వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి. ఇటీవల కాలంలో మీడియా ముందు కనిపిస్తుంది. పార్టీ పరంగా ఎప్పుడు వైఎస్ విజయమ్మ, షర్మిల మాత్రమే మీడియాలో కనిపించే వారు.కానీ ఈ సారీ మాత్రం భారతి మాట తప్పి, మడమ తిప్పిందని కడప ప్రజలు అంటున్నారు. భారతి నడిపిస్తున్న ఓ కంపెనీ మాత్రం మాట తప్పింది..మడమ తిప్పింది.. రాష్ట్రమంతటా ఓదార్చిన నేతలు తమనెందుకు ఓదార్చడం లేదని వారు వాపోతున్నారు. కడప జిల్లాలో 1200 ఎకరాల్లో 'భారతి' పేరిట సిమెంట్ కంపెనీ ఉంది..దీనికి అధిపతులు వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి. జిల్లాను అభివృద్ధిపథంలోకి తెచ్చే ఫ్యాక్టరీ..ముఖచిత్రాన్ని మార్చివేసే కంపెనీ..భూములిచ్చిన వారికి ఉద్యోగాలిస్తాం..అని హామీల వర్షం కురిపించారు. ఇది నమ్మిన ప్రజలు తమ భూములను అప్పగించారు. పది గ్రామాలకు చెందిన 12 వందల ఎకరాలు భారతి సిమెంట్స్ చేతికిచ్చారు. కొద్ది కాలంలోనే వీరి చెప్పిన హామీలు నీటమూటలే అని అక్కడి ప్రజలకు అర్థమై పోయాయి. అందరికీ ఉద్యోగాలివ్వలేదు. కొందరికి మాత్రమే ఉద్యోగాలిచ్చారు. కంపెనీలో పనితో పాటు బయట పనులు కూడా అప్పగించారు. అవే పార్టీ పనులు. పార్టీ ఏ కార్యక్రమం చేయాలన్నా, గ్రామాల్లో వీరు ముందుండి చేయించాలి. లక్షా యాభై వేలతో ఎకరాన్ని కొన్న కంపెనీ ఆ రోజుల్లో అదే పెద్ద రేటు అంటూ ఊదరగొట్టింది. జిల్లాల్లో వేరే కంపెనీలు రెండు లక్షలు ఇవ్వడంతో భారతి సిమెంట్ ను నిలదీశారు. 50వేలు అదనంగా ఇస్తాం..ఉద్యోగం ఇవ్వం అంటూ కంపెనీ షరతు విధించింది. దీనితో భూములిచ్చిన వారు ఎటూ తేల్చులేకపోయారు. ఉద్యోగమే బెటర్ అనుకుని అక్కడనే ఉండిపోయారు. కాని మేనేజ్ మెంట్ కనీస వేతనాలివ్వకుండా పని విషయంలో వేధిస్తూ నానా ఇబ్బందులు పెడుతున్నారని కొందరు పేర్కొంటున్నారు. తమకు వెంటనే న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఈ విషయం భారతికి కొత్త తలనొప్పులు వచ్చాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more