అనంతపురంలో ఫ్యాక్షన్ పడగవిప్పనుందా? మూడో తరంలో రగులుతున్న పాత పగలు? కీలక వ్యక్తులే టార్గెట్? భయంతో వణికిపోతున్న అనంతపురం ప్రజలు? ప్రయాణాలంటనే భీతిల్లుతున్న రాజకీయ నాయకులు? అసలు అనంతపురం కరవు రక్కసి కోరల్లో చిక్కి కకావికలమైన విషయం తెలిసిందే. గతంలో ఫ్యాక్షన్ పులిపై స్వారీ చేసిన వారందరు కాలగర్భంలో కలిసిపోయారు. అప్పటి నుండి అనంతపురం ప్రజలు , ప్రక రాష్ట్రాలకు వెళ్లి కష్టపడిజీవిస్తున్నారు. కొంత మంది అనంతపురంలోనే ఉండి, వ్యాపారలు, ఆటోలు నడుపుకుంటు వారి జీవితాన్ని హాయిగా సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే పాత ఫ్యాక్షన్ గొడవలు మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. ఫ్యాక్షన్ మళ్లీ పొయిమీద కుంపటి మాదిరి ఉడుకుతుంది. ఫ్యాక్షన్ పులి పై స్వారీ చేయటానికి మూడోతరం యువత సిద్దమవుతున్నారు. ఒక్కసారి ఫ్యాక్షన్ పులి పై స్వారీ చేస్తే, వారు దిగుతానన్న ఫ్యాక్షన్ దిగనివ్వదు. ఆ పులి పై స్వారీ చేసి ఎంతో మంది నేల కొరిగారు. ఇప్పుడు అనంతపురం జిల్లాన్ని మళ్లీ రావణకాష్టం లా మార్చాటానికి యువత సిద్దమైనట్లు తెలుస్తోంది. గతంలో చేసిన గాయాలు అనంతపురంలో మహిళలు భర్తలను కోల్పోయి, విగతజీవులుగా మిగిలిన వారు ఎందరో ఉన్నారు. జిల్లాలో ధర్మవరం, పెనుకొండ, ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని నరమేథం తిరిగి పురుడు పోసుకుంటోందని రాజకీయ మేథావులు అంటున్నారు. గతంలో జరిగిన హత్యల పరంపర ఇద్దరి మరణంతో సమిసి పోయిందని భావించిన అనంతపురం జిల్లా ప్రజలకు ఇటీవల జరుగుతున్న పరిణామాలతో భీతిల్లుతున్నారు. ఇప్పటికే అనంతపురంలో రక్తచరిత్ర-2 జరిగినట్లు అందరికి తెలుసు. మళ్లీ రక్తచర్రిత-3 వద్దని అనంత ప్రజలు కోరుకుంటున్నారు. ఎస్ఎస్ గేట్ వద్ద ఆయుధాలతో పట్టుబడిన నిందితులు విచారణలో పరిటాల శ్రీరాం పేరుచెప్పడం, హూఠాహుతిన శ్రీరాం పై కేసు నమోదు చేయటం అన్నీ చకచకా జరిగిపోయాయి.
దీని వెనుక రాజకీయ కారణాలు కూడా లేకపోలేదు. కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిని హత్యచేసేందకు పరిటాల తనయుడు ఆయుదాలు సమకుర్చారన్న వాదనలు నిప్పు రాజేస్తున్నాయి. రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి అనంతపురం జిల్లా కంచుకోటగా ఉన్న విషయం తెలిసిందే. కొండపల్లి సీతారామయ్య వర్గంలో ఆధిపత్య పోకడలతో రీ ఆర్గనైజింగ్ కమిటీ ( ఆర్ ఓసీ) పుట్టింది. ఈ వర్గం పరిటాల రవి కనుసన్నల్లో నడిచిందని బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఆర్ ఓ సీ చీలిక గ్రూపుగా పుట్టుకొచ్చి రెడ్ స్టార్ గా ఏర్పడింది. అక్రమంలో ఏర్పడిన అలజడులు అన్నీ ఇన్నీ కావు, వారానికి మూడు హత్యలు, ఆరు కిడ్నాపులుగా ప్రజలను భయ భ్రాంతులకు గురిచేసింది. ఆ గ్రూపు నేత ఎనౌ కౌంటర్ కు గురి కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 2005 లో పరిటాల రవి హత్యతో ఆయన అనుచరులు కనిపించకుండ పోయారు. అజ్నాతం వీడిన నాయకులు ఒక్కక్కరుగా అజ్నాతం వీడుతున్నారు. పరిటా లరవి ప్రధాన అనుచరుడు చమన్ కూడా ఇదే తరహాలోనే బయటకు వచ్చారు. ఇటీవల ధర్మవరంలో జరిగిన హత్యలతో కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిని ప్రధాన కారుకుడిగా అనుమానిస్తున్నారు. ఈనేపధ్యంలోనే కామిరెడ్డిపల్లి సుదాకర్ రెడ్డిని అంతమొందించి రాజకీయంగా తమ ఉనికిని చాటే ప్రయత్నం రూపాంతరం చెందుతుందని వినికిడి. జిల్లాలో కీలక నేతలనే టార్గెట్ గా ఎంచుకుని ముట్టపెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నటుల పోలీసులు గుర్తించటంలో సఫలం చెందారు. యల్లనూరు మాజీ ఎంపీపీ పెద్దారెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించడం లాంటి సంఘటనలు ఇందుకు బలమైన కారణాలుగా వినిపిస్తున్నాయి.
తాజాగా పరిటాల తనయుడి పేరు వినిపించడంతో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందోనని గాయాలు మాని మచ్చలు వున్న నేతలు భీతిల్లుతున్నారు. ముఠా తగాదాలతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది రుపాయలు అస్తలు బుగ్గిపాలయ్యాయి. అయినా హత్యా కాండలకు విరామం కనిపించలేదు. తాజా సంఘటనలు జిల్లా పోలీసులకు సవాల్ గామారింది. గతంలో పని చేసిన ఎస్ పీలు , ప్యాక్షన్ ను రూపుమాపేందుకు తీవ్రంగా క్రుషి చేశారు. అప్పటి పరిస్థితులు పునరావ్రుతం కాకుండా వుండాలంటే పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ఏది ఏమైన జిల్లా లో శాంతి భద్రతలు కాపాడాల్సిన భాధ్యత పోలీసు వర్గాలపైనే వుంది. ఆజ్యం పోస్తున్న ఫ్యాక్షన్ భూతాన్ని మొగ్గలోనే తుంచివేయాలని అనంతపురం ప్రజలు కోరుకుంటున్నారు. రక్తచరిత్ర-3 అనంతలో జరగకుండా చూడాలని పోలీసులను పలువురు కోరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more