Bachelors can do more in politics rahul opines

rahul gandhi, sonia gandhi, congress party of india, indian politicians

bachelors can do more in politics rahul opines

rahul-gandhi.png

Posted: 03/09/2013 09:33 AM IST
Bachelors can do more in politics rahul opines

rahul-opinionపెళ్ళయినవారికి రాజకీయాల్లో శ్రద్ధ తగ్గుతుందా?

రాహల్ గాంధీ అలాగే భావిస్తున్నారట.  పెళ్ళై పిల్లలు కలిగితే వారిని అభివృద్ధి చేసే పనిలో పడి దేశ సేవ కుంటుపడుతుందని భావిస్తున్నట్టుగా రాహుల్ గాంధీ పార్టీ సభ్యులతో అన్నారు.  ఈ మధ్య చురుగ్గా పార్టీ పగ్గాలు పట్టుకుని నడిపిస్తూ నిర్విరామంగా పార్లమెంటు సభ్యులూ, ఇతర  పార్టీ సభ్యులతో సమావేశాలు, చర్చల్లో పాల్గొంటున్న రాహుల్ తన మనసులోని మాటను అలా వెల్లడి చేసారు.  

అంటే తను బ్రహ్మచారి కాబట్టి ఫుల్ టైం దేశ సేవలోనే వినియోగించగలుగుతానని, అందులో తనకి పోటీ ఎవరూ రాలేరని రాహుల్ చెప్పకనే చెప్తున్నారు.  ఎవరి అభిప్రాయాలు వారివి అందులో తప్పు పట్టటానికేముంది.  అయితే దాన్ని మరో విధంగా అర్థం చేసుకోకూడదనే ఉద్దేశ్యంతో ఆయన దానికి వివరణ కూడా ఇచ్చారట.  అలాగని పార్టీలో అందరూ పెళ్ళిచేసుకోకుండా ఉండాలని కాదు అని చెప్పారు.  ఈ అబ్బాయికి వేరే ఏ ఆలోచనలూ అంటూ ఏమీ ఉండవు కాబట్టి సంపూర్ణంగా రాజకీయాల్లో గడపటానికి అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయమట.  

అదే సందర్భంలో తనను తాను పారాచ్యూట్ గా పోల్చుకుంటూ తనంతట తానుగా రాజకీయాల్లోకి ఎదగాలనే తన లక్ష్యాన్ని కూడా రాహుల్ గాంధీ బయటపెట్టారు.  అంటే కుటుంబం వలన సంక్రమించే రాజకీయ పదవి కోసం కాకుండా తాను ఒక వ్యక్తిగా పాటుపడి సంపాదించుకుంటానంటున్నారాయన.

 వివాహ బంధం, సంతాన బంధాలు లేకుండా రాజకీయాల్లో రాహుల్ చెప్పినట్టుగా పనిచేస్తున్నవారిలో, జయలలిత, మాయావతి, మమతా బెనర్జీ, నవీన్ పట్లాయక్, ఉమా భారతి, ఎపిజె అబ్దుల్ కలామ్ లాంటి కొందరున్నారు.  నరేంద్రమోదీ కుటుంబం నుంచి విడిపోయి జీవిస్తుండటం వలన బ్రహ్మచారి కూటమిలోకి వస్తారనే అనుకుందాం.  వరసగా రెండు సార్లు ప్రధాని గా బాధ్యతలు చేపట్టిన అటల్ బిహారీ వాజ్ పేయ్ కూడా బ్రహ్మచారే.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress leaders banda karthika reddy vs mla jayasudha
Nagarjuna angry with naga chaitanya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more