మెగాస్టార్ తనయుడు మరొ అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో సంచలన రేపిన హీరో గా పేరు తెచ్చుకున్న మెగా పవర్ రామ్ చరణ్. ఒక కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదటి సారిగా టాలీవుడ్ హీరో రామ్ చరణ్ బాలీవుడ్ వెండి తెరపై జంజీర్ సినిమాతో కనిపించనున్నాడు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఏ హీరో బాలీవుడ్ లో పూర్తి షూటింగ్ జరిపిన సన్నివేశాలు లేవు. కానీ హీరో రామ్ చరణ్ తో మొదటి సారిగా బాట పడిందని ఫిలింనగర్ వాసులు అనుకుంటున్నారు. గతంలో రానా హీరోగా బాలీవుడ్ కు పరిచయం అయినప్పటికి పెద్దగా ఫలితం లేకుండా పోయిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడ రామ్ చరణ్ ఎంట్రీతో బాలీవుడ్ లో టాలీవుడ్ హీరోల పరంపరలు జరుగుతాయనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొత్తగా పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ తన భార్య ఉపాసనలు కలిసి కొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తమ సొంత ఇంటి కోసం ముంబయిలో వేట సాగిస్తున్నాడని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. గత వారం రోజుల క్రిందట ముంబయి వెళ్లిన రామ్ చరణ్ బాలీవుడ్ కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్ ను కలిసినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ నివాసముండే బాంద్రా పరిసరాల్లోనే ఇంటిని కొనుగోలు చేసేందుకు చరణ్ ప్రయత్నిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సల్మాన్ ..రామ్ చరణ్ రాకతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ కు సల్మాన్ మంచి ఆతిథ్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సల్మాన్ దగ్గరుండి చరణ్ సొంతింటి కలను నిజం చేయటానికి సల్మాన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రముఖ బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారుల్ని కూడా చరణ్ కు పరిచయం చేసినట్లు బాలీవుడ్ వాసులు చెప్పుకుంటున్నారు. చరణ్ వెళ్లిన సందర్భంలోనే సల్మాన్ సోదరి అర్పిత జన్మదిన వేడుకలు కలిసిరావటంతో మెగా తనయుడు రామ్ చరణ్ హాజరైనట్లు తెలుస్తోంది. అయితే మొత్తం మీద సల్మాన్ ఖాన్ చరణ్ కు బాంద్రాలో ఉన్న మూడు హౌస్ లను చూపించినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సల్మాన్ చేసిన సహాయానికి చరణ్ ఆనందంతో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే తన భార్య ఉపాసనతో చర్చించి ఈ మూడింటిలో ఒకదాన్ని కొనుగోలు చేస్తానని సల్మాన్ తో రామ్ చరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద మెగా స్టార్ తనయుడు ముంబయిలో నివాసం ఏర్పాటు చేసుకోవటం మెగా అభిమానులకు చాలా ఆనందంగా ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more