Teluguwishesh సత్య-2 సత్య-2 Satya 2 Telugu Movie Review and Rating, Satya 2 Telugu Movie Review, Satya 2 Telugu Movie Rating, Satya 2 Telugu Review, Satya 2 Telugu Rating, Ram Gopal Varma Satya 2 Telugu Movie, Satya 2 in Telugu, Sharwanand Satya 2 Movie Review, Satya 2 Telugu Movie Wallpapers, Satya 2 Audio Launch, Satya 2 Telugu Movie Stills and more on teluguwishesh.com Product #: 48403 1.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సత్య-2

  • బ్యానర్  :

    మమ్మోద్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్

  • దర్శకుడు  :

    రామ్ గోపాల్ వర్మ

  • నిర్మాత  :

    సుమంత్ కుమార్ రెడ్డి

  • సంగీతం  :

    అమర్ మోహిల్

  • సినిమా రేటింగ్  :

    1.5  1.5

  • ఛాయాగ్రహణం  :

    వికాస్

  • ఎడిటర్  :

    జెరిన్ జోసి

  • నటినటులు  :

    శర్వానంద్, అనైక సోతి, అరాధన గుప్తా

Satya 2 Telugu Movie Review

విడుదల తేది :

నవంబర్ 8 2013

Cinema Story

సత్య (శర్వానంద్) ఓ సామాన్య కుటుంబంలో జన్మిస్తాడు. బతుకుదెరువు కోసం నగరానికి చేరుకొని మాఫియా ముఠాలో పనిచేస్తుంటాడు. తన ఆలోచనతో క్రిమినల్స్ కి సహకరిస్తూ ఉంటాడు. కొంత కాలానికి ఈ మాఫియా దందా అంతా రొటీన్ అనిపించడంతో కొత్త పంథాను ఎందుకొని ‘కంపెనీ’ ప్రారంభిస్తాడు. ఇన్నాళ్ళు మాఫియా సామ్రాజ్యాన్ని ఏలిన డాన్ లకే దడ పుట్టించేలా చేస్తాడు ఆ కంపెనీ ద్వారా. అనతి కాలంలోనే కోట్లు గడించి తాను అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయ్యే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్ళు, పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో సత్య క్రైమ్ నే ఎందుకు బిజినెస్ గా మార్చుకున్నాడు ? చివరికి ఏం సాధించాడన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

cinima-reviews
సత్య-2

రామ్ గోపాల్ వర్మ.... ఈ పేరు వినగానే మనకు హర్రర్ సినిమాలు, మాఫియా చిత్రాలు గుర్తుకు వస్తాయి. గత కొంత కాలం క్రితం మాఫియా, హర్రర్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ కూడా.  గత వైభవం ఎంతో ఘనం అన్నట్లు... ఆ పేరు చెప్పుకొని ఇప్పటికీ సినిమాలు తీస్తున్న రామ్ గోపాల్ వర్మ చిత్రాలు గత కొంత కాలంగా ఆకట్టుకోక పోగా, సహనానికి పరీక్ష పెడుతున్నాయి. అయినా మెగాఫోన్ పై మమకారం పోని వర్మ తనకు ఏది నచ్చితే అలా సినిమా తీసుకుంటూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో మాఫియా చిత్రాలను తీయడంలో తానే డాన్ అని చెప్పుకోవాల్సిన నేపథ్యంలో 'సత్య2' విడుదలైంది. సత్య2 ద్వారా వర్మ మళ్లీ పూర్వ వైభవం అందుకున్నారా ? లేక ఏదో దొరికన కథతో తనకు తొచినట్లు తీసి అదే ప్రేక్షకుల చేత చివాట్లు పెట్టించుకున్నాడా? ఈ సినిమా రివ్యూ ద్వారా చూద్దాం.

Cinema Review

తెలుగు వెర్షన్లో సత్య పాత్రలో నటించిన శర్వానంద్ సినిమా మొత్తం సీరియస్ నెస్ తో కనిపించాడు. ఏవో రెండు మూడు సీన్లలో కాస్త నవ్వు మొహంతో కనిపించాడు. మాఫియా డాన్ పాత్ర కాబట్టి దాదాపు ఎప్పుడూ ఒకే ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకుల్ని విసిగించాడు. కీలక సీన్లలో ఓ మాఫియా డాన్ ప్రదర్శించాల్సిన ఎమోషన్స్ ను పలికించడంలో విఫలమయ్యాడు.

సత్య పాత్ర తర్వాత చెప్పుకోవాల్సినంతగా ఏ పాత్ర కూడా లేకపోయింది. సినిమా మొత్తం ఈ పాత్రే డామినేష్ చేసింది. ఇక ఇందులో నటించిన అనైక కేవవలం అందాల ఆరబోతకే పనిచేసింది. ఈమెకు చెప్పేకోదగ్గ పాత్ర దక్కలేదు. దక్కిన సీన్లలో చెండాలంగా చేసి ప్రేక్సకుల్ని గందరగోలానికి గురిచేసింది. హీరో స్నేహితుడి గాళ్‌ఫ్రెండ్‌గా నటించిన ఆరాధన కాస్త బెటర్‌ అనిపిస్తుంది. మిగతా వారంతా తమ పరిధుల్లో తాము చేయగలిగింది చేశారు.

సాంకేతిక వర్గం

ఈ సినిమాలో టెక్నీషియన్స్ గురించి చెప్పుకోవాల్సింది కాసింతే అయినా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించే చాలా చెప్పుకోవాలి. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఉన్న ముఖ దర్శకుల జాబితాలో రామ్ గోపాల్ వర్మ ఖచ్చింతంగా ఉంటాడు. ఆయన కెమెరాతో చేయాల్సిన అద్బుతాలు ఎప్పుడో చేసేశాడు. ఈ సినిమాలో చేయాల్సినవి కొత్తగా ఏమీ లేవు. అన్నీతానై వ్యవహరించిన వర్మ కథ దగ్గరి నుండి స్క్రీన్ ప్లే వరకు అన్నింట్లో విఫలం అయ్యాడు. ఫస్టాఫ్ లో ప్రేక్షకుడ్ని ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే సెకండాఫ్ లో పస లేకపోవడం ప్రేక్షకుడిని అసహనానికి గురి చేసింది.

ఓ దశలో వర్మ ఏం చెప్పాలనుకుంటున్నాడో కూడా అర్ధం కాని పరిస్థితి. సత్య2 చిత్రం తెలుగులో పూరి జగన్నాథ్ నిర్మించిన 'బిజినెస్ మెన్' చిత్రం దగ్గరగా అనిపించింది. అయితే బిజినెస్ మెన్ కథను వర్మ తనదైన శైలిలో ఖూనీ చేశాడనే చెప్పవచ్చు. సినిమాటో గ్రఫ్రీ ఫర్వాలేదనిపిస్తుంది. ఇక పూర్తిగా మాఫియా నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో పాటలు గ్లామర్ కోసం ఇరికించారు. ఎడిటింగ్ విభాగం వారు ఆ సమయంలో నిద్రపోయారో ఏమో అనిపిస్తుంది. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి. ఈ సినిమా వర్మ దర్శకత్వ ప్రతిభకు పరాకాష్టగా నిలిచింది.

 

more