తెలంగాణపై కేంద్రంలో నిజంగానే కదలిక వచ్చిందా రాష్ట్ర నేతలతో ఢిల్లీ పెద్దల మంత్రాంగాలు రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవడానికేనా అందరి ప్రయోజనాల కోసం తెలంగాణా అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని అందరూ అంగీకరించారన్న హోంమంత్రి చిదంబరం వ్యాఖ్యల అంతరార్దమేంటి ఇన్నాళ్లూ నాలుగు పార్టీలు నిర్ణయం చెప్పాల్సి ఉందంటూ వచ్చిన చిదంబరం త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఉంటుందని చెప్పడానికి దారి తీసిన పరిస్థితులేంటి ఢిల్లీలో పరిణామాలు చూస్తుంటే ఈ సారి ఖచ్చితమైన నిర్ణయం దిశగానే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. గత రెండేళ్లుగా నానుస్తూ వస్తోన్న తెలంగాణా అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. విస్తృత స్థాయి సంప్రదింపుల పేరుతో పలు మార్లు ఇరు ప్రాంత నేతలతో చర్చించిన కాంగ్రెస్ అధిష్టానంలో ఉపఎన్నికల ఫలితాల తర్వాత కదలిక వచ్చింది.
రాష్ట్రంలో నానాటికీ దిగజారుతున్న పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలంటే రాష్ట్ర విభజన సమస్యని పరిష్కరించి తీరాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలు హైకమాండ్ ని కలవర పెడుతున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న వరుస పరిణామాలు పార్టీ ప్రక్షాళనతో పాటు తెలంగాణాపై నిర్ణయం దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణా అంశంపై నిర్ణయం తీసుకోలేక సతమతవుతున్న హైకమాండ్ మరోసారి రాష్ట్ర నేతల అభిప్రాయాలని, వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తోంది. ఇందుకోసం స్వయంగా రంగంలోకి దిగిన అధినేత్రి సోనియా, రాష్ట్ర నేతలందరినీ కలిసి అభిప్రాయాలని సేకరిస్తున్నారు.
మరోవైపు వాయలార్ రవి, ఆజాద్లు కూడా తెర వెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు. సీమాంధ్ర నేతలకి, అధిష్టానానికి మద్యవర్తిగా ఉన్న కావూరి ద్వారా వాయలార్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు నడిపిస్తున్నారు. అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా రాష్ట్రపరిస్థితులపై వివరాల్ని సేకరిస్తున్నారు. గత ఏడాదిన్నరగా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించిన ప్రతిసారి నాలుగు పార్టీలు నిర్ణయం చెబితే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెబుతోన్న చిదంబరం మాట మార్చారు. కాంగ్రెస్ పార్టీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పడానికి గల కారణం తెర వెనుక కాంగ్రెస్ అధిష్టానం జరుపుతున్న సంప్రదింపులేనని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. ఈ కారణంగానే అందరి ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణాపై నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకతని అందరూ గుర్తించారని, తాము కూడా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని చిదంబరం చెప్పారు.రాష్ట్ర విభజన సమస్యపై నిర్ణయం తీసుకోవాలని ఇప్పుడు తెలంగాణా నేతలతో పాటు సీమాంధ్ర నేతలు కూడా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయంలో నెలకొన్న అనిశ్చితికి తెర దించితే తప్ప రాష్ట్రంలో పరిస్థితులు మెరుగుపడవని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం తెలంగాణా సమస్యకి ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలని వారి ముందుంచుతున్నట్టు సమాచారం. ఇన్నాళ్లూ సమైఖ్యాంధ్ర నినాదం వినిపించిన రాయలసీమ నేతల స్వరం మారడానికి రాయల తెలంగాణా ప్రతిపాదనే అని వారు చెబుతున్నారు. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాల నాయకులు ఈ ప్రతిపాదనకి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. కర్నూలు, అనంతపురం జిల్లాలని తెలంగాణాతో కలపడం ద్వారా సామాజిక వర్గ సమీకరణాలతో పాటు, ఈ రెండు జిల్లాలకి జల వనరుల పంపిణీలో కూడా సమస్యలు రావన్న భావనలో వారున్నారు. అయితే ఆ ప్రతిపాదనని కోస్తా నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రాన్ని విభజించాల్సిన పరిస్థితే వస్తే, మూడు భాగాలుగా చేయడంతో పాటు హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని వారు పట్టుబడుతున్నట్టు సమాచారం. అందువల్లే రాయల తెలంగాణా ప్రతిపాదన ఇంకా అంతర్గత చర్చలకే పరిమితమయిందని చెబుతున్నారు. అయితే తెలంగాణాపై ఏర్పడ్డ పీఠముడి ఇంకా అలాగే ఉన్నా, ఆజాద్, వాయలార్ తో పాటు ఇప్పుడు స్వయంగా సోనియా రంగంలోకి దిగడంతో ఈ సమస్యకి త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని సోనియాని కలిసిన ఎంపీ సర్వే సత్యనారాయణ ధృవీకరించారు. తెలంగాణ సమస్య పట్ల మేడమ్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని, త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని ఆయన చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల తరువాత రాష్ట్రంలో భారీ మార్పులుంటాయని ఆయన అంటున్నారు. మొత్తం మీద ఢిల్లీ పరిణామాలు తెలంగాణాపై కాంగ్రెస్ అధిష్టానంలో కదలిక వచ్చిన విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే గతంలో కూడా చాలా సార్లు ఇదేవిదంగా హడావిడి చేసి ఏ నిర్ణయం తీసుకోని హైకమాండ్, ఈసారన్నా అనిశ్చితికి తెర దించుతుందో లేదో వేచి చూడాలి.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more