Telugu people questioned by balakrishna

telugu people questioned by balakrishna, tdp, actor balakrishna, balayya, flood, flood in andhra pradesh, Flood Ravage Andhra Pradesh, 2014 election,

telugu people questioned by balakrishna

బాబు గారు.. బాలయ్య స్థితి ఇక అంతేనా?

Posted: 11/01/2013 01:37 PM IST
Telugu people questioned by balakrishna

చంద్రబాబు గారు.. మీ బావ మరిది ఎక్కడ అంటే.. ఆయన సినిమా షూటింగుల్లో చాలా బిజీగా ఉన్నారని సమాధానం చెబుతున్నారు. ఈ సమాదానం పై తెలుగు ప్రజలు మండిపడుతున్నారు. తెలుగు దేశం పార్టీ కోసం, తెలుగు ప్రజలు కోసం ఏమైన చెయ్యటానికి నందమూరి కుటుంబం సిద్దంగా ఉంటుందని మీడియా సాక్షిగా ..మీసం మెలేసి, తొడకొట్టిన సందర్బాలు చాలా ఉన్నయాని తెలుగు ప్రజలు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు దేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మద్దతు ఇవ్వకూడదని చాటు మాటుగా ఎస్ఎంఎస్ లు పంపి, ఎన్టీఆర్ ను తెలుగు దేశం పార్టీకి దూరం చేయటం జరిగిందనే విమర్శలు ఇప్పటికి ఎన్టీఆర్ భవన్ లో టిడిపి కార్యకర్తల మద్య వినిపిస్తున్నాయి.

 

అయిన తెలుగు ప్రజల కోసమే స్థాపించపడిన పార్టీ అని చెప్పుకున్న బాలయ్య.. తెలుగు ప్రజలు ఎలా మరిచిపోయారో అర్థం కావటం లేదు. సమైక్యాంద్ర కోసం హరిక్రిష్ణ తన పదవిని సైతం లెక్కచెయ్యకుండా వదిలిసేని విషయం తెలిసిందే. తెలుగు ప్రజల ఆర్తనాధాలను .. హరిక్రిష్ణ పార్లమెంట్ల్ వినిపించి, సమైక్యాంద్ర సింహంగా తెలుగు ప్రజలు గుండెల్లో నిలిచిపోయారు. కానీ బాలయ్య మాత్రం తన వ్యక్తి సినిమా వ్యాపారం చేసుకుంటూ.. తెలుగు ప్రజలు మరిచిపోయారని తెలుగు ప్రజలు మండిపడుతున్నారు. రెండు నెలల నుంచి సమైక్యాంద్ర ఉద్యమం జరుగుతుంటే ఏ రోజైన సమైక్యాంద్ర మద్దతు తెలపటానికి బాలయ్యకు సమయమే లేదు. పార్టీకి ఫండ్ కావాల్సి వచ్చినప్పుడు అమెరిక వెళ్లి అక్కడ తెలుగు వారితో సభలు పెట్టి, సంప్రదాయంగా.. పార్టీ ఫండ్ తెచ్చుకుంటావు. కానీ తెలుగు ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు, తెలుగు జాతి విడిపోకుండా ఉద్యమం చేస్తున్నాప్పుడు మాత్రం కనిపించావు. దీనిని బట్టి చూస్తే తెలుగు ప్రజలపై ఎంత అభిమానం ఉందో ఇట్టే అర్థమవుతుందని తెలుగు ప్రజలు అంటున్నారు.

 

ప్రక్రుతి విపత్తుతో రాష్ట్రంలో కురిచిన భారీ వర్షాల కారణంగా .. రైతులకు భారీ నష్టం జరిగింది. రైతుల కోసమే తెలుగు దేశం పార్టీ ఉందని చెప్పే మీరు.. వరదల కారణంగా రైతులు అల్లాడిపోతుంటే.. వారిని పరామర్శించటానికి మీకు సమాయం లేదా? మీరు రామోజీ ఫిలింసీటిలో బిజీగా ఉండటం మీకు సహాజమే. సినిమా అనేది ఈరోజు కాకపోతే, రేపు తీసుకోవచ్చు. మీ షూటింగ్ ఆగిపోతే జరిగే నష్టం ఒక నిర్మతకే ఉంటుంది. కానీ వరదలతో రాష్ట్రంలోని రైతులు పూర్తిగా నష్టపోయిన విషయం మీకు తెలుసు. అయిన మీకు మీ సినిమా షూటింగే ముఖ్యమా, తెలుగు ప్రజలు ముఖ్మమా అని తెలుగు ప్రజలు అడుగుతున్నారు. 64 ఏళ్ల చంద్రబాబు వరదలో నష్టపోయిన రైతులను అక్కున చేర్చుకుంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవి కోసమే అలా చేస్తున్నారని అందరికి తెలుసు. కానీ మీరు భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాల్సిన వారు. 2014 ఎన్నికల్లో పోటీ గెలవటానికి ఈ తెలుగు ప్రజల ఓట కావాలనే విషయం మీరు ఎలా మరిచిపోయారో అర్థం కావటంలేదని తెలుగు ప్రజలు అడుగుతున్నారు. ఈ రోజు కేంద్ర మంత్రి చిరంజీవి రాళ్లు విసిరిన చేతులే.. రేపు మీపై చెప్పులు విసిరిన ఆశ్చర్యంలేదని తెలుగు ప్రజలు అంటున్నారు. ఎందుకంటే.. ప్రజలు తెలివిమీరిపోయారు.

 

ప్రజలకు ఉపయోగపడే నాయకుడినే ఎన్నుకోవటానికి రేఢీ అవుతున్నారు. మీకు సినిమా అభిమానులు ఉన్నారని అనుకుంటున్నారు. రాజకీయానికి సినిమా అభిమానులు పనికి రారానే విషయాన్ని.. చాలా మంది సినిమా రాజకీయ నటులు చూపించారనే విషయం తెలుసుకోవాలి. ఇంకెంత కాలం చంద్రబాబు ఆత్మగౌరవంతో.. తెలుగు ప్రజలు ముందుకు వస్తారు బాలయ్య? రీసెంట్ గా జరిగిన వోల్వో బస్సు ప్రమాదం లో గాయపడిన బాధితుల వద్ద కనిపించి కొంచెం హడావుడి చేయటం జరిగింది. రాష్ట్రంలో మళ్లీ తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాలంటే.. సినిమా షూటింగులు చేస్తే రాదు.. కష్టాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఆదుకుంటే ఫలితం ఉంటుందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తెలుగు ప్రజలు అంటున్నారు. మీ రాజకీయ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందనే విషయం తెలుసుకోవాలని తెలుగు ప్రజలు కోరుతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more