భూములు, భవనాల రిజిస్ట్రేషన్ విలువ పెంచేందుకు ముందు సర్కారు ప్రజలపై మరో భారం మోపేందుకు సిద్ధమైంది. ప్రధాన ఆదాయ వనరైన రిజిస్ట్రేషన్ చార్జీలపై దృష్టి పెట్టింది. కొన్నిరకాల రిజిస్ట్రేషన్ చార్జీలను ఏకంగా 50రెట్లు పెంచేసింది. ఇప్పటివరకు వెయ్యిరూపాయలతో సరిపోయే రిజిస్ట్రేషన్ ఛార్జి ఇప్పుడు ఆస్తి విలువలో అరశాతం వరకు అవుతోంది.ఇళ్ల స్థలాల క్రయవిక్రయాలకు సంబంధించిన ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్ ఛార్జీలను కూడా భారీగా పెంచేసింది. ఇదివరకు ఈసీ కోసం 120రూపాయలు చెల్లిస్తే సరిపోయేది. ఇక నుంచి కాలాన్ని బట్టి ఈసీల కోసం మూడు రకాల ఫీజులు నిర్ణయించింది. 13ఏళ్లలోపు లావాదేవీల వివరాలతో ఈసీ కావాలంటే రూ.200. 13-30ఏళ్ల మధ్య లావాదేవీలకు రూ.500, 30ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి వెయ్యి రూపాయల రుసుం చెల్లించాలి. ఇక వివాహ నమోదు తప్పనిసరి అన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఆసరాగా తీసుకున్న ప్రభుత్వం నమోదు ఛార్జీని 40రెట్లు పెంచింది. ఇదివరకు ఐదు రూపాయలుగా ఉన్న రిజిస్ట్రేషన్ రుసుమును ఏకంగా 200కు పెంచింది.
దీనికి తోడు.. లీజు, తనఖా, టైటిల్ డీడ్ల డిపాజిట్ రుసుమును సర్కారు 0.1శాతంగా నిర్ణయించింది. సొసైటీల రిజిస్ట్రేషన్ రుసుమును రూ. 200నుంచి రూ. 500కు పెంచింది. అప్పీళ్లు, డూప్లికేట్ కాపీల చార్జీ రూ. 100 నుంచి రూ. 300కు పెంచింది. సవరణ ఫీజులు, వీలునామాల భద్రతా రుసం కూడా భారీగా పెంచేసింది. రిజిస్ట్రేషన్ సమయంలో దిక్కులు, ఇంటిపేర్లు, ఉప నంబర్లు వంటి అంశాల్లో తప్పులు నమోదైతే సవరించేందుకు ఇప్పుడున్న ఛార్జీలను ఏకంగా 50శాతం పెంచింది. ప్రస్తుతం100 రూపాయలున్న ఛార్జీని రూ.5 వేలకు చేసింది. చరాస్తుల తనఖా ఒప్పంద రుసుం కూడా రూ.100 నుంచి రూ.5వేలకు పెరిగింది. ఇక అటెస్టేషన్ ఆఫ్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ.. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, సెలవు దినాల్లో రిజిస్ట్రేషన్, భాగస్వామ్య ఒప్పందాల ఛార్జీలు కూడా 5వేలకు పెంచింది. వీటి ఛార్జి ప్రస్తుతం 100నుంచి 500ఉంది. సీల్డుకవర్లలో వీలునామాలను భద్రపరిచేందుకు ప్రస్తుతమున్న100రూపాయల ఛార్జీని 5వేలకు పెంచింది. ఇక హక్కుదారు కదలలేని పరిస్థితుల్లో ఉంటే రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకం పెట్టించుకునేందుకు సబ్ రిజిస్ట్రారు కార్యాలయ సిబ్బంది ఇంటికి వచ్చే వెసులుబాటు ఉంది. దీనినే ప్రైవేటు అటెండెన్స్ అంటారు. దీనికి ఇదివరకు 500వసూలు చేయగా ఇప్పుడది. 5వేలకు చేరింది.
అక్రమార్కులు, అవినీతి పరులను చీల్చిచెండాడి సొమ్ములు రాబట్టడం మాని.. సర్కారు అభాగ్యులు, అమాయక ప్రజలకు ఇలా ఒంగోబెట్టి గుద్దుడు గుద్దుతుంది ఏంచేస్తాం..భరించడమేనా...
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more