వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అదినేత జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో సుడిగాలి ఎదురైంది, లక్ష కోట్లు సంపాదించాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోవటం జగన్ ఇష్టం . కానీ చేతిలో డబ్బుందని, ఎంతటి న్యాయవాదులను అయినా కొని చట్టంలో బొక్కలన్నింటినీ వాడుకోవాలనుకునే జగన్ కు హైకోర్టు నిర్ణయం ఝలక్ ఇచ్చింది. ఖాతాల స్తంభనకు సంబంధించి వేర్వేరు పిటిషన్లు వేయడం ద్వారా గతంలో పరిమితంగా ఖాతాల నిర్వహణకు వెసులుబాటు పొందిన సాక్షి మళ్లీ ఖాతాలపై ఉన్న పరిమిత నిషేదాజ్ఞలు కూడా తొలగించాలని కోరుతూ పిటిషన్లు వేసింది. అది కూడా జగతి పబ్లికేషన్స్ పేరున ఒక పిటిషను, జననీ ఇన్ ఫ్రా పేరిట ఒకటి, ఇందిరా టెలివిజన్ తరఫున మరోటి. పైగా జగన్ ప్రతినిధులు మొదట్నుంచి ప్రతి కేసుపైనా రకరకాల వ్యక్తులతో అనేక పిటిషన్లు వేయించేది. అయితే, ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని గమనిస్తున్న హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇష్టాను సారం పిటిషన్లు వేసి విలువైన కోర్టు సమయాన్ని వృథా చేయడమే కాకుండా, తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తన్న ఆ మూడు కంపెనీలకు లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఇలా పదేపదే పిటిషన్లు ఎందుకు వేస్తారని ప్రశ్నించడంతో జగన్ తరఫున న్యాయవాదులు ఖంగుతిన్నాట్లు కోర్టు వర్గాలు చెబుతున్నాయి ఇక ముందు ఇలా జరక్కుండా చూడాలని గట్టిగా చురకలు అంటించదని ..కోర్టు వర్గాలు అంటున్నాయి . నిజానికి ఒక కంపెనీ నడవాలంటే బ్యాంకు ఖాతాలు చాలా ముఖ్యం. వాటిపై ఆంక్షలు విధిస్తే కంపెనీలు నడపడం కష్ట సాధ్యం. అయినప్పట్టికీ హైకోర్టును విసిగించేలా వీరు పిటిషన్ లు వేసినట్లు హైకోర్టు భావించినట్లు కనబడుతుందని కొంత మంది న్యాయ వాదులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more