Why arrest jagan before bypolls asks vijayamma

Why arrest Jagan before bypolls? asks Vijayamma,YS Sharmila alleged Congress and TDP, had colluded and were using their influence on CBI with regard to Jagan,

Why arrest Jagan before bypolls? asks Vijayamma

arrest.gif

Posted: 06/01/2012 04:48 PM IST
Why arrest jagan before bypolls asks vijayamma

amma

గన్ ఏనాడైనా మంత్రులతోనైనా.. ఆఫీసర్లతోనైనా మాట్లాడాడని చెప్పగలరా? మరెందుకు జగన్‌ను వేధిస్తున్నారని అడుగుతున్నా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కాంగ్రెస్, టీడీపీని నిలదీశారు.‘నా బిడ్డ జగన్‌బాబు ఏం తప్పు చేశాడు? రాజశేఖరరెడ్డి గారు సీఎంగా ఉన్నపుడు పక్కనే ఉన్న ఆయన క్యాంప్ ఆఫీసుకు కూడా జగన్ ఏరోజూ వెళ్లలేదే! కనీసం సెక్యూరిటీలో చూసిన వారున్నారా? అని విజయమ్మ అడుగుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

అయితే విజయమ్మకు టిడిపి నాయకులు గట్టిగ సమాధానం చెబుతున్నారు. ఒక అవినీతి ముఖ్యమంత్రికి భార్యగా, ఒక అవినీతి చక్రవర్తికి తల్లిగా విజయలక్ష్మి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు శోభా హైమవతి ఎద్దేవా చేశారు. జగన్ అరెస్టుకు వ్యతిరేకంగా జనంలోకి వెళుతున్న విజయలక్ష్మి.. ఆయన అవినీతిపై తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 24 ప్రశ్నల జాబితాను ఆమెకు సంధించారు. దానిని మీడియాకు విడుదల చేశారు.

1. జగన్ జైలుకెళ్లడం వల్ల నేతలు, కార్యకర్తలు తిరిగి కాంగ్రెస్‌లోకి జారుకుంటారనే భయంతోనే విజయలక్ష్మి, ఆమె కుమార్తె షర్మిలను రోడ్డెక్కించడం నిజం కాదా?

2. రోజూ ఉదయం ఆరింటికే సీఎం క్యాంపు కార్యాలయంలో మీ భర్త, కొడుకు..కోనేరు ప్రసాద్ లాంటి వారితో బేరసారాలు సాగిస్తున్నప్పుడు ఎందుకు హెచ్చరించలేదు?

3. ఎమ్మార్ విల్లాలు పదిరెట్లకు అమ్మి కోనేరు ప్రసాద్ ఇచ్చిన కోట్లాది రూపాయలను సునీల్‌రెడ్డి మీ ఇంటి ఖర్చులకు, విలాసాలకు ఖర్చు పెడుతున్నప్పడు అవి ఎక్కడివని ఏ రోజైనా అడిగారా?

4. సండూర్ పవర్‌లోకి హవాలా డబ్బు రూ.వెయ్యి కోట్లు తరలించడం నేరమని, దానివల్ల జైలుకు పోవాల్సి వస్తుందని మీ భర్తను, కొడుకును ఎందుకు హెచ్చరించలేదు?

5. పులివెందుల కృష్ణ, భానుకిరణ్, మధుమోహన్‌రెడ్డి వంటి నేరస్తులతో స్నేహం చేసినప్పుడు మీ కొడుక్కి బుద్ధులు ఎందుకు చెప్పలేదు?

6. పరిటాల రవి సహా 200 మంది టీడీపీ కార్యకర్తలను వైఎస్ ప్రోత్సాహంతో జగన్ గ్యాంగ్ హత్య చేసినప్పుడు వారికీ భార్య, పిల్లలు ఉంటారని తెలియదా?

7. మీ బిడ్డ కారణంగా జైలు పాలైన బీపీ ఆచార్య, రాజగోపాల్‌ల ముసలి తల్లులను మీరు కనీసం ఓదార్చారా?

ఇలా చెప్పుకుంటు పోతు ఇంక చాలా ఉన్నాయాని టీడీపీ మహిళ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dhammu actress karthika
I suspect congress in ysrs death ys vijayamma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more