాంకేతిక విభాగం :

ముందుగా ఈ సినిమా రచయిత-దర్శకుడు అయిన వాసు మంతెన గురించి మాట్లాడుకుంటే.. పాత కథను, అందరికీ తెలిసిన ఫార్మాట్‌లోనే తీయడంతో రచయితగా చేసిందేమీ లేదు. దర్శకుడిగా మాత్రం ఫస్టాఫ్‌లో కొన్ని చోట్ల అతడి ప్రతిభను చూడొచ్చు. కానీ బలమైన కథను, ఇంటరెస్టింగ్ స్క్రీన్‌ప్లే ద్వారా చెప్పే ప్రయత్నం లాంటిదేదైనా చేసివుంటే బాగుండేది. ఇక ఈ సినిమాకి గుణ శేఖరే అందించిన సినిమాటోగ్రాఫీ అద్భుతం. ముఖ్యంగా రాత్రి పూట వచ్చే సన్నివేశాల్లో తన పనితనాన్ని చూపించాడు.సంగీత దర్శకుడు ప్రవీణ్ అందించిన పాటలు బాగానే ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరీ రొటీన్‌గా ఉంది. ఎడిటింగ్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. నిర్మాణ విలువలు బాగానే వున్నాయి.

తీర్పు :

బస్తీ : ఈ ‘బస్తీ’లో చెప్పుకోదగిన అంశం ఏమీ లేదు.