ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇప్పడే ఇవ్వక పోయినా సరేగానీ ‘తెలంగాణ అభివృద్ది మండలి’ని ఇచ్చినా మంచిదేనని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ నేతలతో అంటున్నట్లు సమాచారం. గతంలో వైఎస్ హయాంలో ఉప్పు నూతల పురుషోత్తం రెడ్డి ఛైర్మన్‌గా తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి బోర్డును ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ తాజాగా ఆదిశగా చర్యలు తీసుకుంటుందా? అన్న చర్చ తెరపైకి వస్తోంది.తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా కేంద్రం.. ప్రత్యేక మండలిని ప్రకటిస్తే ఎలా అనే అంశంపై టీఆర్‌ఎస్‌లో జోరు గా చర్చలు జరుగుతున్నాయి. మండలి ఇచ్చి నా తమకే మంచిదని ఒక సారి కొట్లాడితే 2009 డిసెంబర్ 9 ప్రకటన వచ్చిందని, రెండోసారి కొట్లాడినందుకు తెలంగాణ ప్రత్యేక అభివృద్ధి మండలిని ఇచ్చినా మూడో సారి గట్టిగా కొట్లాడితే తెలంగాణ రాష్టమ్రే ఇస్తారని కేసీఆర్ పార్టీ నేతలతో చెబుతున్నట్లు తెలియ వచ్చింది. తాజాగా కాంగ్రెస్‌పార్టీ అధిష్ఠానం ఆహ్వానం మేరకే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. కాగా రా జకీ య జేఏసీ నేతలు మాత్రం ఒక వైపున సెప్టెంబర్ 30న మరోసారి తెలంగాణ మార్చ్‌కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో శరవేగంగా సాగుతున్న పరిణామాలు, తెలంగాణపై కేంద్రం వేస్తున్న అడుగులను నిశితంగానే గమని స్తున్నారని సమాచారం.
కేసీఆర్‌ను ఢిల్లీలో సెప్టెంబర్ రెండోవారంలో ఒకటి రెండు రోజులు అందు బాటులో ఉండాలని ఏఐసీసీ పెద్దలు కోరి నట్లు తెలుస్తోందని, దీనికి తాము ప్రకటించిన తెలంగాణ మార్చ్ ప్రభావమే కారణమని పొలిటికల్ జేఏసీ నేతలు చెబుతున్నారు. రెండు, మూడు వారాల్లో తెలంగాణ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటిస్తుం దని కేసీఆర్ తనను కలిసిన పార్టీనేతలకు, తెలంగాణ వాదులకు చెబుతున్న ట్లుగా వార్త లు వినిపిస్తున్నాయి. కాగా కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.‘‘ సెప్టెంబర్ రెండు, మూడో వారాల్లో తెలంగాణ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటిస్తుందని, ఈ విషయాన్ని సోనియానే తనకు స్వయంగా చెప్పారని ఇక తెలంగాణ ప్రకటించడమే తప్ప దీనిపై చర్చ లేమీ ఉండవని, ఈ విషయాన్ని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి, పీసీసీ చీఫ్ బొత్సకు, ఎంపీ చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్పేసిందని కేసీఆర్ అన్నట్లు సమాచారం. 5న ఢిల్లీ వెళ్తున్న తాను కాంగ్రెస్ పెద్దలను కలుస్తానని పార్టీ విలీనం తదితర అంశాలు చర్చించేఅవకాశాలున్నాయని కేసీఆర్ అన్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more