సత్తిబాబు పోటీ స్థానం మారుతుందా అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు . 2014 ఎన్నికల్లో సత్తిబాబు విజయనగరం నుండి కాదు అనే వార్తలు గాంధీ భవన్ లో గుప్పుమంటున్నాయి. సీమాంధ్రలో సత్తిబాబు గెలుపుపై అనుమానాలుండగా తెలంగాణా నుండి కెసిఆర్ అండతో రంగం దిగాలని బొత్స భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ గేమ్ ప్లాన్ లో భాగంగానే కెసిఆర్ సీమాంధ్ర నేతలని రాచి రంపాన పెడుతున్న బొత్స పల్లెత్తిమాట కూడా అనడం లేదని విర్శమలు పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి.
గతంలో కూడా తెలంగాణా ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడిన బొత్స తెలంగాణాకు అనుకూలంగా నివేదిక కూడా ఇచ్చారని బయటకురాగా గతంలో సీమాంధ్ర ఉద్యమం భాగంగా విజయనగరంలో బొత్స ఆస్తులపై సీమాంధ్ర సమైక్య ఉద్యమకారులు దాడులు చేసిన విషయం తెలిసిందే . అయితే ఈ సందర్భంలో బొత్సాకు అండగా కెసిఆర్ అండ్ కో అండగా నిలిచినట్లు గాంధీ భవన్ లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుసగులాడుకుంటున్నారు..
ఇదే ఇప్పుడు బొత్స రాజకీయాలపై కొత్త కొత్త ఊహాగానాలకు దారి తీస్తున్నాయి. పైకి మైకు ముందుకు వచ్చిన ప్రతిసారీ బొత్స సమైక్య వాదిగా కనిపిస్తున్నారు కానీ నిజానికి బొత్స తెలంగాణాకు అనుకూలం ఉంటున్నాడని.. ఎలాగూ కాంగ్రెస్ లో తెరాస విలీనం అవుతుందని ప్రచారం జరుగుతుండగా తెలంగాణాలో కాంగ్రెస్ కు మంచి మైలేజీ ఉంటుంది కనుక గ్యారంటీలేని సీమాంధ్ర మీద తెలంగాణా బెటర్ అని.. దీనికి కెసిఆర్ అండదండలు కూడా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ అంటున్నారు.
అంతేకాకుండా ఇప్పటి వరకు తెలంగాణ నాయకులు ఎవరు సత్తిబాబు మీద ఒక్క రాజకీయ కామెంట్ చేయకపోవటంతో పార్టీలోని సీనియర్ నాయకులు విపరీతంగా చెవులుకొరికేసుకుంటున్నారు. ఎక్కువుగా సీమాంద్ర కాంగ్రెస్ నాయకులే.. సత్తిబాబు మీద గుసగుసలాడుకుంటున్నారు. ఇలాంటి పుకార్లకు లాక్ పడలంటే.. 2014 ఎన్నికల వరకు ఆగాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more