కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి .. తెలుగుదేశం పార్టీ పై దూకుడు పెంచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేసి ..యుద్దం చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు బీసీలకు 100 సీట్లు పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే రాజ్యాధికారం కోసం బాబు ఇలా ప్రకటనలు చేస్తున్నాడని జగన్ పార్టీ నాయకులు అప్పట్లో తీవ్రమైన విమర్శలు చేసి. అలసిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడు వైఎస్ ఆర్ సీపీ తన పంథా మార్చినట్లు కనబడుతుందని .. మీడియా వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ డెత్ బెడ్ ఎక్కిందని జగన్ పార్టీ నాయకులు అంటున్నారు. అసలు వైఎస్ విజయమ్మ గతంలో .. కాంగ్రెస్ పార్టీ పై ఎన్నో విమర్శలు చేసిన ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పై ఒక్క విమర్శ కూడా చెయకపోవటం పై అనేక అనుమానాలు వస్తున్నాయాని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. తన కొడుకు ను బయటకు తీసుకురావటానికి వైఎస్ విజయమ్మ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుందా? లేక కాంగ్రెస్ పార్టీతో రాజీ కుదిరిందా? 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవటానికి జగన్ పార్టీ సిద్దమైందా? అనే అనుమానాలు వస్తున్నాయని టీడీపీ నాయకులు అంటున్నారు. అయితే ఇప్పుడు వైఎస్ విజయమ్మ కొత్త ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మా పార్టీ కూడా బీసీలకు 100 సీట్లు ఇస్తామని మీడియా ప్రకటన చేయటంతో కొత్త రాజకీయానికి తెరలేపినట్లుగా ఉందని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.రాజ్యాధికారంలో వెనుకబడిన తరగతులకు చెందిన కులాలను భాగస్వాములను చేయటంలో మేము సైతం.. అంటూ వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ నడుం బిగించినట్లు తెలుస్తోంది.రానున్న శాసనసభ ఎన్నికల్లో ఈ వర్గాల వారికి వంద టిక్కెట్లు కాదు...శాసనసభలో వంద స్థానాలే కేటాయిద్దామని కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు జగన్ పార్టీ నాయకులు. తెలుగుదేశంపార్టీ రానున్న ఎన్నికల్లో బీసీలకు వంద టిక్కెట్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపద్యంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ప్రకటించినట్లు తెలుస్తోంది.
అయితే బీసిలకు 100 సీట్ల పై విజయమ్మ ఒక లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆ లేఖ లో చంద్రబాబును టార్గెట్ చేసినట్లుగా ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు డిక్లరేషన్ ను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ రాజకీయంగా కాస్త లాభపడుతుందని అనుమానించిందో, లేక బిసిలలో కూడా తమ పట్టు పెంచుకునేందుకో తెలియదు కాని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త సవాల్ ను విసిరింది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ టిడిపి ని ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాశారు. దాని ప్రకారం బిసిలకు వంద టిక్కెట్లు కాదు, శాసనసభలో బిసిలకు వంద సీట్లు కేటాయిద్దామని ఆమె సవాల్ విసిరారు."బీసీల జనాభా ప్రాతిపదికన ఏ 100 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు తప్ప వేరెవరికీ టికెట్లు ఇవ్వరాదో లాటరీ ద్వారా నిర్ణయిద్దాం. ఇందుకు రెండు పార్టీలుగా మనం కూర్చుందాం'' అని టీడీపీని విజయలక్ష్మి ఆహ్వానించారు. ఈ నిర్ణయానికి వైసీపీ, టీడీపీ సిద్ధపడితే, కాంగ్రెస్‌సహా మిగిలిన పార్టీలు కూడా అందుకు అంగీకరించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. బీసీలపై చేతల్లో ప్రేమ చూపే పార్టీగా ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు పేర్కొన్నారు."మీకు నిజాయితీ, బీసీలకు మేలు చేసే ఉద్దేశం ఉంటే మా ప్రతిపాదనను అంగీకరించండి. ఊరికే ఢిల్లీకి వెళ్లి జరగని పనికి డ్రామా ఆడటం కంటే, శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేద్దాం. వంద మంది బీసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తలెత్తుకు నిలబడి ఉండేలా చేద్దాం'' అని విజయలక్ష్మి ఆ లేఖలో చంద్రబాబుకు సవాల్ విసిరారు.విజయమ్మ వ్యూహాత్మకంగా విసిరిన సవాల్ ను టిడిపి ఎంత సీరియస్ గా తీసుకుంటుందన్నది సందేహమే.అలాగే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కూడా అంత సీరియస్ గా ఈ సవాల్ విసిరిందా అన్నది చర్చనీయాంశమే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more